tsunami warning: ‘బీచ్‌ రోడ్డులో భీకర ట్రాఫిక్.. బిడ్డతో 13వ అంతస్థు సేఫ్‌’ | tsunami Warning Woman Stays in Condo with Daughter | Sakshi
Sakshi News home page

tsunami warning: ‘బీచ్‌ రోడ్డులో భీకర ట్రాఫిక్.. బిడ్డతో 13వ అంతస్థు సేఫ్‌’

Jul 30 2025 11:19 AM | Updated on Jul 30 2025 11:43 AM

tsunami Warning Woman Stays in Condo with Daughter

మాస్కో: రష్యా తీరంలో బుధవారం 8.8 తీవ్రతతో  శక్తివంతమైన భూకంపం సంభవించిన అనంతరం రష్యాలోని కురిల్ దీవులు, జపాన్‌లోని  హక్కైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. అలాస్కా, హవాయి, న్యూజిలాండ్‌కు దక్షిణాన ఉన్న తీరాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇంతటి భయానక పరిస్థితుల నేపధ్యంలో హవాయిలోని హోనోలులులో తన ఇంటి వదిలి వెళ్ళడానికి తాను ఎందుకు నిరాకరిస్తున్నానో వివరించే టిక్‌టాక్ వీడియోను ఒక మహిళ షేర్ చేసింది.

సునామీ హెచ్చరికల నేపధ్యంలో సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు తన పసిబిడ్డను ఎత్తుకుని 15 నుండి 20 నిమిషాలు నడవాల్సి ఉంటుందని షెల్బీ కె బ్లాక్‌బర్న్ అనే మహిళ తన టిక్‌టాక్ వీడియోలో వివరించింది. సునామీ తాకనున్నదనే భయంతో స్థానికులు, సందర్శకులు హవాయి నుంచి అలా వే హార్బర్, వైకికి, ఓహులకు కార్లలో చేరుకునే ప్రయత్నంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారని షెల్బీ కె బ్లాక్‌బర్న్ తెలిపింది. ఈ ట్రాఫిక్‌లో చిక్కుకునే బదులు తన ఇంటిలోనే ఉండటం సురక్షితమని భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది.
 

షెల్బీ తన వీడియోలో తాను  బీచ్‌కు చాలా దూరంలోని బహుళ అంతస్థుల భవనంలోని 13వ అంతస్తులో  ఉన్నానని తెలిపింది. తనకు కారు లేదని, ఏదో ఒక కారులో బయలుదేరాలనుకున్నా, బీచ్ నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న వారితో వీధులు పూర్తిగా నిండిపోయాయని తెలిపారు.  ఇక్కడి  నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలంటే, కుమార్తెను ఎత్తుకుని 20 నిమిషాలు నడవాలని ఆమె వివరించింది. అందుకే ఇక్కడే ఉండటం మంచిదని భావిస్తున్నానని షెల్బీ పేర్కొంది. బీచ్‌కు దూరంగా ఎత్తుగా ఉన్న తానుంటున్న భవనం సురక్షితమేనని అనుకుంటున్నానని, ఇరుగు పొరుగువారు  కూడా పై అంతస్తులకు చేరుకుంటున్నారని ఆమె తెలిపింది. ఈ పరిస్థితులను ఆమె వీడియోలో చూపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement