
సాక్షి,ఢిల్లీ: భారత విమానయాన చరిత్రలో ఘోర విషాదంగా నిలిచిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చినట్లు బ్లూబెర్గ్ నివేదించింది. విమాన దుర్ఘటనకు కారణం రెండు ఇంజిన్లు విఫలం కావడం వల్లేనని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు భావిస్తున్నారు. కాబట్టే విమాన సిబ్బంది ప్రమాదాన్ని నిరోధించే ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని, తద్వారా అపార ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలుస్తోంది.
విమానంలో అత్యవసర విద్యుత్ సరఫరా కోసం ఉపయోగించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) యాక్టివేషన్ యాక్టివేట్ కావడం వల్ల విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం వల్లేనని తేలింది. కానీ,సాధారణ లోపాల వల్ల ప్రమాదం జరగలేదని తేటతేల్లమైంది. వీటితో పాటు విమాన ప్రమాదానికి గల కారణాల్ని రాబట్టేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) డేటాను విశ్లేషిస్తున్నారు. ఇది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించనుంది.
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఓ వైద్య కళాశాల వసతిగృహంపై కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతిచెందగా.. 19 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒకేఒక వ్యక్తి మృత్యుంజయుడిగా ప్రాణాలతో భయటపడ్డాడు.