హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికల్‌ స్టూడెంట్స్‌ మృతి! | Air India Flight AI171 crashes into BJ Medical College hostel in Ahmedabad | Sakshi
Sakshi News home page

హాస్టల్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికల్‌ స్టూడెంట్స్‌ మృతి!

Jun 12 2025 4:19 PM | Updated on Jun 12 2025 5:21 PM

Air India Flight AI171 crashes into BJ Medical College hostel in Ahmedabad

గాంధీనగర్‌: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఘోర విషాదం చోటు చేసుకుంది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి గురువారం లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం 110 మంది ప్రయాణికులు మరణించినట్లు  ప్రాథమిక సమాచారం.

ఎయిర్‌ పోర్టు నుంచి బయల్దేరని ఎయిరిండియా విమానం మేఘాని నగర్‌లోని బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌ (BJ Medical College Hostel) భవనంపై విమానం కూలింది. ఈ విమాన ప్రమాదంలో 20మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. భోజనం సమయం కావడంతో హాస్టల్‌లోనే పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

మెడికల్ కాలేజీపై కూలడంతో 20 మంది వైద్యుల మృతి

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement