‘వాడి జ్ఙాపకాలే ‍ప్రాణంగా..’.. అహ్మదాబాద్ విషాదానికి ఏడాది | Ahmedabad Air Tragedy A Mothers Heart Wrenching Wait for Her Lost Son | Sakshi
Sakshi News home page

‘వాడి జ్ఙాపకాలే ‍ప్రాణంగా..’.. అహ్మదాబాద్ విషాదానికి ఏడాది

Jun 2 2026 11:27 AM | Updated on Jun 2 2026 11:34 AM

Ahmedabad Air Tragedy A Mothers Heart Wrenching Wait for Her Lost Son

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన ఆ భయంకర విమాన ప్రమాదానికి ఏడాది నిండింది. 2025, జూన్ 12న టేకాఫ్‌తో మొదలైన ఆ ప్రయాణం క్షణాల్లో విషాదాంతమైంది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ లండన్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానాశ్రయం సమీపంలోని మెడికల్ హాస్టల్‌ను ఆ విమానం ఢీకొట్టిన దృశ్యం ఇప్పటికీ అందరి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.

కాలం గడిచినా చెరగని గాయం
ఈ ప్రమాదంలో జావేద్ అలీ, తన భార్య , ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడింది కేవలం ఒక్కరు మాత్రమే. జావేద్ తల్లి ఫరీదా బానో ఇప్పుడు అనాథలా మిగిలిపోయారు. ఒక తల్లికి తన బిడ్డను పోగొట్టుకోవడం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదంటారు. ఆ ఘటన దరిమిలా ఆమె ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది.
 

‘వాడు నన్ను విడిచి వెళ్లడు’
ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్నా, తన కొడుకు జావేద్‌ను తలుచుకుంటూ ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. ‘నా కొడుకు ఎక్కడికి వెళ్లినా నాతో పాటే ఉండేవాడు. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్లినా, ఏ గదిలో ఉన్నా వాడు నా వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. వాడు నన్ను విడిచి వెళ్లలేదు. వాడి జ్ఞాపకాలే నా ప్రాణంగా బతుకుతున్నాను’ అని ఫరీదా బానో చెప్పిన మాటలు ఎంతటివారినైనా కదిలింపజేస్తాయి.

తీరని లోటు - మిగిలిన శూన్యం
ఈ ప్రమాదం కేవలం 260 మంది ప్రాణాలను మాత్రమే తీసుకోలేదు. ఎన్నో కుటుంబాల ఆశలను బూడిద చేసింది. 241 మంది ప్రయాణికులు, 19 మంది స్థానికులు ఒకే ఒక్క క్షణంలో కాలగర్భంలో కలిసిపోయారు. భౌతికంగా వారు దూరమైనా, వారి కుటుంబ సభ్యుల గుండెల్లో  ద్రవిస్తునన్న వేదన మాత్రం అలానే ఉంది. 

ఇది కూడా చదవండి: అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్ల అరెస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement