
అహ్మదాబాద్ (గుజరాత్): సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విధ్వంసకర AI 171 విమాన ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది , కుటుంబ సభ్యులులను శుక్రవారం BJమెడికల్ కాలేజీ వైద్యుల హాస్టల్ ప్రాంగణం నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఈ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి
ఈ సందర్భంగా ముఖ్యంగా డా. అనిల్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తమను ఇప్పటికిపుడు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా మాండేటరీ ఆదేశాలిచ్చారు, రెండు మూడు రోజులు సమయం ఇవ్వండి, మానవత్వం చూపండిఅంటూ భావోద్వేగానికి గురి అవుతున్న వీడియో సంచలనంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తన కుమార్తె, తన ఇంట్లో సహాయకురాలు ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి తనసాయం అవసరం అంటూ కంటతడి పెట్టారు. తన భార్య లేదని, చాలా నిస్సహాయంగా ఉన్నానంటూ భోరున విలపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కన్నీంటి పర్యంత మయ్యారు.
ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!

> కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ సందర్బంగా మధ్యాహ్నం లంచ్‌కోసం వచ్చిన విద్యార్థులు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే.