ఇదే నాకు చివరి రాత్రి.. గుడ్‌ బై ఇండియా! | Plane Accident: Britons Instagram Post Before Boarding | Sakshi
Sakshi News home page

ఇదే నాకు చివరి రాత్రి.. గుడ్‌ బై ఇండియా!

Jun 12 2025 8:57 PM | Updated on Jun 13 2025 9:45 AM

Plane Accident: Britons Instagram Post Before Boarding

ఆయనొక యోగా ఔత్సాహికుడు.. భారత్‌లో యోగా ప్రోగ్రామ్‌లు నిమిత్తం అహ్మదాబాద్‌కు వచ్చారు. కొన్ని రోజుల పాటు అహ్మదాబాద్‌లోని ద హౌస్‌ ఆఫ్‌ ఎంజీలో బస చేశారు. ఇక ఇక్కడ ప్రోగ్రామ్‌లు పూర్తి కావడంతో భారత్‌ గురించి, అహ్మదాబాద్‌లోని తాను బస చేసిన హోటల్‌ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా బ్రిటన్‌లో ఉన్న భార్యకు షేర్‌ చేశాడు. అహ్మదాబాద్‌లోని ద హౌస్‌ ఆఫ్‌ ఎంజీపై ప్రశంసలు కురిపించారు. 

నిజంగానే ఒక హెరిటేజ్‌ హోటల్‌ అని, భారత్‌లోని తన అనుభవాలు అద్భుతమని ఇలా ఒక్కో స్టోరీని పంచుకున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి(బుధవారం, జూన్‌ 11) ఇదే ఇక్కడ చివరి రాత్రి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇప్పుడు అదే వైరల్‌గా మారింది. దాంతో పాటు విమానం ఎక్కేముందు ‘గుడ్‌ బై ఇండియా’ అని బ్రిటన్‌కు చెందిన జమీ మీక్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం కాసేపటికి ఆయన విమానం ప్రమాదంలో మృతి చెందడం జరిగిపోయాయి.  

ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!
 

కాగా, గురువారం(జూన్‌ 12) అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇలా టేకాఫ్‌ తీసుకున్న తర్వాత జనవాసాలపై కూలిపోయింది. బీజే మెడికల్‌ స్టూడెంట్స్‌ హాస్టల్‌పై కూలిపోవడంతో పలువురు వైద్య విద్యార్థులు సైతం దుర్మరణం చెందారు.  అయితే విమాన ప్రమాదం నుంచి  ఒకే ఒక్రరు బ్రతికిబయటపడ్డారు. 

ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు

Advertisement
 
Advertisement
Advertisement