
జపాన్, ఫిలిప్పీన్స్‌లో విలయం!
‘జపాన్ బాబా వాంగా’ జోస్యం
ప్రపంచమంతటా పెను ఉత్కంఠ
పెను ఉత్పాతానికి మరో రెండు రోజులేనా? శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు.
దాంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్’ ఇప్పుడు ఆన్‌లైన్‌లో యమా ట్రండింగ్‌లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు.
తత్సుకీ ఏం చెప్పారు?
కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘‘జపాన్, ఫిలిప్పీన్స్ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరŠామ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’’ అంటూ వరి్ణంచారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది.

ఎవరీ తత్సుకీ?
తత్సుకీ జపాన్‌కు చెందిన మాంగా ఆరి్టస్టు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్‌ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్