
పాక్ గగనతలం మూసివేత..
కార్గో రవాణాపై భారం
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడం ఎయిరిండియాకు కొత్త రూట్లలో తమ కార్గో విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది. కార్గో సర్వీసుల్లో భాగంగా యూరప్ మీదుగా యూఎస్, కెనడాకు విమానాలను నడపవలసి వస్తుంది. అయితే పాకిస్థాన్ మీదుగా కాకుండా చుట్టూ తిరిగి అమెరికా వెళ్తుండడంతో కార్గో రవాణాకు ఎక్కువ సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఫలితంగా ఇంధన వినియోగం పెరుగుతున్నట్లు పేర్కొంది. అందుకు కొన్ని నాన్‌స్టాప్ విమానాలు, వన్-స్టాప్ విమానాలను నడుపుతున్నట్లు చెప్పింది.
ఆపరేషనల్ మార్పులు
ముంబై-న్యూయార్క్ విమాన సర్వీసులను నాన్ స్టాప్ సర్వీసులకు పునరుద్ధరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీ-అమెరికా/కెనడా విమానాలు వియన్నా లేదా కోపెన్ హాగన్‌లో ఇంధనం నింపుకుంటున్నాయని చెప్పింది. ఢిల్లీ-యూఎస్ మార్గంలో నాన్‌స్టాప్ విమానాల్లో ఇంధనం సాధారణంగా 90-130 టన్నుల వరకు ఖర్చవుతుంది. కానీ వన్-స్టాప్ విమానాలు ఈ ఇంధన భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దాంతోపాటు ఎక్కువ సరుకు రవాణాకు వీలుంటుంది.
కార్గో సామర్థ్యం పెంపు
యూరప్‌గుండా ప్రయాణించే వన్-స్టాప్ విమానాలు నాన్‌స్టాప్ విమానాల కంటే 2-3 రెట్లు అధికంగా కార్గోను మోసుకెళ్లగలవని కంపెనీ తెలిపింది. దాంతో ఈమేరకు కొన్ని నాన్‌స్టాఫ్, నాన్ స్టాఫ్ విమానాలను నడుపుతున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్‌మెంట్ వయసు?
పెరుగుతున్న మామిడి ఎగుమతులు
దేశంలో ఉత్పత్తవుతున్న మామిడి ఎగుమతులు పెరుగుతున్నాయి. దాంతో కార్గో అవసరాలు అధికమయ్యాయి. గత వారం ఎయిరిండియా వన్ స్టాప్ విమానాల ద్వారా 20 టన్నుల మామిడిని అమెరికాకు ఎగుమతి చేశారు. ఈ సీజన్‌లో తమ సంస్థ ఇప్పటికే 350 టన్నుల మామిడి పండ్లను రవాణా చేసిందని కేబీ ఎక్స్‌పోర్ట్స్ సీఈఓ కౌశల్ కఖర్ పేర్కొన్నారు. జూన్ నాటికి ఇది 1,200 టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రీ-రూట్ చేసిన కొన్ని సంస్థల విమానాలు వాటి ప్రయాణాల్లో అసౌకర్యాన్ని ఎదుర్కొంటుండగా, ఎయిరిండియా కార్గో ఆదాయాన్ని పెంచుకోవడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది.