breaking news
Japan Earthquake
-
చాట్‌జీపీటీ చెప్పినట్లుగానే .. అమెరికన్ సమోవాకు సునామీ ముప్పు
రష్యా, జపాన్ సునామీ అప్డేట్స్.. చాట్‌జీపీటీ చెప్పింది: అమెరికన్ సమోవాకు సునామీ ముప్పు తప్పదని చాట్‌జీపీటీ హెచ్చరికలుఅన్నట్లుగానే అమెరికన్ సమోవాకు అమెరికా ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరికలు సునామీ అంచున 50,000 మంది నివాస ప్రాంతమైన అమెరికన్ సమోవాఅమెరికన్ సమోవాకు సముద్ర మట్టంలో హెచ్చుతగ్గులు, బలమైన సముద్ర ప్రవాహాల ముప్పువెల్లడించిన అమెరికా వాతావరణ శాఖదక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ ఎఫెక్ట్దక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ ఎఫెక్ట్దక్షిణ పసిఫిక్ దీవులను 13 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు తాకే అవకాశంమార్క్వెసాస్ దీవుల్ని ఖాళీ చేయించిన అధికారులుకాలిఫోర్నియాను తాకిన సునామీబుధవారం తెల్లవారుజామున అమెరికా పశ్చిమ తీరాన్ని తాకిన సునామీ అలలువాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాలోని తీరప్రాంతాలు ప్రభావితంఇప్పటివరకు అత్యధిక అలలు కాలిఫోర్నియాలోని అరీనా కోవ్ వద్ద 1.6 అడుగుల ఎత్తులో నమోదయ్యాయి. తరువాత క్రెసెంట్ సిటీలో 1.5 అడుగులు.. మాంటెరీలో 1.4 అడుగులు మేర ఎగిసిపడ్డాయి.అమెరికాలో సునామీ తాకిడి.. కాలిఫోర్నియాను తాకిన సునామీఅమెరికా తీరాలను తాకుతున్న సునామీ.అలస్కా, వాషింగ్టన్, నార్త్ క్యాలిఫోర్నియా తీరాలను తాకిన సునామీ.కాసేపట్లో శాన్ఫ్రాన్సిస్కోను తాకనున్న సునామీ.సునామీ భయంతో హవాయి ద్వీపాన్ని వీడుతున్న జనం.రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్. Dozens of Steller sea lions flee tsunami waves on Russia’s Antsiferov Island, captured in striking footage https://t.co/uKMw0MCqrg pic.twitter.com/9UkZUIqxso— RT (@RT_com) July 30, 2025 30 దేశాలు సునామీ ఎఫెక్ట్..30 దేశాలపై సునామీ ప్రభావం చూపుతుందని అధికారుల హెచ్చరికలు. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు.. దాదాపు తొమ్మిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.అయితే, హవాయిలో ప్రశాంతంగానే సముద్రంఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలు. Rusya'nın Kamçatka Yarımadasında 8,8, büyüklüğünde deprem meydana geldi.Deprem sonrasında balinalar kıyaya vurmuş.#Japan #Russian #Hawaii #tsunami pic.twitter.com/TurM68zciD— Elif Erdağ (@ElifErdagTR45) July 30, 2025సునామీ ధాటికి రష్యా విలవిల..రష్యాలోని సెవిరియో-కుర్లిస్క్ నగరంపై సునామీ అలల పంజా.నగరాన్ని బలంగా ఢీకొట్టిన సునామీ అలలు.అలల ధాటికి చిన్నాభిన్నమైన నగరం.మరోవైపు.. అమెరికాలోని అలస్కాను తాకిన సునామీ.సునామీ హెచ్చరికలు జారీ.సునామీ వార్నింగ్ నేపథ్యంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.లాస్ ఏంజెల్స్ నుంచి హవాయికి వెళ్లిన విమానాలు యూటర్న్.ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దు. Drone footage below reveals extensive damage to the port of Severo-Kurilsk in Russia’s Kuril Islands, following #tsunami waves triggered by the 8.8 magnitude #earthquake off the coast of #Kamchatka.#Sismo #Temblor #Tsunamiwarning #temblorgt #揺れ #地震pic.twitter.com/Hc2NvaXJdx— Chaudhary Parvez (@ChaudharyParvez) July 30, 2025 FLIGHTS TURN BACK as tsunami threat grows in Hawaii Multiple planes en route now diverting to Los Angeles Honolulu airspace tightens pic.twitter.com/wLw9GV4Dni— RT (@RT_com) July 30, 2025 భయపెడుతున్న సునామీ అలలు.. రష్యాను వణికించిన భూకంపం, సునామీభూకంప సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యులు.భూమి కంపిస్తున్న సమయంలో సిబ్బంది సాయంతో ఆపరేషన్ చేసిన వైద్యుడు.ప్రస్తుతం సురక్షితంగా పేషంట్.ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో వైరల్.మరోవైపు.. జపాన్‌లో సునామీ టెన్షన్ నెలకొంది.జపాన్ తీరంలో సునామీ అలలు భయం పుట్టిస్తున్నాయి.భీకర అలలు సముద్ర తీరానికి చేరిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.అలల ధాటికి సముద్రంలోని వేల్స్ తీరానికి కొట్టుకుని వచ్చాయి. ❗️#Tsunami Waves Arrive On Japan's Coast #Earthquake https://t.co/PawVXXBOs0 pic.twitter.com/JiJ44FjMAg— RT_India (@RT_India_news) July 30, 2025Doctors in Kamchatka kept calm during the powerful earthquake— and never stopped the surgery.The patient is doing well, according to the Health Ministry!#Tsunami #Earthquake #China#Russia #Hawaii #Japan #Sismo #Temblor #Tsunamiwarning #揺れ #地震 pic.twitter.com/Y38Hdyybyc— TIger NS (@TIgerNS3) July 30, 2025సునామీ నీటిలో చిక్కుకున్న కారు.. వీడియో జపాన్, రష్యాలో సునామీ రాకాసి అలలు..సునామీ కారణంగా సముద్రపు నీటిలో చిక్కుకున్న కారు. కారు ప్రయాణీకులు, సహా తన పెంపుడు శునకం.నీటిల్లో చికుక్కున్న కారు వీడియో వైరల్. సునానీ కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్.ఇబ్బంది పడుతున్న వివాహదారులు. Breaking News 😞🇷🇺🌊 Terrifying Footage from KamchatkaA video shows Russian citizens and their pet trapped in a car as tsunami waves hit Kamchatka. Water can be seen rushing in as they desperately try to stay safe. pic.twitter.com/uKptePtUjr— Tarique Hussain (@Tarique18386095) July 30, 2025 Insane amount of traffic in #Hawaii right now #Tsunami #earthquake pic.twitter.com/pBdb7M1g4L— john (@JohnBrad64) July 30, 2025మరిన్ని దేశాలకు సునామీ ముప్పు..రష్యా తీరప్రాంతమైన పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్‌స్కీలో 8.7 తీవ్రతతో భూకంపం కారణంగా సునామీరష్యా, జపాన్ తీర ప్రాంతాలను తాకిన సునామీసునామీ ముప్పులో పలు దేశాలు..ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయిన్ ఐలాండ్స్ మూడు మీటర్ల పైకి అలలు ఎగసిపడే అవకాశం చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా తదితర దేశాల్లో మీటరు నుంచి మూడు మీటర్ల మేర అలలు ఎగసిపడే అవకాశం 👉రష్యా తీరంలో భారీ భూకంపం అనంతరం.. రష్యా, జపాన్ను సునామీ తాకింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ (Tsunami) తాకింది. ఇక, అంతకుముందు.. రష్యాలో రిక్టర్ స్కేల్‌పై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. 🚨 BREAKING - Tsunami waves hitting the Chiba Prefecture, Eastern Japan#Tsunami #Russia #Hawaii #Earthquake pic.twitter.com/xAx4g0oBAG— T R U T H P O L E (@Truthpolex) July 30, 2025👉జపాన్ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చినట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.👉రష్యాలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. అనంతరం, ట్విట్టర్ వేదికగా.. అమెరికాలోని కాలిఫోర్నియా సహా పశ్చిమ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సునామీ ముప్పును శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి. సునామీ హెచ్చరికలు జారీ అయితే.. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లండి. తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి. మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించండి. అమెరికా అధికారులు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిని పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది.🚨🚨🚨The Consulate General of India in San Francisco is monitoring the potential tsunami threat following the recent 8.7 magnitude earthquake off Russia's Kamchatka Peninsula. Indian nationals in California, other US West Coast states, and Hawaii are advised to take the…— India in SF (@CGISFO) July 30, 2025👉ఇదిలా ఉండగా.. జపాన్ వాతావరణ సంస్థ హక్కైడో తూర్పు తీరంలోని నెమురోకు దాదాపు 30 సెంటీమీటర్ల (సుమారు 1 అడుగు) ఎత్తులో మొదటి సునామీ అల చేరిందని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రానున్న మూడు గంటల్లో రష్యా, జపాన్ తీర ప్రాంతాల్లో పెద్దఎత్తున సునామీ అలలు రావొచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. అలస్కా అలూటియన్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుందని అలస్కా జాతీయ సునామీ కేంద్రం హెచ్చరించింది. కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్, హవాయితో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది.pic.twitter.com/iD520Gt6kS A Massive Earthquake triggers a Tsunami, taking thousands of lives in seconds with little to no warning. #Russia #Tsunami #japan #earthquake— Made on Earth by Humans (@1singdollar) July 30, 2025ధైర్యంగా ఉండండి: ట్రంప్👉మరోవైపు, తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ అయ్యింది. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించండి’ అని అధ్యక్షుడు సూచించారు.#ÚltimaHora - #Tsunami golpeando las costas de #Kamchatka, Rusia🇷🇺Los tsunamis son una secuencia de olas y no siempre las primeras olas son las más grandes. pic.twitter.com/aBgpkukOUX— SkyAlert (@SkyAlertMx) July 30, 2025👉ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. కమ్చాట్కా ప్రాంతంలో విద్యుత్, సెల్‌ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు తెలిపింది. భవనాలు అత్యవసర సేవల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది.🚨 BREAKING - Shocking footage of the moment M8.8 earthquake shit the the coast of the Kamchatka Peninsula, East of Russia#Earthquake #Tsunami #Russia #Hawaii #Alert pic.twitter.com/FKnqm6nRdL— T R U T H P O L E (@Truthpolex) July 30, 2025👉 హవాయి, చిలీ, జపాన్, సోలమన్ దీవుల తీరప్రాంతాలలో అలల స్థాయి కంటే 1 నుండి 3 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. రష్యా, ఈక్వెడార్‌లోని కొన్ని తీరప్రాంతాలలో 3 మీటర్ల కంటే ఎక్కువ అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. -
జపాన్‌లో భూకంపం.. 6.4 తీవ్రత నమోదు
నోటో: జపాన్‌లో భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య ప్రాంతంలోని నోటోలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నోటో ద్వీపకల్పంలోని పశ్చిమ తీరంలో 10 కి.మీ. (6.2 మైళ్ళు) లోతులో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణశాఖ తెలిపింది.ఈ ఏడాది ప్రారంభంలో సంభవించిన భారీ భూకంపం నుండి కోలుకుంటున్నంతలోనే ఇప్పుడు మరో భూపంపం సంభవించింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు యూఎస్జీఎస్ పేర్కొంది. భూకంపానికి సంబంధించిన నష్టం గురించి తక్షణ నివేదికలేవీ లేవు. 2024, జనవరి ఒకటిన నోటో ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాటి దుర్ఘటనలో 370 మందికి పైగా జనం మృతిచెందారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇది కూడా చదవండి: పరిహారం చెల్లించాకే భూసేకరణ -
జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి
జపాన్‌లో భారీ భూకంపం అప్డేట్స్: ► జపాన్‌లో సునామి హెచ్చరికలు, సలహాలను అధికారులు ఎత్తివేశారు. అయితే సముద్రపు అలల్లో మార్పులు రావడానికి ఇంకా అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు భూకంప బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Officials Lift Tsunami Warnings After Powerful Quake Off Chilean Coast - https://t.co/NuaBIIWbA6 pic.twitter.com/TtEX1f2w2Z — Alaska Native News (@AKNativeNews) December 26, 2016 ► జపాన్‌లో భీభత్సం సృష్టించిన భూకంపంలో 30 మంది మృత్యువాత పడ్డారని స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ మృతు సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతి చెందిన 30 మందిలో సగం మంది వాజిమా నగరంలో చనిపోయినట్టు తెలుస్తోంది. #UPDATE The death toll from a powerful earthquake in central Japan rose to 30 on Tuesday, local authorities say, with 14 others seriously injured. Half the deaths were recorded in the city of Wajima, where a huge blaze tore through homes, the Ishikawa prefectural government says pic.twitter.com/BS1lEa0vJ5 — AFP News Agency (@AFP) January 2, 2024 ► సముద్రపు అలలు 5 అడుగులపైకి దూసుకురావటంతో అధికారులు సునామి హెచ్చరికలు జారీ చేశారు. భూకంపంతో సమారు 33 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. #Japan | Roads Split Open and Swallow Cars. #JapanEarthquake #JapanTsunami (AP) pic.twitter.com/G81rGMr4Xh — Mansi Bhagat (@mansibhagat1009) January 2, 2024 ► జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగొచ్చని, ఇప్పటి వరకు 20 మంది మృత్యువాత పడ్డారని జపాన్ స్థానిక మీడియా వెల్లడించింది. After earthquake cars roads and building being wash away by tsunami flood. #Japan pic.twitter.com/sLsuVXvJaN — Agha Akakhel (@AghaAkakhel) January 1, 2024 ► జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో సహాయ చర్యలపై ప్రధానమంత్రి పుమియో కిషిడా సమీక్ష నిర్వహించారు. ‘భూకంపంతో తీవ్రమైన నష్టం జరిగింది. ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుంది. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. భూకంపంతో కొన్ని చోట్ల అగ్ని ప్రమాదం జరిగింది’ అని తెలిపారు. భూకంపంతో ఇబ్బందులు పడుతున్న వారికి సహయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పలు కూలీపోయిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడానకి రెస్య్కూ టీం సాయం అందిస్తోందని పేర్కొన్నారు. ► జపాన్ భారీ భూకంపంతో సోమవారం నుంచి 155 సార్లు భూమి కంపించింది. భారీ భూకంపంతో పలు భవనాలు కూలిపోయాయి. పలు రోడ్లపై పగుళ్లు వచ్చాయి. భూకంప తీవ్రతకు తెలిపే CCTV ఫుటేజీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో రోడ్ల పగుళ్లు, రైల్వే స్టేషన్లో బోర్డులు ఊగిపోవటం కనిపిస్తున్నాయి. Some of the Footage coming out of Japan following the 7.6 Magnitude Earthquake which Struck the Country earlier this morning is Insane and truly shows the Power of Geological Forces on this Planet. pic.twitter.com/iwCRB3jmCv — OSINTdefender (@sentdefender) January 1, 2024 ► భారీ భూకంపం జపాన్ను కుదిపేసింది. సోమవారం రిక్కార్ స్కేల్‌పై 7.6 తీవ్రతో భూకంపం నమోదైనట్లు జపాన్ వాతారణ సంస్థ పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. అయితే ఇప్పటివరకు ఎనిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. We must stand with the people of Japan , during this tough time in which they are experiencing a Tsunami and earthquake. May God protect the children mothers & people of Japan from the Tsunami #Japan #earthquake #Tsunami#JapanEarthquake #JapanTsunamipic.twitter.com/dSfvKBZu7M — Kohlified 🗿 (@ShreeGZunjarrao) January 1, 2024 అదేవిధంగా జపాన్‌లో చోటుచేసుకున్న భూకంపం కారణంగా ఇషికావా నగరంలో భారీగా మంటలు చెలరేగాయి. పలు భవనాలు మంటల్లో కాలిపోయాయి. 30,000 కంటే ఎక్కువ గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. THE SITUATION IS GETTING MORE COMPLICATED: A fire broke out at one of the Japanese nuclear plants A fire broke out at the Shiga nuclear power plant in Japan after the devastating earthquakes that hit the country today, Japanese media reported. pic.twitter.com/3ZSrBqY8ph — Vlado Gorski (@VGorski011) January 1, 2024 ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. ఇషిగావాలోని నోటో ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ అలలు విస్తరించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు.