
ఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అతి పెద్ద దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఇది యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరి వెళ్లే క్రమంలో సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 241 విమానంలో ఉన్నవారు చనిపోగా, ఈ దుర్ఘటన కారణంగా చనిపోయిన వారి సంఖ్య 275కు పెరిగింది. ఇది జూన్ 12వ తేదీన జరిగిన ఘటన.
అయితే ఆపై మరో రెండు రోజులకు ఒక పెను ప్రమాదం తప్పిందనే వార్త తాజాగా వెలుగుచూసింది. దీతాజాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించడంతో పెను ప్రమాదం తప్పిందనే విషయం బయటకొచ్చింది. ఈ ఘటనను జాతీయ మీడియా హైలైట్ చేయడంతో వామ్మో మరో ఘోర ప్రమాదం తప్పిందని అనుకోవడం ప్రజల వంతైంది.
అసలు విషయంలోకి వెళ్లే.. జూన్ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నా బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పై నుంచి కిందకు దిగిపోయింది. ఉన్నపళంగా 900 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి పోవడంతో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి నియంత్రణలోకి తెచ్చారు.
ఎయిర్ ఇండియా బోయింగ్ 777 AI-187 విమానం.. ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ నుంచి వియన్నాకు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం 900 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో వార్నింగ్ సిగ్నల్ వెళ్లింది పైలట్లకు.
ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన పైలట్లు భద్రతాపరమైన చర్యలు చేపట్టడంతో విమానం మళ్లీ అదుపులోకి వచ్చింది. ఆపై దీన్ని సురక్షితంగా వియన్నా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల్లో వియన్నాలో ఆ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.