
టోక్యో: జపాన్‌ను సునామీ తాకింది. బుధవారం రష్యా తీరంలో 8.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కురిల్ దీవులు, జపాన్‌లోని హక్కైడో తీరప్రాంతాలలో సునామీకి కారణంగా నిలిచింది. అమెరికాలోని కాలిఫోర్నియా, అలాస్కా, హవాయి న్యూజిలాండ్ వైపు ఉన్న ఇతర తీరాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
జపాన్ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం తూర్పు తీరంలోని ఇషినోమాకి ఓడరేవును 50 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ తాకింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత పెద్దదయిన అల. పసిఫిక్ తీరం వెంబడి దక్షిణానికి, హక్కైడో నుండి టోక్యోకు, పలు ఈశాన్య ప్రాంతాలకు సునామీ కదులుతున్నప్పుడు 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఏర్పడ్డాయి. ఇటువంటి భారీ అలలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.
JUST IN: At least 4 whales have washed up along the coast of Japan, hours after 8.8 earthquake pic.twitter.com/t9siMZDHFS
— BNO News Live (@BNODesk) July 30, 2025
భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత సునామీ తాకిడికి జపాన్ తీరం వెంబడి నాలుగు భారీ తిమింగలాలు కొట్టుకువచ్చాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. అలలు ముందుకు వెనుకకు కదులుతుండగా తీరం వెంబడి వస్తున్న తిమింగలాలకు సంబంధించిన వీడియోను బీఎన్‌ఓ న్యూస్ షేర్ చేసింది.

సునామీ అలలు సాధారణ అలల కంటే బలంగా ఉంటాయని, ఈ విధంగా వచ్చే 50 సెం.మీ. అల 200 కిలోల వరకు శక్తిని మోయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టోక్యో విశ్వవిద్యాలయ భూకంప శాస్త్రవేత్త సకాయ్ షినిచి మీడియాతో మాట్లాడుతూ గతంలో వచ్చిన శక్తివంతమైన భూకంపాల ఫలితంగా సంభవించిన సునామీలు జపాన్‌కు భారీ నష్టాన్ని కలిగించాయన్నారు. ఇప్పుడొచ్చిన భూకంపం 1952 నాటి భూకంపాన్ని పోలి ఉంని అన్నారు.