విమానం ఇంజిన్‌లో ఇరుక్కున్న లగేజ్‌ కంటైనర్‌..! | Container enters Air India planes engine | Sakshi
Sakshi News home page

విమానం ఇంజిన్‌లో ఇరుక్కున్న లగేజ్‌ కంటైనర్‌..!

Jan 15 2026 10:34 PM | Updated on Jan 15 2026 10:34 PM

Container enters Air India planes engine

ఢిల్లీ–న్యూయార్క్‌ ఎయిర్‌ ఇండియా AI101 విమానంలో లగేజ్‌ కంటైనర్‌.. ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో  పొగమంచు కారణంగా టాక్సీ(రన్‌ వే మధ్యలో భూమి మీద సడిచే సమయంలో) చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరూ గాయపడలేదు కానీ విమానాన్ని  గ్రౌండ్‌ చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది 

విమానంలో 250 మంది ప్రయాణికులు ఉండగా, వారంతా ఊపిరి బిగబెట్టుకుని కూర్చున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు విమానం క్రాష్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే అదృష్టవశాత్తూవిమానం సురక్షితంగా గ్రౌండ్‌ (ఎగరడానికి అనుమతి లేకుండా నిలిపివేయడం)చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

 

ఇదీ చదవండి:

ఇరాన్‌ గగనతలం.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement