ముగ్గురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
నగావ్: సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఓ జవాను ముగ్గురు తోటి జవాన్లపై కాల్పులు జరిపి, ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అసోంలోని నగావ్ జిల్లా కటిమారి సీఆర్‌పీఎఫ్ 34వ బెటాలియన్ క్యాంపు కార్యాలయంలో ఈ హఠాత్పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బెల్లాన ప్రేమబారం క్యాంపులో ఏఎస్సైజీడీ(అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, జనరల్ డ్యూటీ)గా పనిచేస్తున్నారు.
మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మెయిన్ గేట్ వద్ద డ్యూటీ దిగారు. తిరిగి వెళ్తూ గార్డు రూమ్‌లోని ఇన్సాస్ రైఫిల్‌ను తీసుకుని, వెనుక వైపు ఉన్న క్వార్టర్ గార్డు వైపు వెళ్లారు. అక్కడ ఆయన హవల్దార్ విష్ణు ప్రసాద్ బఘేల్, ఎస్సై రామ్‌నావల్ సింగ్ యాదవ్, ఏఎస్సై మానె గోవింద్ శ్రీపుల్‌పై కాల్పులు జరిపారు. అనంతరం బారక్‌లోకి వెళ్లి తనను తాను కాల్చుకున్నారు. ఈ ఘటన లో ప్రేమబారంతోపాటు విష్ణు ప్రసాద్ బఘే ల్, రామ్‌నావల్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన శ్రీపుల్‌ను వెంటనే గువాహటిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.


