
పాలకొండ రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థిని తనను వేధించిన ఓ పోకిరీకి చెప్పుతో బుద్ధి చెప్పింది. శుక్రవారం సాయంత్రం కాలేజీ నుంచి తన స్వగ్రామం వెళ్లే క్రమంలో బస్సు ఎక్కుతుండగా ఓ యువకుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వ్యవహారం శృతిమించడంతో ఆగ్రహించిన ఆమె ఉగ్రరూపం దాల్చింది.
బస్సు దిగి తన కాలి చెప్పుతీసి ఆ పోకిరికి చూపిస్తూ గట్టిగా బుద్ధి చెప్పింది. నీ కుటుంబ సభ్యులతో ఇలానే ప్రవర్తిస్తావా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఊహించని ఈ పరిణామంతో ఆ పోకిరి అక్కడి నుంచి ఉడాయించాడు. ఇదంతా గమనించిన సహ విద్యార్థులతో పాటు అక్కడి వారు ‘శభాష్ చెల్లెమ్మా’ అంటూ కితాబిచ్చారు.
ఏపీలో గత కొంతకాలంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తున్నదే. చిన్నపిల్లల దగ్గరి నుంచి పండు ముసలిదాకా అఘాయిత్యాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రోత్సహించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడి వాట్సాప్ గ్రూపులలో హల్‌చల్ చేస్తోంది.
అన్నట్లు మొన్నీమధ్యే యూపీ ఉన్నావ్‌లోనూ ఇదే తరహాలో ఓ ఈవ్‌టీజర్ ఆటకట్టించింది ఓ స్టూడెంట్. ఆపై ఆ వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అందుకు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి.
#उन्नाव#छात्रा ने छेड़छाड़ करने वाले #युवक की सरेराह #चप्पलों से की #धुनाई#गंगाघाट_कोतवाली क्षेत्र के पोनी रोड स्थित नीलम स्वीट हाउस के पास की #घटना#Unnao#UnnaoNews#EveTeasing#StudentSlapsMolester#UPPolice#viral#viralvideo#NewsFlash @unnaopolice @Uppolice pic.twitter.com/9HhbKTg1Pf
— Goldy Srivastav (@GoldySrivastav) July 20, 2025