ఎయిరిండియా ప్రమాదం.. దొరికిన బ్లాక్‌ బాక్స్‌ | Ahmedabad Air India plane Crash: Police Recover Black Box | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా ప్రమాదం.. దొరికిన బ్లాక్‌ బాక్స్‌

Jun 13 2025 3:19 PM | Updated on Jun 13 2025 5:17 PM

Ahmedabad Air India plane Crash: Police Recover Black Box

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌(గుజరాత్‌) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్‌ బాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతకు ముందు.. బ్లాక్‌బాక్స్‌ దొరికిందంటూ ప్రచారం జరగ్గా.. అధికారులు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.

ఎయిరిండియా బోయింగ్‌ 787-8 విమానం కూలిన బీజే మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌పై ఆరంజె కలర్‌లో ఉన్న బ్లాక్ బాక్స్‌ లభ్యమైంది. ఏ171 బ్లాక్‌ బాక్స్‌  బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంనతరం, బ్లాక్‌ బాక్స్‌ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ బ్లాక్‌ బాక్స్‌లో సీవీఆర్‌, ఎఫ్‌డీఆర్‌ భాగాలుంటాయి. వీటిల్లో విమాన డేటా రికార్డింగ్‌, వేగం, ఎత్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సీవీఆర్‌లో రికార్డయిన చివరి రెండు గంటల  పైలెట్‌, కోపైలెట్‌ల మధ్య సంభాషణ వినొచ్చు. 

గురువారం మధ్యాహ్నాం లండన్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.

ఇదీ చదవండి: బ్లాక్‌బాక్స్‌తో ఏం చేస్తారో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement