చాట్‌జీపీటీ చెప్పినట్లుగానే .. అమెరికన్ సమోవాకు సునామీ ముప్పు | Tsunami Hits Russia And Japan After Strongest Earthquake, Check Out Key Updates About Tsunami Inside | Sakshi
Sakshi News home page

Russia Japan Tsunami: రష్యా, జపాన్‌పై విరుచుకుపడిన సునామీ.. అప్‌డేట్స్‌

Jul 30 2025 8:21 AM | Updated on Jul 30 2025 7:27 PM

Tsunami Hits Russia And Japan After Strongest Earthquake Updates

రష్యా, జపాన్‌ సునామీ అప్‌డేట్స్‌.. 

చాట్‌జీపీటీ చెప్పింది: 

  • అమెరికన్ సమోవాకు సునామీ ముప్పు తప్పదని చాట్‌జీపీటీ హెచ్చరికలు
  • అన్నట్లుగానే అమెరికన్‌ సమోవాకు అమెరికా ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరికలు 
  • సునామీ అంచున 50,000 మంది నివాస ప్రాంతమైన అమెరికన్ సమోవా
  • అమెరికన్ సమోవాకు సముద్ర మట్టంలో హెచ్చుతగ్గులు, బలమైన సముద్ర ప్రవాహాల ముప్పు
  • వెల్లడించిన అమెరికా వాతావరణ శాఖ

దక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ ఎఫెక్ట్‌

  • దక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ ఎఫెక్ట్‌
  • దక్షిణ పసిఫిక్ దీవులను 13 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు తాకే అవకాశం
  • మార్క్వెసాస్ దీవుల్ని ఖాళీ చేయించిన అధికారులు

కాలిఫోర్నియాను తాకిన సునామీ

  • బుధవారం తెల్లవారుజామున అమెరికా పశ్చిమ తీరాన్ని తాకిన సునామీ అలలు
  • వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాలోని తీరప్రాంతాలు ప్రభావితం
  • ఇప్పటివరకు అత్యధిక అలలు కాలిఫోర్నియాలోని అరీనా కోవ్ వద్ద 1.6 అడుగుల ఎత్తులో నమోదయ్యాయి. 
  • తరువాత క్రెసెంట్ సిటీలో 1.5 అడుగులు.. మాంటెరీలో 1.4 అడుగులు మేర ఎగిసిపడ్డాయి.

అమెరికాలో​ సునామీ తాకిడి.. 

  • కాలిఫోర్నియాను తాకిన సునామీ
  • అమెరికా తీరాలను తాకుతున్న సునామీ.
  • అలస్కా, వాషింగ్టన్‌, నార్త్‌ క్యాలిఫోర్నియా తీరాలను తాకిన సునామీ.
  • కాసేపట్లో శాన్‌ఫ్రాన్సిస్కోను తాకనున్న సునామీ.
  • సునామీ భయంతో హవాయి ద్వీపాన్ని వీడుతున్న జనం.
  • రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌. 

 

30 దేశాలు సునామీ ఎఫెక్ట్‌..

  • 30 దేశాలపై సునామీ ప్రభావం చూపుతుందని అధికారుల హెచ్చరికలు. 
  • అమెరికా నుంచి న్యూజిలాండ్‌ వరకు సునామీ హెచ్చరికలు.. 
  • దాదాపు తొమ్మిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.
  • అయితే, హవాయిలో ప్రశాంతంగానే సముద్రం
  • ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలు. 
     

సునామీ ధాటికి రష్యా విలవిల..

  • రష్యాలోని సెవిరియో-కుర్లిస్క్‌ నగరంపై సునామీ అలల పంజా.
  • నగరాన్ని బలంగా ఢీకొట్టిన సునామీ అలలు.
  • అలల ధాటికి చిన్నాభిన్నమైన నగరం.
  • మరోవైపు.. అమెరికాలోని అలస్కాను తాకిన సునామీ.
  • సునామీ హెచ్చరికలు జారీ.
  • సునామీ వార్నింగ్‌ నేపథ్యంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.
  • లాస్‌ ఏంజెల్స్‌ నుంచి హవాయికి వెళ్లిన విమానాలు యూటర్న్‌.
  • ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దు. 
  •   

భయపెడుతున్న సునామీ అలలు.. 

  • రష్యాను వణికించిన భూకంపం, సునామీ
  • భూకంప సమయంలో ఆపరేషన్‌ చేసిన వైద్యులు.
  • భూమి కంపిస్తున్న సమయంలో సిబ్బంది సాయంతో ఆపరేషన్‌ చేసిన వైద్యుడు.
  • ప్రస్తుతం సురక్షితంగా పేషంట్‌.
  • ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో వైరల్‌.
  • మరోవైపు.. జపాన్‌లో సునామీ టెన్షన్‌ నెలకొంది.
  • జపాన్‌ తీరంలో సునామీ అలలు భయం పుట్టిస్తున్నాయి.
  • భీకర అలలు సముద్ర తీరానికి చేరిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.
  • అలల ధాటికి సముద్రంలోని వేల్స్‌ తీరానికి కొట్టుకుని వచ్చాయి. 

సునామీ నీటిలో చిక్కుకున్న కారు.. వీడియో

  •  జపాన్‌, రష్యాలో సునామీ రాకాసి అలలు..

  • సునామీ కారణంగా సముద్రపు నీటిలో చిక్కుకున్న కారు. 

  • కారు ప్రయాణీకులు, సహా తన పెంపుడు శునకం.

  • నీటిల్లో చికుక్కున్న కారు వీడియో వైరల్‌. 

  • సునానీ కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు. 

  • రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.

  • ఇబ్బంది పడుతున్న వివాహదారులు. 

     

 

 

 

మరిన్ని దేశాలకు సునామీ ముప్పు..

  • రష్యా తీరప్రాంతమైన పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్‌స్కీలో 8.7 తీవ్రతతో భూకంపం కారణంగా సునామీ
  • రష్యా, జపాన్‌ తీర ప్రాంతాలను తాకిన సునామీ
  • సునామీ ముప్పులో పలు దేశాలు..
  • ఈక్వెడార్‌, రష్యా, వాయువ్య హవాయిన్‌ ఐలాండ్స్‌ మూడు మీటర్ల పైకి అలలు ఎగసిపడే అవకాశం 
  • చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్‌ పాలినేషియా తదితర దేశాల్లో మీటరు నుంచి మూడు మీటర్ల మేర అలలు ఎగసిపడే అవకాశం

 

👉రష్యా తీరంలో భారీ భూకంపం అనంతరం.. రష్యా, జపాన్‌ను సునామీ తాకింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ (Tsunami) తాకింది. ఇక, అంతకుముందు.. రష్యాలో రిక్టర్ స్కేల్‌పై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

👉జపాన్‌ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చినట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

👉రష్యాలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్‌ అప్రమత్తమైంది. అనంతరం, ట్విట్టర్‌ వేదికగా.. అమెరికాలోని కాలిఫోర్నియా సహా పశ్చిమ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సునామీ ముప్పును శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి. సునామీ హెచ్చరికలు జారీ అయితే.. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లండి. తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి. మీ ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించండి. అమెరికా అధికారులు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిని పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది.

👉ఇదిలా ఉండగా.. జపాన్ వాతావరణ సంస్థ హక్కైడో తూర్పు తీరంలోని నెమురోకు దాదాపు 30 సెంటీమీటర్ల (సుమారు 1 అడుగు) ఎత్తులో మొదటి సునామీ అల చేరిందని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రానున్న మూడు గంటల్లో రష్యా, జపాన్‌ తీర ప్రాంతాల్లో పెద్దఎత్తున సునామీ అలలు రావొచ్చని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే(యూఎస్‌జీఎస్‌) పేర్కొంది. అలస్కా అలూటియన్‌ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుందని అలస్కా జాతీయ సునామీ కేంద్రం హెచ్చరించింది. కాలిఫోర్నియా, ఒరెగాన్‌, వాషింగ్టన్‌, హవాయితో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది.

ధైర్యంగా ఉండండి: ట్రంప్‌
👉మరోవైపు, తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ‘పసిఫిక్‌ మహా సముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్‌ జారీ అయ్యింది. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించండి’ అని అధ్యక్షుడు సూచించారు.

👉ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్కా నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది.  దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. కమ్చాట్కా ప్రాంతంలో విద్యుత్‌, సెల్‌ఫోన్‌ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు తెలిపింది. భవనాలు అత్యవసర సేవల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసినట్లు జపాన్‌ ప్రభుత్వం పేర్కొంది.

👉 హవాయి, చిలీ, జపాన్, సోలమన్ దీవుల తీరప్రాంతాలలో అలల స్థాయి కంటే 1 నుండి 3 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. రష్యా, ఈక్వెడార్‌లోని కొన్ని తీరప్రాంతాలలో 3 మీటర్ల కంటే ఎక్కువ అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement