విమాన ప్రమాద సమయంలో జరిగింది ఇదేనా? | Experts Opinion On Ahmedabad Air India Plane Crash Tragedy, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాద సమయంలో జరిగింది ఇదేనా?

Jun 13 2025 9:32 AM | Updated on Jun 13 2025 10:18 AM

Experts Opinion On Ahmedabad Plane Crash

ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానం గేర్ రాడ్‌ మూసుకోలేదు. దానికి తోడు రెక్కల వెనక భాగం (ఫ్లాప్) ముడుచుపోయి ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసాధారణ పరిస్థితిపై వైమానిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న ప్పుడు ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఈ పరిస్థితి విమానానికి ప్రాణాంతక మేనని చెబుతున్నారు.

సాధారణంగా విమానం టేకాపైన వెంటనే, అంటే 600 అడుగుల ఎత్తుకు చేరడానికి ముందే గేర్ రాడ్‌ విధిగా మూసుకోవాలి. ఇక విమానం చెప్పుకోదగ్గ ఎత్తుకు ఎగిరేదాకా ఫ్లాప్స్ రెండూ విచ్చుకునే ఉండాలి. విమానం పైకి వెళ్తున్న కొద్దీ అవి క్రమంగా లోనికి ముడుచుకుంటాయి. కానీ, ఎయిరిండియా విమానం టేకాఫ్ కాగాన్ లాండింగ్ గేర్ తొలుత కొంతమేరకు ముడుచుకున్నా వెంటనే తిరిగి బయటికి వచ్చింది. "బహుగా విమానానికి కావాల్సిన వేగం (థ్రస్ట్) లోపించడమో, పవర్‌ ఫెయిల్యూర్ చోటుచేసుకోవడమో జరిగి ఉండాలి. అది గమనించి పైలట్‌ ముందు జాగ్రత్తగా లాండింగ్ గేర్‌ను తెరిచి ఉంటారు. దాంతో పాటే కిందకు పడిపోతున్న విమానాన్ని వెంటనే పైకి లేపేపేందుకు కావాల్సిన థ్రస్ట్ కోసం ఫ్లాప్‌ను ఒక్కసారిగా మూసేందుకు ప్రయత్నించి ఉంటాడు" అని వైమానిక నిపుణులు అభిప్రాయపడ్డారు.

"కానీ 800 అడుగుల ఎత్తులో ఇది చాలా రిస్క్‌. ఇలాంటప్పుడు విమానం అటూ ఇటూ ఉగిపోతుంది. ఎయిరిండియా విమానం మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ కూలేదాకా సజావుగానే ప్రయాణించింది. అందుకు పైలట్ సామర్థ్యమే కారణం కావచ్చు. దీంతో పాటు రైట్ రడ్డర్ సమస్య తలెత్తిన సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇది లెఫ్ట్ ఇంజన్ ఫెయిల్యూర్‌కు సంకేతం, ఇవన్నీ కలగలిసి విమానాన్ని ఢీకొనడానికి ముందే సకాలంలో పైకి లేపడంలో పైలట్ విఫలమై ఉంటారు" అని వారు విశ్లేషించారు. అంతేగాక పక్షులు ఇంజన్‌ను ఢీకొనడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చుంటున్నారు. "ఎయిర్‌పోర్ట్‌ను ఆనుకుని ఆవాస ప్రాంతాలున్నాయి. కనుక అక్కడ చాలా పక్షులుంటాయి. అనేక పక్షులు ఢీకొని రెండు ఇంజన్లూ శక్తిని కోల్పోయి ఉంటాయి. అందువల్లే టేకాఫ్ అనంతరం విమానం నిర్దిష్ట అందుకోలేకపోయి ఉంటాయి" అని వారన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement