
లక్నో: ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు బాధితుణ్ణి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది స్ట్రెచర్‌పై ఆస్పత్రి వార్డుకు తరలించారు. అసలే ఓడుతున్న రక్తం.. భరించ లేని నొప్పిని తాళలేక గుండెలవిసేలా కేకలు వేస్తున్నాడు. కేకలు విన్న వైద్యులు హుటాహుటీన వచ్చి ట్రీట్మెంట్ అందించి ఉంటే.. బాధితుడు బ్రతికేవాడు. కానీ అలా జరగలేదు. ఏసీ గదిలో హాయిగా నిద్రపోయారు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తరప్రదేశ్ మీరట్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సునీల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం లాలా లజపత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. విధుల్లో ఉన్న ఇద్దరు జూనియర్ డాక్టర్లు నిర్లక్క్ష్యంగా వ్యవహరించారు. విధుల్లో మొద్దు నిద్రపోవడంతో క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో బాధితుడు అత్యవసర వార్డులో స్ట్రెచర్‌పై ఆహాకారాలు చేస్తుండగా.. కుర్చీలో కూర్చుని జూనియర్ డాక్టర్లు భూపేశ్ కుమార్ రాయ్, అనికేత్ నిద్రపోతుండడాన్ని గమనించవచ్చు.
వీడియోలో ఓ డాక్టర్ ఏసీ ముందు కాళ్లు టేబుల్ మీద పెట్టుకుని నిద్రపోతుండగా.. నిద్ర పోతున్న డాక్టర్ ముందు ప్రిస్క్రిప్షన్ పట్టుకుని చంకలో చంటి పిల్లాడితో ఉన్న ఓ తల్లి అతడిని నిద్రలేపే ప్రయత్నం చేస్తుంది. గంటల తరబడి ఎవరూ పట్టించుకోకపోవడంతో స్ట్రెచర్‌పై నొప్పితో, రక్తస్రావంతో బాధపడుతూ సునీల్ మరణించాడు. ఈ ఘటనపై లాలా లజపతిరాయ్ మెమోరియల్ (LLRM) మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.
ఈ సంఘటన జరిగిన సమయంలో డ్యూటీ-ఇన్‌చార్జ్ డాక్టర్ శశాంక్ జిందాల్ ఆసుపత్రిలో లేరు. పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత తాను తిరిగి వెళ్లి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, కాస్ట్ ఇచ్చానని చెప్పాడు. అయితే, మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సునీల్ మరణించాడు. రోగిని తీసుకువచ్చినప్పటికే పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ జిందాల్ చెప్పడంపై బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్‌ను వివరణాత్మక విచారణ నిర్వహించాలని కోరారు. ఘటనపై ప్రభుత్వం వైద్యులను విధుల నుంచి తొలగించింది.
मेरठ के पश्चिमी यूपी के सबसे बड़े मेडिकल सेंटर #LLRM मेडिकल कॉलेज में
हादसे में घायल सुनील को आधी रात को इमरजेंसी में लाया गया।
वो तड़पता रहा, मदद मांगता रहा,लेकिन डॉक्टर सोते रहे।
इलाज न मिलने से सुनील की जान चली गई। pic.twitter.com/cmDI0YVnG3— B_L Bairwa (@BSSVERMA) July 28, 2025