కల కాదు | new telugu movie updates | Sakshi
Sakshi News home page

కల కాదు

May 2 2018 12:11 AM | Updated on May 2 2018 12:11 AM

new telugu movie updates - Sakshi

శ్రీజ, మాధురీ దీక్షిత్, షఫీ, బిందు, గౌతమి ముఖ్యతారలుగా అదీబ్‌ నజీర్‌ దర్శకత్వంలో పరింద ఆర్ట్స్‌ పతాకంపై వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ఇది కల కాదు’. చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. అదీబ్‌ నజీర్‌ మాట్లాడుతూ– ‘‘మంచి కథ కుదిరింది. పదిమంది హీరోయిన్లతో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. హైదరాబాద్‌ అండ్‌ తెలంగాణలోని ముఖ్య ప్రాంతాల్లో సెకండ్‌ షెడ్యూల్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణను పూర్తి చేశాం. వచ్చే నెల రెండో వారంలో లాస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ అవుతుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ æపూర్తి చేసి త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement