తాడేపల్లి: ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిగింది. పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిరసన తెలిపినందుకు తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు మధ‍్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.


