గాంధీనగర్: ఉప్పు లోడింగ్ కోసం తొలిసారి నిర్వహించిన స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్ల పరీక్ష విజయవంతమైంది. గుజరాత్ రాష్ట్రంలో భీమసర్–గాంధీధామ్ విభాగంలో భారతీయ రైల్వేలు తొలిసారి స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లను ఉపయోగించి ఉప్పు లోడింగ్ ట్రయల్ నిర్వహించాయి. ఇది సక్సెస్‌ఫుల్ ట్రయల్‌గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
Successful trial of salt handling in stainless steel containers.
📍At Bhimasar – Gandhidham
✅ Container design ensures corrosion resistance and longer service life.
✅ Eliminates manual cleaning and wastage.
✅ Improves turnaround time, setting a new benchmark in freight… pic.twitter.com/4rOu1mUZDD— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 10, 2026
ఉప్పు ఒక అత్యంత కరిమి పదార్థం కావడంతో సాధారణ కంటైనర్లు త్వరగా దెబ్బతింటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లు ఉపయోగించేందుకు వేసిన తొలి అడుగు విజయవంతమైంది.
ఉప్పు వల్ల కలిగే తుప్పు సమస్యను తగ్గడమే కాకుండా సాధారణ కంటైనర్ల కంటే ఎక్కువకాలం ఉపయోగించవచ్చు. వేగంగా, సురక్షితంగా లోడింగ్ మరియు అన్‌లోడింగ్ చేయడానికి అనుకూలంగా రూపొందించబడ్డాయి. యాంత్రిక పద్ధతుల్లో పెద్ద ఎత్తున లోడింగ్ అనేది సులభతరం అవుతుంది. ఉప్పు చిందర వందర కాకుండా సమర్థవంతంగా రవాణా చేయడానికి వీలుగా ఉండటంతో తక్కువ వృథానే అవుతుంది.
దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఉప్పు ఉత్పత్తి ప్రాంతాలకు సురక్షితంగా ఆధునిక రవాణా పరిష్కారం అందిస్తుంది. రైల్వే ఫ్రైట్ ఆపరేషన్లు మరింత వేగవంతం అవుతాయి. ఈ ట్రయల్ విజయవంతం కావడం వల్ల, భవిష్యత్తులో ఉప్పు రవాణా కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్ల వినియోగం విస్తృతంగా పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంచితే, భీమసర్–గాంధీధామ్ విభాగం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ఇది భారతీయ రైల్వేలోని పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. భీమసర్ అనేది కచ్ ప్రాంతంలోని ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్.
గాంధీధామ్ అనేది కచ్‌లోని ప్రధాన వాణిజ్య కేంద్రం, కాండ్లా పోర్ట్‌కు దగ్గరగా ఉండటం వల్ల రైల్వే రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విభాగం ద్వారా ఉప్పు, బొగ్గు, ఖనిజాలు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు వంటి వస్తువులు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి.


