
వైద్యులు అనగానే ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక కళ్లజోడు..చూడగానే స్మార్ట్‌గానో లేదా ఓ మోస్తారు లావుగానో ఉంటుంది వారి ఆహార్యం. చాలామటుకు వైద్యులంతా ఇలానే ఉంటారనే చెప్పొచ్చు. కానీ అలాంటి మూసపద్ధతులన్నీ బద్దలు కొట్టి ఇక్కడొక వైద్యురాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేగాదు నెట్టింట ఆ వైద్యురాలు ఎవరా..? అంటూ చర్చలు మొదలయ్యాయి.
చైనాలోని చాంగ్‌కింగ్‌లో 26 ఏళ్ల యాన్యన్ ఫోరెన్సిక్ డాక్టర్ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ మాదిరిగా కండలు తిరిగిన వైద్యుడు. సాధారణంగా డాక్టర్లు కనిపించేలా స్మార్ట్‌గా కాకుండా..వెయిట్‌లిఫ్టర్ మాదిరిగా..ఉంటుందామె. ఆమె శరీరాకృతి వైద్యరంగంలో ఉండే మూసపద్ధతులకు అత్యంత విభిన్నంగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఆ కారణంగానే ఆమె నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.
ఆమె అద్భుతమైన బలానికి, ఫిట్‌నెస్‌కి పేరుగాంచిన వైద్యురాలు. ఆమె చైనాలోని చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో పనిచేస్తున్న తొలి మహిళా ఫోరెన్సిక్ ఫాథాలజిస్ట్. ఆమె ఫోరెన్సిక్ మెడిసిన్‌లో పట్టా పొందిన వెంటనే విధుల్లో చేరారు. అప్పటి నుంచి దాదాపు 600కు పైగా మృతదేహాల అనుమానాస్పద మరణ కేసులను నిర్వహించింది.
అంతేగాదు యూన్యన్ సుమారు 120 కిలోలు బరువులను ఎత్తగలదు. ఒంటి చేత్తో చైన్సా (Chainsaw) అనే శక్తివంతమైన పోర్టబుల్ కట్టింగ్ సాధనాన్ని ఆపరేట్ చేయగలదు. కేవలం మూడు నిమిషాల్లో బ్రెయిన్‌కి సంబంధించిన క్రానియోటమీ సర్జరీని పూర్తి చేస్తుందామె. ఈ విశిష్ట సామర్థ్యమే ప్రత్యేక మహిళా వైద్యురాలిగా గుర్తింపుతెచ్చి పెట్టాయి. ఆమె ఫిట్‌నెస్ శిక్షణ తన ఉద్యోగ విధులను సులభంగా నిర్వర్తించేందుకు ఎంతగానో ఉపకరిస్తుందట.
ఎందుకుంటే తరుచుగా దాదాపు 150 కిలోలు వరకు బరువు ఉండే మృతదేహాలను కదలించడంలో ఈ దేహధారుడ్యం తనకు ఎంతగానో హెల్ప్ అవుతోందని చెబుతోంది యాన్యన్. అంతేగాదు తన సోషల్ మీడియా ఖాతాలో ఫిట్‌నెస్‌కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంటుంది. యాన్యన్ మహిళలు ఇలాంటి ఉద్యోగాలకు పనికిరారు అనే భావనను సవాలు చేయడమే లక్ష్యంగా తనను స్ట్రాంగ్‌గా చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నానని చెబుతోంది.
ఈ ఫోరెన్సిక్ రంగంలో ఇప్పటికీ వివక్ష ఉందని, కొన్ని సంస్థలు పురుషులకే ప్రాధాన్యత ఇస్తాయని వాపోయింది. అలాగే చాలామంది ప్రజలు తన వృత్తి పట్ల ప్రతికూలంగా మాట్లాడుతుంటారని, కనీసం షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారంటూ బాధగా చెప్పుకొచ్చింది. అయితే తాను అవేమి పట్టించుకోనని, తన వృత్తి ధర్మం ప్రకారం..చనిపోయిన మృతులకు న్యాయం చేకూరేలా తన వంతు సాయం చేస్తుంటానని పేర్కొంది యాన్యన్.
ఆమెకు బాడీబిల్డర్‌గా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడం, వృత్తి రెండు కళ్లులాంటివి అని, అందుకే ఆ రెండింటికి సమన్యాయం చేస్తుంటానని చెబుతోంది. తన ఉద్యోగానుభవం..జీవితంలోని దర్భలమైన పరిస్థితులను గుర్తుచేస్తూ..ప్రతి క్షణాం మంచిగా ప్రవర్తించమనే పాఠాన్ని నేర్పిస్తుందని అంటోంది యాన్యన్.
(చదవండి: జస్ట్ 15 వారాల్లో 50 కిలోలు ..! కానీ ఆ వ్యాధి కారణంగా..)