సౌదీ సర్వీసులపై ఎయిరిండియా కీలక ప్రకటన | Air India AI Express Extends Flight Cancellations To Saudi Arabia | Sakshi
Sakshi News home page

సౌదీ సర్వీసులపై ఎయిరిండియా కీలక ప్రకటన

Nov 14 2026 7:15 AM | Updated on Nov 14 2026 7:18 AM

Air India AI Express Extends Flight Cancellations To Saudi Arabia

ముంబై: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును ఎయిరిండియా మరోసారి పొడిగించింది. రియాద్, దమ్మమ్‌ నగరాలకు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను ఈ నెల 30 వరకు, జెడ్డాకు సర్వీసులను ఈ నెల 21వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఓ ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది.

నవంబర్‌ 10వ తేదీన, అంతకుముందు బుక్‌ చేసుకున్న వినియోగదారులకు రీషెడ్యూల్‌ సదుపాయం వర్తింప జేస్తామని లేదా టిక్కెట్‌ సొమ్ము వాపసు చేస్తామని ఎయిరిండియా తెలిపింది. ఇండిగో సంస్థ సైతం జెడ్డా, మదీనాలకు తమ విమాన సర్వీసుల రద్దును నవంబర్‌ 21వరకు పొడిగిస్తున్నట్లు 10వ తేదీన ప్రకటించింది. ఆకాశ సంస్థ సైతం రియాద్, జెడ్డాలకు సర్వీసుల రద్దును నవంబర్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: అమెరికా: ఎయిర్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ క్రాష్‌.. నిలిచిపోయిన వైమానిక సేవలు

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement