ఎయిర్ ఇండియా కీలక ప్రకటన: ఈ నెల 15 వరకు విమానాలు రద్దు | Air India Flights Cancelled Upto 15th May 2025 | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా కీలక ప్రకటన: ఈ నెల 15 వరకు విమానాలు రద్దు

May 9 2025 8:05 PM | Updated on May 9 2025 8:19 PM

Air India Flights Cancelled Upto 15th May 2025

భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. ఆ తరువాత విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించాల్సి ఉంది.

ఈ సమయంలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే..  రీషెడ్యూలింగ్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం.. ఎయిర్ ఇండియా కాంటాక్ట్ సెంటర్‌లకు కాల్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్‌సైట్ సందర్శించి తెలుసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement