Ahmedabad Plane Crash: భద్రతకు ఢోకాలేదు.. కానీ.. ‘వాచ్‌డాగ్’ కీలక ప్రకటన | Ahmedabad Plane Crash: No Major Safety Concerns Watchdog | Sakshi
Sakshi News home page

Ahmedabad Plane Crash: భద్రతకు ఢోకాలేదు.. కానీ.. ‘వాచ్‌డాగ్’ కీలక ప్రకటన

Jun 18 2025 8:10 AM | Updated on Jun 18 2025 9:46 AM

Ahmedabad Plane Crash: No Major Safety Concerns Watchdog

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు దారితీసిన అంశాలపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఏవియేషన్ వాచ్‌డాగ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ఎయిర్ ఇండియాకు చెందిన 24.. 33 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది.

లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి బయలుదేరిన  కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల సమీక్ష చేపట్టింది. దీనిలో పాల్గొన్న డీజీసీఏ.. 24 బోయింగ్ 787 విమానాలతో ఎటువంటి భద్రతా సమస్యలు లేవని తెలిపింది. అయితే ఇంజనీరింగ్, ఆపరేషన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ యూనిట్లలో అంతర్గత సమన్వయాన్ని బలోపేతం చేయాలని ఎయిర్ ఇండియాకు సూచించింది.

తాజాగా ఎయిర్ ఇండియా తన దగ్గరున్న మొత్తం 33 బీ 787-8/9 విమానాలలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తోంది. వీటిలో 24 విమానాల తనిఖీలు పూర్తయ్యాయి. జూన్ 12-  17 మధ్య కాలంలో ఎయిర్ ఇండియా మొత్తం 514 విమానాలను నడిపింది. వాటిలో 83 రద్దు  అయ్యాయి. వీటిలో 66 రద్దులు బోయింగ్ 787 విమానాల విమానాలకు సంబంధించినవి. అత్యధిక సంఖ్యలో డ్రీమ్‌లైనర్లు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు సంయుక్తంగా దేశీయ, అంతర్జాతీయంగా ప్రతిరోజూ  వెయ్యికి పైగా విమానాలను నడుపుతున్నాయి.

ఇది కూడా చదవండి: G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా..

Advertisement
 
Advertisement
Advertisement