ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం | DGCA orders safety inspection on Boeing Air India incident | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం

Jun 13 2025 6:04 PM | Updated on Jun 13 2025 6:22 PM

DGCA orders safety inspection on Boeing Air India incident

సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్‌లైన్స్ డ్రీమ్‌లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్‌ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్‌ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.  

గురువారం గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement