17 మందికి గాయాలు
ఢిల్లీకి వస్తుండగా ఘటన
న్యూఢిల్లీ: ప్రశాంతంగా సాగుతున్న విమాన ప్రయాణానికి అకస్మాత్తుగా భారీ గాలులు తోడవడంతో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఎయిర్ ఇండియా ఏ320నియో రకం ఏఐ2379 నంబర్ విమానం ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్నప్పుడు మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈ అనూహ్య ఘటన జరిగింది. భారీ గాలులకు కుదుపులకు గురవడంతో గాల్లో విమానం ఒక్కసారిగా 300 అడుగుల కిందకొచి్చంది. దీంతో విమానంలోని పలువురు ప్రయాణికులు సీట్ల నుంచి ఎగిరి పైకప్పు, కిటికీలకు ఢీకొనడంతో గాయాలపాలయ్యారు.
ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. తర్వాత పైలట్ విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌చేశారు. గాయపడిన వారికి ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రాథమిక చికిత్సచేసి తర్వాత సమీప ఆస్పత్రుల్లో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. విమాన సిబ్బందిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగినప్పుడు విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు.


