భారీ భూకంపంతో వణికిన రష్యా.. 8.7 తీవ్రత నమోదు | 8.8 Magnitude Earthquake Hits Russia, Tsunami Hits Kamchatka Coast Waves Upto 4 Metres, Watch Shocking Video Inside | Sakshi
Sakshi News home page

Russia Earthquake: భారీ భూకంపంతో వణికిన రష్యా.. 8.7 తీవ్రత నమోదు

Jul 30 2025 7:15 AM | Updated on Jul 30 2025 9:18 AM

8 Magnitude Earthquake Hits Russias

మాస్కో: రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. రాబోయే మూడు గంటల్లో రష్యా, జపాన్ తీరప్రాంతాలకు విధ్వంసక సునామీ అలలు చేరుకోవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. భూకంప ప్రభావిత ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. 

 


భూకంప తీవ్రతకు భవనాల లోపల జరిగిన కంపనలు  ఆ వీడియోలలో కనిపిస్తున్నాయి. ఒక వీడియోలో భూకంపం సంభవించిన సమయంలో అపార్ట్‌మెంట్‌లోని ఫర్నిచర్ తీవ్రంగా ఊగిపోవడాన్ని గమనించవచ్చు.
 

 

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి అతి సమీపంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు నేపధ్యంలో జపాన్‌ వాతావరణ విభాగం రష్యా తీరం వెంబడి  సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ కాలమానం ప్రకారం ఈ భూకంపం బుధవారం ఉదయం 8:25 గంటలకు సంభవించింది.

ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. జపాన్‌లోని నాలుగు దీవులకు ఉత్తరాన ఉన్న హక్కైడోకు ఈ భూకంప కేంద్రం 250 కిలోమీటర్లు (160 మైళ్ళు) దూరంలో ఉందని సమాచారం. జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కే టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది స్వల్ప ప్రభావమే చూపిందని తెలుస్తోంది.
 

ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 12 మైళ్ల లోతులో ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే కమ్చట్కాలో  ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే సంగతిని రష్యా  ఇంకా వెల్లడించలేదు. కాగా హవాయికి దీపానికి రష్యా సునామీ హెచ్చరిక జారీ చేసింది.  ఇది తక్కువ ముప్పు కలిగిన అలర్ట్ అని తెలుస్తోంది. టోక్యో భూకంప శాస్త్రవేత్త షినిచి సకాయ్  మీడియాతో మాట్లాడుతూ  ఈ భూకంపం జపాన్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే సునామీకి కారణంగా నిలవనున్నదని అంచనా వేశారు.  

 

ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. ఈ ప్రాంతంలో ఈ నెల ప్రారంభంలోనే ఐదు భారీ భూకంపాలు- 7.4 తీవ్రతతో సంభవించాయి. అతిపెద్ద భూకంపం 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో ఇది తన ప్రభావాన్ని చూపింది. 1952,నవంబర్ 4న కమ్చట్కాలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆందోళన కలిగించింది. నాడు హవాయిలో 9.1 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement