breaking news
Bindu
-
ఈ కెమెరాకు భయం లేదు
‘బిందూ... బాడీ’... అని ఆమెకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో. బిందు ఫ్రీలాన్స్ ఫోరెన్సిక్ ఫొటోగ్రాఫర్. రాత్రిళ్లు ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు సీన్ దగ్గర ఉన్న మృతదేహాలను చట్టపరమైన సాక్ష్యాలకు ఉపయోగపడేలా ఫొటోలు తీయడం ఒక విద్య. ఆ విద్యలో ఆరితేరిన బిందు కేరళలో ఇప్పటికి 3000 కేసులకు ఫొటోగ్రాఫర్‌గా పని చేసింది. పురుషులైనా స్త్రీలైనా ధైర్యంగా చేయలేని ఈ పనిని చేసి చూపిస్తున్న బిందు పరిచయం.కేరళ త్రిషూర్ జిల్లా కొడంగలూర్లోని బిందూ (46) ఇంటిలో అర్ధరాత్రి ఫోన్ మోగిందంటే ఆమెకు వెంటనే డ్యూటీ పడిందని అర్థం. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది... నేరం జరిగింది.. సూసైడ్ కేసు... అక్కడకు వెళ్లి వెంటనే ఫొటోలు తీయకపోతే ఆ సాక్ష్యాధారాలు చెదిరిపోవచ్చు. అందుకే బిందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కెమెరా బ్యాగ్ భుజాన వేసుకుని మోటర్ సైకిల్ మీద బయలుదేరుతుంది. త్రిషూర్ జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్లకు బిందూయే ఔట్‌సోర్స్ ఫొటోగ్రాఫర్. ఘటనా స్థలాలలో పోలీసులకు సహాయంగా, చట్టపరమైన పరిశోధనకు వీలుగా, న్యాయస్థానాల్లో ప్రవేశానికి అర్హమైన ఫొటోలు తీసే వారిని ‘ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్’ అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఫొటోగ్రాఫర్లు ఉంటారు. లేనప్పుడే సమస్య. త్రిషూర్‌లో బిందూయే చాలామందికి ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్.అనుకోకుండా ఒకరోజువి.వి.బిందుది కొడంగల్‌లో మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ వరకూ చదివాక ఆర్థిక స్తోమత లేక చదువు మానేసి ఒక ఫొటోస్టూడియోలో రిసెప్షనిస్టుగా చేరింది. అక్కడ లైటింగ్ చేసే కుర్రాళ్లు యజమాని లేనప్పుడు కెమెరాతో ఎలా ఫొటో తీయాలో ప్రయోగాలు చేస్తుంటే అప్పుడప్పుడు వారితో పాటు కలిసి గమనించేది. తొలుత ఏ ఆసక్తి లేకపోయినా తర్వాత ఆసక్తి ఏర్పడి ఆరు నెలల్లో కెమెరా అంటే ఏమిటో ఫొటోలు ఎలా తీయాలో ఫండమెంటల్స్‌లో కొట్టినపిండి అయ్యింది. దాంతో యజమాని ఆమెను అప్పుడప్పుడు వెడ్డింగ్ షూట్స్‌కు పంపేవాడు. అయితే ఒకరోజు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది... ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని. వేరే ఎవరూ దొరక్క బిందూను పంపాడు యజమాని. ఇది 2004లో జరిగింది. అది బావిలో మృతదేహం కేసు. అక్కడకు వెళ్లి ఫొటోలు తీసిన బిందు మళ్లీ ఆ పని జన్మలో చేయకూడదని నిశ్చయించుకుంది. ‘అలాంటి వృత్తిలో ఎవరు ఉంటారు?’ అంటుందామె. కాని మరి కొన్ని రోజులకు మళ్లీ ఫోన్ వచ్చింది. డబ్బు అవసరం ఆమెకు మళ్లీ కెమెరా పట్టుకుని వెళ్లేలా చేసింది.విరామం తీసుకున్నాపెళ్లయ్యాక ఈ పనికి విరామం ఇచ్చి 2008లో భర్తతో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది బిందు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భర్తతో విడిపోయి తిరిగి 2014లో కొడంగలూరుకు చేరుకుంది. వచ్చిన రోజే ఆమెకు మళ్లీ పోలీసుల నుంచి ఫోన్. ‘ఆశ్చర్యం ఏమిటంటే ఇన్నేళ్లలో నాలాగా ముందుకొచ్చిన ఫొటోగ్రాఫర్లు అక్కడ లేరు. నైపుణ్యం కూడా లేదు’ అందామె గర్వంగా. అందుకే పోలీసులు ఆమెను బతిమిలాడి తిరిగి పనిలో పెట్టారు. ఒక సి.ఐ. అయితే తన శాలరీ సర్టిఫికెట్ ఆమె లోను కోసం పూచీ పెట్టి 2 లక్షలు అప్పు ఇప్పించి మంచి కెమెరా కొనుక్కునేలా చేశాడు. ఇక బిందూ ఆగలేదు. పనిలో కొనసాగుతూనే ఉంది నేటికీ.కేసుకు 2000 రూపాయలుబిందు ఇప్పుడు ఏడు స్టేషన్లకు ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా ఉంది. ‘నాకు రోజుకు యావరేజ్‌గా ఒకటి లేదా రెండు కేసులు వస్తాయి. వెళ్లి ఫొటోలు తీస్తాను. కేసుకు రెండు వేల రూపాయలు ఇస్తారు. ఘటనా స్థలికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ చూసినవన్నీ మైండ్‌లో నిండిపోతాయి. కాని ఇంటికి వచ్చి ఒక్కసారి పిల్లల్ని చూసుకున్నాక అన్నీ మర్చిపోతాను. నా పని ఎలా చేయాలో నాకు తెలుసు. సీనియర్ ఆఫీసర్లు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడప్పుడు యంగ్ ఆఫీసర్లు ఇలా కాదు అలా అంటూ తెలివి ప్రదర్శిస్తారు. ఇవన్నీ మామూలే’ అంటుందామె. ఇంత భిన్నమైన వృత్తిలో ఇంతగా రాణిస్తున్న బిందూ గురించి బయటి లోకానికి తెలియదు. ఇటీవలే అక్కడి సీనియర్ ఫొటోగ్రాఫర్, నటుడు కె.ఆర్.సునీల్ ‘అసామాన్య సామాన్యుల’ పై ఒక పుస్తకం అక్కడ వెలువరించాడు. అందులో బిందూపై కూడా కథనం ఉంది. అలా ఆమె జీవితం అందరికీ తెలిసింది. గుండె దడదడనేర/ప్రమాద ఘటనా స్థలాల్లోకి పోలీసులు వెళ్లడానికే జంకుతారు. అలాంటిది బిందు వెళ్లి ఊరికే చూసి రావడం కాదు... కొన్ని నిర్దేశిత యాంగిల్స్‌లో దగ్గరగా వెళ్లి తీయాలి. కొత్తల్లో ఆమెకు చాలా వొణుకుగా ఉండేది. ‘ఒకసారి భయంతో ఫ్లాష్ మర్చిపోయి వెళ్లాను. మళ్లీ తెచ్చుకొని తీయాల్సి వచ్చేది. మరోసారి కెమెరాలో రీల్ లోడ్ చేయడం మర్చిపోయాను. కాని రాను రాను మెల్లగా అన్నీ అలవాటయ్యాయి. ఏ వృత్తయినా ప్రొఫెషనలిజం వచ్చేంత వరకూ కష్టమే. ఆ తర్వాత అంతా నల్లేరు మీద నడకే’ అంటుంది బిందూ. -
వంట పండింది!
జీవితంలో సమస్యలు రావడం సాధారణం. ఒక్కోసారి ఇవి ఊపిరాడనివ్వవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. తానేమిటో నిరూపించుకోవాలి. అలానే చేసింది బిందు. తన కూతుళ్లకు మంచి చదువును అందించేందుకు ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క నాగలి పట్టి పొలం సాగు చేస్తూ ‘‘మనం కూడా ఇలా వ్యవసాయం చేస్తే బావుంటుంది’’ అనేంతగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని తెనై జిల్లా బొమ్మినాయకన్పట్టి గ్రామానికి చెందిన బిందు, పిచ్చయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పిచ్చయ్య సొంత పొలంలో చెరకు పండించేవాడు. అయితే ఏటా అప్పులు తప్ప ఆదాయం వచ్చేది కాదు. గ్రామంలో చాలామంది రైతులు చెరకు, పత్తిని పండించి నష్టపోవడాన్ని చూసి ఇతర పంటలను పండించాలని నిర్ణయించుకుంది బిందు. మొక్కజొన్న, వంగ పంటను పొలంలో వేసింది. మరోపక్క సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లో చేరి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారో తెలుసుకునేది. ఇతర రైతుల సలహాలు, సూచనలతో సాగును మెరుగు పరుచుకుంటూ, ఎస్‌హెచ్‌జీ ద్వారా కృషి విజ్ఞాన్ నిర్వహించే వ్యవసాయ కార్యక్రమాలకు హాజరవుతూ మెలకువలు నేర్చుకుంది. అధికారులు చెప్పిన విధంగా పప్పుధాన్యాలు, మిల్లెట్స్, మినుములు కూడా సేంద్రియ పద్ధతి లో సాగుచేసింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. విరామంలో... పంటకు పంటకు మధ్య వచ్చే విరామంలో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. అవి నాలుగు నెలల్లోనే చేతికి రావడంతో మంచి ఆదాయం వచ్చేది. విరామ పంటలు చక్కగా పండుతుండడంతో.. కొత్తిమీర, కాకర, ఇతర కూరగాయలను పండిస్తోంది. పంటను పసుమయిగా ... ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చాలా కూరగాయలు వృథా అయ్యేవి. అలా వ్యర్థంగా పోకుండా ఉండేందుకు ‘పసుమయి’ పేరిట ఎండబెట్టిన కూరగాయలు, పొడులను విక్రయిస్తోంది. ఇడ్లీ పొడి, నిమ్మపొడి, ధనియాల పొడి వంటి అనేక రకాల పొడులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నెలకు వందల సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారవేత్తగా ఎదిగింది బిందు. ఆమె పెద్దకూతురు ఎం.ఎస్. పూర్తి చేస్తే, చిన్నకూతురు బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. అలా సేద్యంతో పిల్లల చదువులనూ పండించుకుంది బిందు. -
తప్పుడు వీడియో షేర్ చేస్తావా? అంటూ మహిళా అథ్లెట్‌పై కోచ్ భార్య దాడి
కర్ణాటక: కోచ్ భార్య మహిళా అథ్లెట్‌పై దాడి చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. బిందురాణి అనే అథ్లెట్ ప్రాక్టీస్ కోసం కంఠీరవ స్టేడియం వెళ్లారు. అక్కడ శ్వేత అనే మహిళ బిందురాణిని నోటికొచ్చినట్లు తిట్టి చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. కోచ్‌ల గ్రూప్‌లో ప్రైవేట్ కార్యక్రమం వీడియోను బిందు షేర్ చేసిందని, తప్పుడు వీడియోను షేర్ చేస్తావా అంటూ కోచ్ యతీశ్ భార్య శ్వేత దాడి చేసినట్లు తెలిసింది. ఆమైపె తాను అథ్లెటెక్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బిందురాణి తెలిపింది. -
18 ఏళ్లకే పెళ్లి, సీక్రెట్‌గా ఉంచా: బాలీవుడ్ నటి
ప్రత్యేక గీతాలకు పెట్టింది పేరు బిందు. బాలీవుడ్లో అనేక సినిమాల్లో నటించి, తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది బిందు. దాదాపు 40 ఏళ్లపాటు ఇండస్ట్రీకి తన సేవలందించిన ఆమె తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 'మా పొరుగింట్లో ఉండే చంపక్ లాల్ జవేరీ, నేను 15 ఏళ్ల వయసులోనే ప్రేమించుకున్నాం. 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాం. కానీ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. ఎందుకంటే పెళ్లి వల్ల నా వర్క్ డిస్టర్బ్ అవ్వద్దనుకున్నాను. 1979లో దొ రాస్తే సినిమా ఆఫర్ వచ్చింది. అప్పుడు మా ఆయనుండి.. మనం ఆర్థికంగా సెటిలయ్యాం కదా, ఇప్పుడిది అవసరమా? అన్నారు. కానీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉందని చెప్పడంతో మరేం మాట్లాడలేదు. నాకు అండగా నిలబడ్డారు. నేనెప్పుడూ ఏ పార్టీకి ఒంటరిగా వెళ్లలేదు. అతడితో కలిసే పార్టీలకు హాజరయ్యేదాన్ని. అలాగే లేట్ చేయకుండా ఇంటికి వెళ్లిపోయేవాళ్లం. తను నా విషయంలో ఎప్పుడూ అభద్రతకు లోనవలేదు. నేను తనను ఎంత ప్రేమిస్తున్నానో ఆయనకు తెలుసు. అందుకే నాపై పూర్తి నమ్మకం ఉంచారు.' అని చెప్పుకొచ్చింది నటి. కాగా బిందు దాదాపు 160 చిత్రాల్లో నటించింది. కటి పతంగ్, ఇత్తేఫక్, దో రాస్తే, అభిమాన్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆమె చివరగా 2008లో వచ్చిన మెహబూబా సినిమాలో కనిపించింది. చదవండి: 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్ -
అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ!
కేరళలో తల్లి, కొడుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చాయి. కొడుక్కి ఉద్యోగం వచ్చింది. ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చింది’ అన్నాడు తల్లి దగ్గరకు వెళ్లి. ‘నాక్కూడా బాబూ’ అని జవాబు చెప్పిందా తల్లి. ఇద్దరూ ఒకేసారి గవర్నమెంట్ ఉద్యోగులు అయ్యారు. వారిని ఉత్సాహపరిచిన తండ్రి ఆనందంతో కళ్లు తుడుచుకున్నాడు. ఇంత మంచి కుటుంబ కథా చిత్రం ఈ మధ్య చూళ్లేదు మనం. కొబ్బరిచెట్లు సంతోషంతో తలలు ఊపాయి. వీధి అరుగులు చప్పట్లు కొట్టాయి. ఒక సామాన్యమైన ఇంటిలో హటాత్తుగా రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి ఈ సంబరం మనదే అన్నట్టుగా ఊరు ఉంది. దానికి కారణం మొన్న ఆగస్టు 3న కేరళలో ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మలప్పురంలో అరిక్కోడ్ అనే ఉళ్లోని తల్లీకొడుకులు న్యూస్‌మేకర్స్‌గా నిలిచారు. తల్లి బిందు ‘లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్’ (ఎల్.జి.ఎస్.) విభాగంలో 92వ ర్యాంక్ సాధిస్తే కొడుకు వివేక్ ‘లోయర్ డివిజినల్ క్లర్క్’ (ఎల్.డి.సి.) విభాగంలో 38వ ర్యాంకు సాధించాడు. తల్లి వయసు 42. కొడుకు వయసు 24. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు 40 ఏళ్లు పరిమితిగా ఉన్నా కొన్ని వర్గాలకు 42 ఏళ్లు మరికొన్ని వర్గాలకు 46 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంది. తన సామాజికవర్గాన్ని బట్టి పరీక్ష రాయడానికి అర్హత ఉన్న బిందు 42 ఏళ్ల వయసులో ఈ ఉద్యోగం సాధించింది. ఈసారి కాకపోతే ఇంకేముంది... జాతీయస్థాయిలో ఇది విశేష వార్తగా మారింది. లాస్ట్ చాన్స్ బిందు చాలా కాలంగా అంగన్వాడి టీచర్‌గా పని చేస్తూ ఉంది. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగంతో ఆమెకు సంతృప్తి లేదు. ఎప్పటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకునేది. కొడుకు వివేక్ పదో క్లాసుకు వచ్చినప్పటి నుంచి ఆమె పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ అవుతూ ఉంది. అంతే కాదు కొడుకుతో కూడా నువ్వు గవర్మెంట్ ఉద్యోగం సాధించాలిరా అని తరచూ చెప్పేది. చిన్నప్పటి నుంచి అతని చేత పత్రికలు చదివించేది. కొడుకు డిగ్రీ అయ్యాక అతనూ ఉద్యోగానికి ప్రిపేర్ అవడం మొదలెట్టాడు. బిందు పట్టుదల చూసి ఆమె భర్త పూర్తిగా మద్దతు పలికాడు. కోచింగ్ లో చేరండి అని చేర్పించాడు. ఇంతకు మునుపు చేసిన అటెంప్ట్స్ ఫలించలేదు. ఈసారి బిందుకు లాస్ట్ చాన్స్. ఈసారి మిస్సయితే ఇక ఎగ్జామ్ రాసే వయసు ఆమె వర్గానికి సంబంధించి దాటేస్తుంది. ఎలాగైనా సాధించాలి అనుకుందామె. కోచింగ్ చేరి బిందు, వివేక్ ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లో చేరారు. కలిసి వెళ్లి కోచింగ్ తీసుకుని వచ్చేవారు. ఆ తర్వాత ఎవరికి వారు ప్రిపేర్ అయ్యేవారు. ‘మేము మా గదుల్లోకి వెళ్లి చదువుకునేవాళ్లం. మధ్యలో మాత్రం డౌట్స్ వస్తే ఒకరినొకరం అడిగేవాళ్లం. నోట్సులు ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్లం’ అన్నాడు వివేక్. సంకల్పం వృధా కాలేదు. ‘ఉద్యోగం వచ్చిందమ్మా’ అని కొడుకు పరిగెత్తుకుని వెళితే ‘నాక్కూడారా’ అని నవ్విందామె. భలే ఉంది కదా... ఈ కుటుంబ కథా చిత్రం. -
బాలీవుడ్ మోనా డార్లింగ్
మన హైదరాబాద్ నుంచి వెళ్లి బాలీవుడ్లో అజిత్‌గా మారిన హమీద్ ఖాన్ తన విలనీలో భాగంగా ఎప్పుడూ పక్కన ఒక గర్ల్ ఫ్రెండ్‌ను పెట్టుకుని ఉంటాడు. ‘జంజీర్’లో అతడు ఆ గర్ల్ ఫ్రెండ్‌ను చాలా ప్రేమగా ‘మోనా డార్లింగ్’ అని పిలుస్తూ ఉంటాడు. ఆ పాత్రను వేసింది బిందు. ఆమె ఆ పాత్ర ఎంత హిట్ అంటే నేటికీ మోనా డార్లింగ్ స్పూఫ్‌లు వస్తూనే ఉంటాయి. హెలెన్, అరుణా ఇరానీ తర్వాత హిందీలో క్లబ్ డాన్సర్‌గా బిందు చాలా పాపులర్ అయ్యింది. విశేషం ఏమిటంటే పెళ్లయ్యాక ఆమె నటి అయ్యింది. పెళ్లయ్యాకే క్లబ్ డాన్సులు చేసి ఒక ప్రొఫెషనల్ నటి పాత్రను బట్టి పని చేయాలి అని సమాజాన్ని ఒప్పించింది. 1951లో గుజరాతీ దంపతులకు జన్మించిన బిందు తండ్రి మరణం తర్వాత కుటుంబం కోసం సినిమాలలో ప్రవేశించింది. అయితే ఒకటి రెండు సినిమాల తర్వాత చంపక్ జాదరీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని విరమించుకుంది. కాని ఆమె చెల్లెలు జయ వివాహం ప్రఖ్యాత సంగీత దర్శకత్వ ద్వయం లక్ష్మీకాంత్–ప్యారేలాల్లోని లక్ష్మీకాంత్‌తో జరిగింది. ఒకసారి మరిది గారి రికార్డింగ్ చూడటానికి బిందు రికార్డింగ్ థియేటర్‌కు వెళ్లి అక్కడే ఉన్న ప్రముఖ దర్శకుడు శక్తి సామంత చూసి తాను తీయబోతున్న ‘కటీ పతంగ్‘లో వేషం వేయమని అడిగాడు. భర్త ఇందుకు ముందు శషభిషలు పడినా తర్వాత అంగీకరించాడు. ఆ సినిమాలో బిందు చేసిన క్లబ్ సాంగ్ ‘మేరా నామ్ షబ్బో’ సూపర్‌హిట్ అయ్యాక ఇక బిందు బాలీవుడ్ తాజా వాంప్ యాక్ట్రెస్‌గా అవతరించింది. బిందు చేసిన అనేక క్లబ్ సాంగ్స్ హిట్ అయ్యాయి. ‘అజ్నబీ’లో ‘హంగామా హోగయా’, ‘ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే’లోని ‘ఆకె దర్ద్ జవా హై’.. వాటిలో కొన్ని. ఆమె ఎత్తు ఎక్కువ. అందుకని హీరోలు ఆమెను హీరోయిన్గా బుక్ చేయడానికి పెద్ద ఇష్టపడేవారు. అందువల్ల బిందు అతి కొద్ది సినిమాలలోనే హీరోయిన్గా కనిపించింది. బిందు ఎన్ని పాటలు చేసినా ‘జంజీర్’లో వేసిన మోనా డార్లింగ్ పాత్రతో మరింత గుర్తుండిపోయింది. అందులో విలన్ అజిత్ చాలా కూల్‌గా తన దుర్మార్గాలన్నింటిని ఈ మోనా డార్లింగ్‌తో పంచుకుంటూ ఉంటాడు. ‘జంజీర్’ హిందీలో రామ్‌చరణ్‌తో రీమేక్ అయ్యింది. అజిత్‌గా ప్రకాష్ రాజ్ వేసినా మోనా డార్లింగ్‌గా ఎవరో వేశారు అన్నట్టుగా ఆ క్యారెక్టర్‌ను జనం పట్టించుకోలేదు. ‘శంకరాభరణం’లో కె.విశ్వనాథ్ మంజు భార్గవికి మంచి వేషం ఇచ్చారు. అది అప్పట్లో పెద్ద వార్త. ఎందుకంటే మంజు భార్గవి వ్యాంప్ వేషాలతో పరిశ్రమలో గుర్తింపు పొందింది. కాని దీనికి చాలా కాలం ముందే హృషికేశ్ ముఖర్జీ ‘అభిమాన్’లో బిందుకు మంచి వేషం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్లబ్ డాన్సర్ బిందుకు అంత మంచి వేషమా అని అందరూ చెవులు కొరుక్కుంటే ఆ సినిమాలో బిందు అమితాబ్ ఆత్మీయురాలిగా మంచి మార్కులు కొట్టేసింది. బిందు మధ్యలో గ్యాప్ తీసుకున్నా ఆ తర్వాత హమ్ ఆప్ కే హై కౌన్ వంటి కొన్ని సినిమాలలో సరదాగా నవ్వించే పాత్రలు పోషించింది. బిందు ఒక కాలపు చెదరని తళుకు సినిమా ప్రేక్షకుల జ్ఞాపకాలలో. -
‘నువ్వు బతికి ఉండొద్దు... చావుపో’
తిరువనంతపురం : బిందు.. ఈ ఏడాది జనవరి మాసంలో దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. కారణం శబరిమలలోకి ప్రవేశించిన మొదటి మహిళ కావడం. శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలోకి కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) ప్రవేశించిన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆలయ ప్రవేశం అనంతరం బిందు ఎన్నో వేధింపులకు గురయ్యారు. అత్తింటి వారితోపాటు.. ఇరుగుపొరుగు వారి విమర్శలు, బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తల దాడులు.. ఇలా ఎన్నో అవమానాలు, వేధింపులకు గురిచేసినా ఆమె నిర్భయంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. స్కూల్ టీచర్‌గా తన విధులు నిర్వహిస్తూ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే అయ్యప్ప ఆలయ ప్రవేశ వివాదం సద్దుమనిగిందని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆమెకు వేధింపులు మొదలైయ్యాయి. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆమెను కొంతమంది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు వేధించారు. ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. నువ్వు బతికి ఉండొద్దు చావుపో అంటూ మెరుపు దాడి చేశారు. తనపై జరిగిన దాడిని సోషల్ మీడియా వేదికగా ఖండించారు బిందు. తనపై దాడికి దిగిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. చదవండి : శబరిమలలో కొత్త చరిత్ర ఎన్నికల విధుల్లో భాగంగా బిందు రిజర్వ్ అధికారిగా పట్టంబి నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడి ఓ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని ఉంచారు. ఆమె విధుల్లో భాగంగా మంగళవారం అక్కడి వెళ్లారు. అక్కడ కొంత మంది వ్యక్తులు తనను గుర్తించి దాడికి యత్నించారని బిందు పేర్కొన్నారు. తన విధులు ముగించుకొని క్యాంపస్‌కు తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది దాడి చేశారన్నారు. ’ సాయంత్ర సమయంలో క్యాంపస్ నుంచి బయటకు వెళ్లాను. అక్కడ నా కోసం ఓ గ్రూప్ కాపు కాస్తూ ఉంది. నా దగ్గరకు వచ్చి శబరిమల ఆలయంలోకి వెళ్లింది నువ్వేనా అని ఒకరు అడగ్గా.. నేను సమాధానం చెప్పేలోపే నాపై దాడికి దిగారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ దూషించడం మొదలు పెట్టారు. ’ నువ్వు బతికి ఉండొద్దు.. వెళ్లి చావు’ అంటూ మెరుపు దాడికి యత్నించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అధికారిపై దాడి జరగడం దారుణం. ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్యానికే సవాల్‌గా మారుతోంది. నాపై దాడికి ప్రయత్నించిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా. నా పోరాటాన్ని కొనసాగిస్తా’ అని బిందు పేర్కొన్నారు. బిందు చిన్నప్పటి నుంచీ రెబల్. కాలేజీరోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. కమిట్మెంట్కు మరోపేరు ఆమె. జెండర్ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఆ విషయాల మీద ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో స్టూడెంట్స్ చెవి కోసుకుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్ట్ హరిరన్ ఆమె భర్త. వాళ్లకు పదకొండేళ్ల కూతురు ఓల్గా. కోజీకోడ్ జిల్లాలోని పోక్కాడ్ ఆమె నివాసం. -
‘వారికి 24/7 రక్షణ కల్పించండి’
న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు బిందు, కనకదుర్గలకు 24 / 7 రక్షణ కల్పించాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయంలోకి ప్రవేశించినందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ.. ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతూ ఈ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు బిందు, కనకదుర్గలకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసింది. ఆడవారిని ఆలయంలోకి ప్రవేశించకుండా ఆందోళనకారులు అడ్డుగిస్తున్నారు. ఈ క్రమంలో బిందు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కానీ ఆలయంలోకి వెళ్లి వచ్చినప్పటి నుంచి వారికి బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 15న కనకదుర్గ మీద ఆమె అత్త, బంధువలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో బిందు, కనకదుర్గలు తమకు ప్రాణ హాని ఉందని గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఆలయంలోకి వెళ్లాలనుకునే మహిళలకు పోలీసు రక్షణ కల్పించేలా కోర్టు ఆదేశించాలని కోరారు. వీరి పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టాలని వీరి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ను కోరారు. -
కల కాదు
శ్రీజ, మాధురీ దీక్షిత్, షఫీ, బిందు, గౌతమి ముఖ్యతారలుగా అదీబ్ నజీర్ దర్శకత్వంలో పరింద ఆర్ట్స్ పతాకంపై వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ఇది కల కాదు’. చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అదీబ్ నజీర్ మాట్లాడుతూ– ‘‘మంచి కథ కుదిరింది. పదిమంది హీరోయిన్లతో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. హైదరాబాద్ అండ్ తెలంగాణలోని ముఖ్య ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణను పూర్తి చేశాం. వచ్చే నెల రెండో వారంలో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ æపూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. -
కంటతడి పెట్టించిన దుర్ఘటనలు
-
'నా కూతురికి అబార్షన్ చేయించాడు'
తిరువనంతపురం: మాజీ ప్రేమికుడు బలవంతం చేయడంతోనే తన కుమార్తె మతం మారిందని ఫాతిమా అలియాస్ నిమిషా తల్లి బిందు ఆరోపించారు. సయిద్ రెహ్మాన్ తన కూతుర్ని బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని పేర్కొన్నారు. కేరళ నుంచి ఐసిస్ చేరడానికి వెళ్లారని భావిస్తున్న వారిలో ఫాతిమా కూడా ఉంది. తన భర్త ఎజా అలియాస్ బెక్స్టన్ తో కలిసి ఆమె కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఫాతిమా తల్లి బిందు బుధవారం మీడియా ముందుకు వచ్చారు. పుదుచ్చేరి మెడికల్ కాలేజీ విద్యార్థి అయిన రెహ్మాన్... నిమిషాను ప్రేమలోకి దించాడని బిందు తెలిపారు. 2013లో నిమిషాను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని, ఆమెకు గర్భస్రావం చేయించాడని ఆరోపించారు. రెహ్మాన్ తో విడిపోయిన తర్వాత కూడా ఆమె ముస్లింగానే కొనసాగిందని వెల్లడించారు. రెహ్మాన్ తో సంబంధం గురించి తమకు ఎప్పుడు చెప్పలేదని, అతడి ద్వారానే ఈ విషయాలు తెలిశాయన్నారు. తమ దగ్గరకు వచ్చినప్పుడు హిందువుగానే ఉండేదన్నారు. నిమిషాను కలవడానికి పలుమార్లు కలవడానికి రెహ్మాన్ ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదన్నారు. 'నా కుమార్తె కనిపించకుండా పోవడానికి కారణం అతడే. ఆమె ఎక్కడ ఉందో తెలియడం లేదు. నిమిషా అదృశ్యమైన విషయం తెలిసి రెహ్మాన్ నన్ను సంప్రదించాడు. తనను క్షమించాలని కోరాడు. నిమిషా లాగే ఇద్దరుముగ్గురు యువతులు కనిపించకుండా పోయారని చెప్పాడ'ని బిందు తెలిపారు. -
బకెట్లో పడి చిన్నారి మృతి
మహబూబాబాద్ : వరంగల్ జిల్లా మానుకోట శివారు ఎల్బీజీ నగర్ కాలనీలో బుధవారం 16 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు బకెట్లో పడి మృతి చెందింది. కాలనీకి చెందిన బానోత్ నరేష్- పద్మ రెండో కూతురు బిందు (16 నెలలు) బుధవారం ఉదయమే ఇంటి ఆవరణలో ఉన్న నీళ్ల బకెట్ వద్ద ఆడుకుంది. తల నీళ్లలో పెట్టి చూడటంతో ప్రమాదవశాత్తు తలకిందులై అందులో పడిపోరుుంది. అప్పటికే బహిర్భూమికని వెళ్లిన తల్లి పద్మ వచ్చి చూసేసరికి బిందు బకెట్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. -
యువనేత పోరాటం
సమకాలీన రాజకీయ అంశాలతో రూపొందిన చిత్రం ‘యువనేత’. మేకల హనుమంతరావు దర్శకత్వంలో ఆలోకం సుధాకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కానుంది. సురేశ్, బిందు ఇందులో హీరో హీరోయిన్లు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావాలంటే యువతరం అధికార పగ్గాలు చేపట్టాలని అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఓ యువనేత సాగించిన పోరాటమే ఈ చిత్రం ప్రధాన కథాంశం’’ అన్నారు. గుంటూరు, పులివెందుల, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరిపామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: లలిత్ సురేశ్, కెమెరా: రఫీ. -
బంధం నిలవాలంటే నమ్మకాన్ని నిలుపుకోవాలి
ప్రాణస్నేహితురాలు బిందు సడెన్ గా తనతో మాట్లాడటం మానేసింది. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని పెట్టేస్తోంది. మళ్లీ చేస్తానంటుంది కానీ చేయదు. చాలా ముభావంగా ఉంటోంది బిందు. దాంతో తీవ్రంగా హర్ట్ అయ్యింది సౌమ్య. ఎందుకలా చేస్తున్నావని ఎంత అడిగినా చెప్పకపోవడం బాధపెట్టిందామెని. అప్పట్నుంచీ దాని గురించే ఆలోచిస్తోంది. విషయం ఏమిటంటే ఆమెని నమ్మి బిందు ఒక విషయం చెప్పింది. అది సౌమ్య మరొక స్నేహితురాలైన లక్ష్మితో షేర్ చేసుకుంది. లక్ష్మి బిందుని దాని గురించి అడగడంతో ఆమె హర్టయ్యింది. అయితే ఇది సౌమ్య కావాలని చేయలేదు. ఏదో మాటల్లో బయటపెట్టేసింది. అది బిందు వరకూ వెళ్తుందని, ఆమె బాధపడి, తనకు దూరమవుతుందని ఊహించలేకపోయింది. మనలను నమ్మి ఎవరో ఏదో చెబుతారు. అది మన విషయం కాదు కాబట్టి లైట్ తీసుకుని, దాన్ని మనం మరొకరికి చెప్పేస్తాం. అవతలివాళ్లకు అది చాలా విలువైన విషయం కావచ్చు. మీరు తన జీవితంలో విలువైన వ్యక్తి కాబట్టి మీతో చెప్పుకుని ఉండొచ్చు. అది గుర్తు పెట్టుకోకపోతే వారు మీకిచ్చిన విలువ, మీ మీద పెట్టుకున్న విశ్వాసం మాయమైపోవడానికి క్షణం పట్టదు. ఎన్నోయేళ్లు అప్యాయతానురాగాలతో పెనవేసుకున్న బంధాన్ని క్షణాల్లో తుంచేసుకోవడం మంచిదేనా? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, స్నేహితులు, కొలీగ్స్... ఎవరైనా కానీ, మనల్ని నమ్మితేనే రహస్యాలు చెబుతారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడే వారితో మన బంధం కూడా నిలబడుతుంది. ఏ బంధమైనా శాశ్వతంగా నిలబడేది విశ్వాసం మీదనే అని, దాన్ని కాపాడుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే బంధాలు పటిష్టంగా నిలిచి ఉంటాయి.


