కేంద్రం హెచ్చరికను పెడ చెవిన పెట్టి.. 242 మంది మృతికి ఎయిరిండియానే కారణమా? | Air India plane crash: Boeing 787 Dreamliner has a history of technical issues | Sakshi
Sakshi News home page

కేంద్రం హెచ్చరికను పెడ చెవిన పెట్టి.. 242 మంది మృతికి ఎయిరిండియానే కారణమా?

Jun 12 2025 6:41 PM | Updated on Jun 12 2025 7:20 PM

Air India plane crash: Boeing 787 Dreamliner has a history of technical issues

గాంధీ నగర్‌: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు మరణించిన జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరణాలపై కేంద్రం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. 

అయితే ఈ విమాన ప్రమాదానికి కారణం ఎయిరిండియా?నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కూలిన విమానం ఇప్పటికే గతంలో పలు మార్లు మొరాయించింది. గత డిసెంబర్‌లో ఇదే ఫ్లైట్‌లో పొగలు కమ్ముకున్నాయి. గతవారం ఇదే విమానం ప్యారిస్‌ వెళ్తుండగా మొరాయించడంతో పైలెట్‌  షార్జాలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. వరుస ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానానికి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్‌ 787-7 డ్రీమ్‌ లైనర్‌ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే.. 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.

ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే.. అదీ ఎయిర్‌పోర్ట్‌ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది. విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు,ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement