పైలట్‌ సుమీత్: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే.. | Plane Plummets To Earth: A Phone Call That Never Came | Sakshi
Sakshi News home page

పైలట్‌ సుమీత్: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే..

Jun 13 2025 11:54 AM | Updated on Jun 13 2025 2:43 PM

Plane Plummets To Earth: A Phone Call That Never Came

ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మాటలకందని పెను విషాదాన్ని నింపింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా మిగిలింది. తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలెట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతి చెందారు. కెప్టెన్‌ సుమీత్‌కు సంబంధించిన కుటుంబ విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని, పైలట్ ఉద్యోగం మానేసి చూసుకుంటానని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మాట ఇచ్చారు. కానీ ప్రమాదవశాత్తు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. తండ్రికి మాట ఇచ్చిన విషయాన్ని బంధువులు తెలిపారు.

లండన్‌కు విమాన ప్రయాణానికి ముందు కూడా సమీత్‌ తన తండ్రికి ఫోన్‌ చేశారు. "తాను లండన్ చేరుకున్న తర్వాత మీకు కాల్ చేస్తానని చెప్పాడు.. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం జరిగిపోయింది. ముంబయిలోని పోవై ప్రాంతంలో సుమీత్‌ తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో బాధ్యతలు నిర్వర్తించి రిటైర్‌ అయ్యారు.

కాగా, అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా 787–8 డ్రీమ్‌లైనర్‌ విమానాన్ని నడిపిన పైలట్లకు సర్వీస్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) తెలిపింది. ఈ విమానాన్ని ప్రధాన పైలట్‌ కెప్టెన్‌ సుమీత్‌ సబర్వాల్, కో పైలట్‌ క్లైవ్‌ కుందర్‌ నడిపారు. ప్రయాణీకుల విమానాలు నడపడంలో సుమీత్‌కు ఏకంగా 8,200 గంటల అనుభవం ఉంది. కో పైలట్‌ క్లైవ్‌కు 1,100 గంటల అనుభవం ఉంది. ఇద్దరికి కలిసి 9,300 గంటలపాటు వినిమానం నడిపిన అనుభవం ఉందని డిజిసిఎ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement