
బెంగళూరు: ఎయిరిండియా(Air India) విమానంలో కలకలం రేగింది. కాక్‌పిట్ డోర్(Cockpit Door) తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించారు. హైజాక్ అవుతుందన్న భయంతో పైలట్ డోర్ తెరవలేదు. పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఎయిరిండియా(IX-1086) ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి బయలుదేరింది. విమానం గాల్లో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ వద్దకు వెళ్లి దాన్ని తెరవడానికి ప్రయత్నించాడు. భద్రత పరంగా కాక్‌పిట్ డోర్‌ను తెరవాలంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయాలి. పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత, కెప్టెన్ అనుమతిస్తేనే ప్రవేశం సాధ్యమవుతుంది. ఆ ప్రయాణికుడు డోర్ తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
అయితే, ఆ ప్రయాణికులు ఎందుకు కాక్‌పిట్‌ను తెరవడానికి ప్రయత్నించాడో ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి మరో ఏడుగురు వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. వారిని విమానం వారణాసిలో ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్‌ఎఫ్(Central Industrial Security Force) అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఎయిరిండియా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఇదీ చదవండి: ఎయిరిండియా ఘటన: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు