
భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం✈️ ప్రాథమిక నివేదిక కేంద్రానికి చేరింది. త్వరలో ఇందులోని వివరాలను ప్రజల కోసం బహిర్గతం చేసే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం సెకన్ల వ్యవధిలోనే నేలకూలి పేలిపోయింది. ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు 270 మంది మరణించారు. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) తన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖ, సంబంధిత అధికార వర్గాలకు అందజేసింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఇప్పటిదాకా సేకరించిన విషయాలను, దర్యాప్తు తాలుకా వివరాలను ఆ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అయితే..
ప్రాథమిక నివేదికలో ఏం ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విమాన ప్రమాదానికి కారణాలు అందులో ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఈ వారం చివర్లో ఈ నివేదికను విడుదల చేసే అవకాశం ఉంది.
📌 ప్రమాదం వివరాలు:
తేదీ: జూన్ 12, 2025 మధ్యాహ్న సమయం
విమాన నంబర్: AI-171 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్)
స్థలం: అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన వెంటనే, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయింది
మృతులు: 241 మంది ప్రయాణికులు, 31 మంది మెడికల్ విద్యార్థులు సహా మొత్తం 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు
🧾 ప్రాథమిక నివేదికలో ముఖ్యాంశాలు?..
బ్లాక్‌బాక్స్ డేటా విజయవంతంగా డౌన్‌లోడ్ చేసి విశ్లేషణ ప్రారంభించారు
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు
పైలట్ మేడే కాల్లో “నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్” అని చెప్పిన ఆడియో రికార్డు దొరికింది
✈️ అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖకు జూలై 8న అందజేసింది.
🔍 తదుపరి దర్యాప్తు:
AAIB నివేదికను ఆధారంగా తీసుకుని పూర్తి నివేదికను మూడు నెలల్లోగా సమర్పించాల్సిందిగా కేంద్రం ఆదేశించింది
మరోవైపు ఎన్‌ఐఏ కూడా కుట్ర కోణంపై విచారణ ప్రారంభించింది