ఎయిర్‌ ఇండియాకు షాక్‌ల మీద షాక్‌లు! | 6 Air India Dreamliner International Flights Cancelled June 17th | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియాకు షాక్‌ల మీద షాక్‌లు!

Jun 17 2025 7:33 PM | Updated on Jun 17 2025 7:56 PM

6 Air India Dreamliner International Flights Cancelled June 17th

న్యూఢిల్లీ: భారతదేశ ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిర్‌ ఇండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఈరోజు(మంగళవారం, జూన్‌ 17) వరుసపెట్టి ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. మంగళవారం ఆరు ఎయిర్‌ ఇండియా విమానాలు రద్దయ్యాయి. 

రద్దయిన ఆరు ఎయిర్‌ ఇండియా విమానాలు కూడా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానాలే కావడం గమనార్హం. AI 153(ఢిల్లీ-వియన్నా),  AI 143(ఢిల్లీ-పారిస్‌),  AI 159 (అహ్మదాబాద్‌-లండన్‌), AI 133 (బెంగళూరు-లండన్‌), AI 170 (లండన్‌-అమృత్‌సర్‌)లతో పాటు శాన్‌ఫ్రానిస్కక్ష నుంచి ముంబై రావాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం ఈ రోజు ఉదయమే రద్దయ్యింది. 

అధునాతన టెక్నాలజీతో నడిచే బోయింగ్‌ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోవడంతో విమాన తనిఖీలు ముమ్మరం చేశారు.  ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియాకు చెందిన ఆరు బోయింగ్‌ విమానాల్లో సమస్యలు కనిపించడంతో ప్రయాణికుల్లో ఆందోళన కనబడుతోంది.  విమానం మాట ఎత్తితేనే హడలిపోతున్న ప్రయాణికులు.. బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం అంటే వామ్మో అని పరిస్థితికి వచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement