సాక్షి, అమరావతి: ఎంపీపీలు, జడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19న 659 మండల పరిషత్‌ల్లో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు, 20న 28 జిల్లా పరిషత్‌ల్లో చైర్‌పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత ఎంపీపీల్లో ఒక్కొక్కరు, జడ్పీల్లో ఇద్దరు చొప్పున కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: గెలుపు కాదు అరాచకం


