Ahmedabad Plane Incident: ‘ఒక ఇంజిన్‌ను మార్చిలో చేంజ్‌ చేశాం..’ | Right Engine Changed Left Inspected Air India | Sakshi
Sakshi News home page

Ahmedabad Plane Incident: ‘ఒక ఇంజిన్‌ను మార్చిలో చేంజ్‌ చేశాం..’

Jun 19 2025 8:28 PM | Updated on Jun 19 2025 8:34 PM

Right Engine Changed Left Inspected Air India

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం అనంతరం ఎయిర్‌లైన్స ఇండియాపై అపనమ్మకం ఎక్కువ కావడంతో ఆ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విమాన మెయింటినెన్స్‌ పరంగా చూస్తే తమ నుంచి ఎటువంటి తప్పిదాలు లేకపోయినా ఆ ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకర పరిణామమన్నారు ఎయిర్‌ ఇండియా ఎయిర్‌లైన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్యాంప్‌బెల్‌  విల్సన్‌. 

ఈ మార్చి నెలలో ప్రమాదానికి గురైన విమానానికి కుడివైపున ఉన్న ఇంజిన్‌ను మార్చామన్నారు. అదే సమయంలో ఏప్రిల్‌లో ఎడమవైపు ఇంజిన్‌ను పరీక్షించామని స్పష్టం చేశారు. అయితే 2024 జూన్‌లో ఆ విమానానినికి మేజర్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించామని, ఈ డిసెంబర్‌లో ఆ విమానాన్ని పూర్తి పర్యవేక్షణ అనేది షెడ్యూల్‌ చేయబడిందన్నారు. ఈ మేరకు సదరు ఎయిర్‌లైన్స్‌ సంస్థ లాయల్టీ ప్రొగ్రామ్‌ మహరాజా క్లబ్‌ సభ్యులకు ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేశారు క్యాంప్‌బెల్‌  విల్సన్‌. 

ఇక్కడ విమానం మెయింటినెన్స్‌ నిర్వహణలో ఎటువంటి లోపం జరగలేదని, పైలట్ల విషయంలో కూడా అపార అనుభవం ఉన్నవారే  ఉన్నారన్నారు. ఆ విమానాన్ని నడిపన పైలట్‌, కో పైలట్లకు ఇద్దరికీ కలిపి  13,400 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement