
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జూన్ 12న ఘోర విమాన ప్రమాదం జరిగిన దరిమిలా అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముగ్గురు శిక్షణ పొందిన పైలట్లు ఎయిర్‌లైన్స్ బోయింగ్ 787 విమాన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ పైలట్లు విద్యుత్ వైఫల్యాలను తిరిగి సృష్టించారు. ఫలితంగా డ్యూయల్-ఇంజిన్ నిలిచిపోయంది. దీంతో విమానం టేకాఫ్ తర్వాత పైకి వెళ్లలేకపోయింది.
ప్రమాద ఘటన అనంతరం జెట్‌లైనర్ బ్లాక్ బాక్స్‌ల నుండి ఇప్పటికే డేటాను డౌన్‌లోడ్ చేసుకున్న పరిశోధకులు, 787లోని ఇంధన స్విచ్‌ల స్థానాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇంధన స్విచ్‌ల శిధిలాలతో ఈ డేటాను ధృవీకరించనున్నారు. విమానం క్లిష్టమైన దశకు చేరుకున్నప్పుడు టేకాఫ్ రన్ సమయంలో పైలట్లు అనుకోకుండా ఏదైనా స్విచ్ ఆఫ్ చేశారా? అనేదానిని నిర్ధారించడానికి రీక్రియేషన్ ఉపకరించనుంది.
రీక్రియేషన్ చేసిన పైలెట్లు ఘటన జరిగిన నాటి పరిస్థితులను తిరిగి సృష్టించారు. ఈ ఫలితాలతో ట్రిమ్ షీట్ డేటాను రూపొందించారు. ట్రిమ్ షీట్ అనేది విమానం సమతుల్యతను లెక్కించడానికి, రికార్డ్ చేయడానికి ఏవియేషన్‌లో ఉపయోగించే విధానం. ఇది విమానపు టేకాఫ్, ల్యాండింగ్ కోసం గురుత్వాకర్షణ కేంద్రం సురక్షిత పరిమితుల్లో ఉందని నిర్ధారిస్తుంది. శిక్షణ పైలట్లు ఒకే ఇంజిన్ వైఫల్యాన్ని రీక్రియేట్ చేసి, పలు వివరాలను సేకరించారు. కాగా ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలోని పైలట్‌లకు 400 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు డ్యూయల్-ఇంజిన్ వైఫల్యం తలెత్తితే, దానిని ఎదుర్కొనేందుకు శిక్షణ అందించలేదని సమాచారం.
ఇది కూడా చదవండి: బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం