
న్యూఢిల్లీ: జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి, 260 మంది మరణించిన ఘటనపై చురుకుగా దర్యాప్తు సాగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను వెలువరించించి. దీనిపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు సంఘీభావం తెలిపింది. బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని పేర్కొంది. అలాగే విచారణ ఇంకా కొనసాగుతున్నందున ఇప్పుడే దీనిపై ఎటువంటి కామెంట్ చేయలేమని స్పష్టం చేసింది.
ఎయిర్‌లైన్‌కు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక జూలై 12న అందింది. విమాన ప్రమాదం దర్యాప్తులో ఎయిర్ ఇండియా ఏఏఐబీ, ఇతర అధికారులకు నిరంతరం సహకారం అందిస్తోంది. క్యారియర్ నియంత్రణ సంస్థలు, భాగస్వాములకు పలు వివరాలు అందిస్తోంది. ప్రమాదంపై వెలువడిన ప్రాథమిక వివరాలపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్నదని, అందుకే దీనిపై ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించబోమని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక వివరాలను మేము అంగీకరిస్తున్నామని ‘ఎక్స్’ పోస్టులో తెలిపింది.
ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి 260 మంది మరణించడానికి కొద్దిసేపటి ముందు విమానంలోని ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆపివేసివున్నాయి. తరువాత ఆన్ చేశారని తేలింది. కాగా బోయింగ్ 787-8 విమానాల ఆపరేటర్లు తక్షణ భద్రతా చర్యలు చేపట్టలేదని ఏఏఐబీ తన నివేదికలో చెప్పకపోయినా, విమానంలో ఇంధన నియంత్రణలను మార్చడం దర్యాప్తులో కీలకమైన అంశంగా పేర్కొంది. దీనిపై లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
