అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు నైటా సంతాపం | Nytta Condoles Families Of Ai Plane Crash | Sakshi
Sakshi News home page

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. మృతుల కుటుంబాలకు నైటా సంతాపం

Jun 15 2025 12:11 PM | Updated on Jun 15 2025 12:11 PM

Nytta Condoles Families Of Ai Plane Crash

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) తీవ్ర సంతాపం ప్రకటించింది. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గం, సభ్యులు మృతులకు నివాళులు అర్పించి, మౌనం పాటించారు.

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్ఆర్ఐలుగా తమను తీవ్రంగా కలిచివేసిందని వారు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉంటున్న  భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందని, వారంతా భారతదేశం రాకపోకలకు తరచుగా ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎన్ఆర్ఐల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నైటా కార్యవర్గం భారత ప్రభుత్వాన్ని కోరింది.

 

Advertisement
 
Advertisement
Advertisement