
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల మోత మోగించారు. భారత్‌పై 25శాతం సుంకాలే కాదు అదనంగా పెనాల్టీ విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్ బాంబ్ పేల్చారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ఆట్వీట్‌లో భారత్‌పై టారిఫ్‌తో పాటు అదనంగా జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సుంకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది.
భారత్ మాకు మిత్రుడే అయినప్పటికీ అత్యధిక దిగుమతి టారిఫ్‌లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయని విమర్శించారు. భారత్.. రష్యా నుంచి భారీగా ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నిర్ణయం హేయమైన చర్య’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారత్ మా స్నేహ దేశమే. కానీ వారు ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు గాను 25శాతం టారిఫ్‌తో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సిందేనని ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.