
యువతను ఆకర్షించే రీతిలో హైదరాబాద్ నగరంలో మరోసారి సరికొత్త సంస్కృతికి బీజం పడింది. ప్రతిష్టాత్మక ‘రాయల్ ఛాలెంజ్ అమెరికన్ ప్రైడ్ రోడియో నైట్స్’కు నగరం వేదికైంది. అమెరికా తరహా కల్చర్‌లో భాగమైన కాక్టెయిల్స్, దేశీ డీజే బీట్స్ మేళవింపుతో ఈ నైట్‌ను బోల్డ్ లైఫ్‌స్టైల్ ఎక్స్‌ప్రెషన్‌గా సోమాజిగూడలోని ఆక్వా పార్కులో సోమవారం వినూత్నంగా నిర్వహించారు. నగరంలో మొదలైన ఈ ఉత్సవం.. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనుంది. లైఫ్‌స్టైల్ వేదికగా అమెరికన్ స్పిరిట్, ఫ్రీడమ్, అడ్వెంచర్ థీమ్‌లతో బ్రాండ్ అనుభవాన్ని మరింత బలంగా ట్యాప్ చేయనుంది.
ఈ ఈవెంట్ ప్రధానంగా అమెరికానా వైల్డ్ వెస్ట్ థీమ్ ఆధారంగా డిజైన్ చేశారు. డెనిమ్ స్టైల్‌తో అలంకరించిన డిజైన్, ఇంటరాక్టివ్ గేమ్స్, ఏ ఆర్ ఫొటో మూమెంట్స్ వంటి అనేక అనుభూతులను కలిపి లైఫ్‌స్టైల్ స్టేట్‌మెంట్‌గా రూపొందించారు. ఇందులో భాగంగా లాసో ఛాలెంజ్‌లు, హ్యామర్ స్లామ్‌లు, హ్యాండ్ పెయింటెడ్ డీఐవై జోన్ వంటి క్రియేటివ్ స్పేస్‌తో యువతను కొత్తరకంగా భాగస్వాములను చేసింది. ఈ వేదికపై ప్రత్యేకంగా క్యూరేటెడ్ అమెరికన్ బైట్స్, సిగ్నేచర్ కాక్టెయిల్స్, ఎనర్జీ ఫుల్ డీజే బీట్ అహూతులను ఉత్సాహపరిచాయి.
ఆధునిక జీవనశైలి..
‘ఇది సంగీతం, స్వేచ్ఛ, సంస్కృతిని కలిపిన ఆధునిక జీవన శైలికి ప్రతిబింబం’ అని డియాజియో ఇండియా వైస్ ప్రెసిడెంట్ వరుణ్ కూరిచ్ అన్నారు. యువత ఆత్మవిశ్వాసం, ఐడెంటిటీని ప్రతిబింబించే ఈవెంట్లను కోరుతోంది. ఈ రోడియో నైట్స్ అలాంటి అవకాశాన్ని అందించిన తొలి వేదికని తెలిపారు.