సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య | Young woman commits suicide after not being allowed to buy a cellphone | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య

Jun 8 2026 3:00 AM | Updated on Jun 8 2026 3:00 AM

Young woman commits suicide after not being allowed to buy a cellphone

గూడూరు: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని క్షణికా వేశంలో ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డు రాములు–కరుణశ్రీ దంపతులకు కూతురు బిందు (22), ఇద్దరు కుమారులు న్నారు. కూతురు పీజీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. 

శనివారం రాత్రి సెల్‌ఫోన్‌ కొనివ్వాలని బిందు తండ్రిని అడగడంతో డబ్బులు లేవన్నాడు. దీంతో క్షణికావేశానికి గురైన ఆమె రాత్రి బయటికి వెళ్లింది. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. తండ్రి బొడ్డు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement