
పేరెంటింగ్‌కు సంబంధించి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘జోహో’ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ‘ఎక్స్’లో చేసిన అర్థవంతమైన, అద్భుతమైన పోస్ట్ నెట్‌లోకంలో చర్చనీయాంశంగా మారింది. పిల్లలు తమకు ఆసక్తి ఉన్న రంగంలో రాణించడానికి అవసరమైన పలు నైపుణ్యాలను గురించి ఈ పోస్ట్‌లో ప్రస్తావించారు వెంబు. పిల్లలు మానవత్వం మూర్తీభవించిన వ్యక్తులుగా ఎదగడానికి సృజనాత్మకత, సాంస్కృతిక అంశాలు ఎలా సహాయపడతాయో వివరించారు.
‘గణితం, శాస్త్రీయ సంగీతం, వంటలు, ఆటలు... ఇష్టమైన ఏ విద్య అయినా కావచ్చు, పతకాల కోసం నేర్చుకోవద్దు. పోటీలకు సంబంధించిన ఒత్తిడికి దూరంగా ఉండాలి. గణితంపై నా ఆసక్తి సాఫ్ట్‌వేర్‌డెవలప్‌మెంట్‌ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది.పిల్లల భవిష్యత్‌ను నిజంగా మార్చేది ఏమిటనే విషయంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు దృష్టి పెట్టాలి’ అని రాశారు శ్రీధర్.
‘బడి పాఠాలే కాదు బతుకు బడి పాఠాలు కూడా నేర్చుకోవాలి’ అనేది శ్రీధర్ పోస్ట్ సారాంశం. ‘కుకింగ్‌కు పెద్దగా ఎవరూ ప్రాధాన్యత ఇవ్వరుగానీ నిజానికి అది అత్యంత నైపుణ్యం ఉన్న పని, లైఫ్ స్కిల్. కుకింగ్ రావడం అనేది జీరో డిపెండెన్సీని సూచిస్తుంది. అందుకే వంటచేయడాన్ని పిల్లలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అది ఒక కళగా గుర్తించుకోవాలి’ అని స్పందించారు ఒక యూజర్.
Pure mathematics, carnatic music, bharatanatyam, classical art, sculpture, chess or go, mridangam, classical poetry, fine cooking - what is common to all of them? (apart from the fact that I am not good in any of them 😁, at least I get to appreciate some of them)
We need…— Sridhar Vembu (@svembu) July 22, 2025
(చదవండి: మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా?)