
బోనీ కపూర్, మోనా శౌరీ కపూర్‌ల తనయుడు అర్జున్ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు ఎలా ఉండేవాడు తెలిస్తే విస్తుపోతారు. చక్కటి ఫిజిక్‌తో హీరో లుక్‌లో కనిపించే అర్జున్ బాల్యంలో చాలా బొద్దుగా ఉండేవాడట. జంక్ ఫుడ్ అంటే మహా ఇష్టంగా లాగేంచేవాడట. దాంతో టీనేజ్ వయసులో 140 కిలోల అధిక బరువుతో ఉండేవాడు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేమందే తన రూపు రేఖలను అందరు ఇష్టపడేలా మార్చుకున్నాడు అర్జున్. అతడి న్యూ లుక్ చూసి ఇంట్లో వాళ్లే ఆశ్చర్యపోయారట కూడా. మరి అంత అధిక బరువుని అర్జున్ ఎలా తగ్గించుకున్నాడో ఆయన మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.
ఇషాక్‌జాదే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడంతోనే తన లుక్‌ని పూర్తిగా మార్చుకున్నాడట. పూర్తి ఫిట్‌నెస్‌తో స్మార్ట్‌గా మారాకే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారట అర్జున్. తన వెయిట్ లాస్ జర్నీలో మంచి మార్పు తీసుకువచ్చింది మాత్రం వాకింగ్ అని చెబుతారు అర్జున్.
ఇది తనను శారీరకంగా చురుకుగా ఉండేలా చేస్తుందని అన్నారు. బరువు తగ్గాలనుకుంటే ముందు వాకింగ్‌కే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు కపూర్. తను మంచి ఆహారప్రియుడునని, జంక్ ఫుడ్ అంటే మహా ఇష్టమని చెప్పుకొచ్చారు. అయితే తాను ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చక్కెర కలిగిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తాజా పండ్లు, కూరగాయలు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలనే తీసుకుంటానని చెప్పారు.
తన రోజు వారి డైట్ ఎలా ఉంటుందో కూడా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు వంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు అధికంగా ఉంటాయిని చెప్పారు. భోజనంలో టర్కిష్ కబాబ్‌లు, పుదీనా చట్నీ, కూరగాయల సలాడ్‌లు వంటివి తప్పనిసరి అని అన్నారు. అలాగే జిమ్‌లో సర్క్యూట్ ట్రైనింగ్, క్రాస్ ఫిట్ ట్రైనింగ్, కార్డియో వంటి వ్యాయామాలు చేస్తానని చెప్పుకొచ్చారు.
అయితే ఆ వ్యాధి కారణంగా మళ్లీ అధిక బరువు బారిన పడ్డానంటూ నాటి చేదు జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నారు అర్జున్. 2024లో అర్జున్ హషిమోటోస్ థైరాయిడిటిస్ వ్యాధి నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇది జీవక్రియను నెమ్మదించి, బరువు పెరిగేలా చేసే ఆటో ఇమ్యూన్ పరిస్థితి అని తెలిపారు. దీని వల్ల అధిక బరువుని ఎదుర్కొనక తప్పదని తెలుసుకుని చాలా నిరాశకు లోనయ్యానంటూ నాటి బాధను గుర్తుతెచ్చుకున్నారు. అయితే తాను ఆ వ్యాధితో పోరాడలి లేదా అధిక బరువుతో ఉండాలి అనే రెండు ఆప్షన్లే తన ముందు కనిపించాయంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
దాంతో తాను ఎలాగైన ఆ వ్యాధిని జయించేలా ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకుని..తన వెయిట్‌లాస్ జర్నీని కొనసాగించానని చెప్పుకొచ్చారు. తాను ఎదుర్కొంటున్న వ్యాది తన అమ్మ మోనా శౌరీ కపూర్, సోదరి అన్షులా కపూర్‌కి కూడా ఉందని అన్నారు. అయితే ఆ వ్యాధి పెడుతున్న ఇబ్బందిని అధిగమిస్తూ..ఆరోగ్యంగా ఉండేలా కేర్ తీసుకోవడంతో బరువుని అదుపులో ఉంచుకున్నానని చెప్పుకొచ్చారు. తన వెయిట్ లాస్ జర్నీకి బ్రేక్ ఉండదని..అది అలా సాగుతుందని నవ్వుతూ చెప్పారు అర్జున్. అంతేగాదు అందరిని ఆరోగ్యంగా ఉండండి, ఏదైనా అనారోగ్యం బారిన పడితే కుంగిపోవద్దు..ఎలా బయటపడాలో ఆలోచించండి అని సూచిస్తున్నాడు అర్జున్ కపూర్.
(చదవండి: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..! నటి కరీనా కపూర్ కూడా..)