సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో నకిలీ సర్టిఫికెట్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ డాక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రాజశేఖర్ అనే వ్యక్తి ఎటువంటి వైద్య విద్యార్హతలు లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో గత కొంతకాలంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వైద్య అధికారులకు ఫిర్యాదు అందడంతో ఆయూషి నర్సింగ్ హోమ్‌లో తనిఖీలు నిర్వహించిన వైద్యాధికారులు.. నకిలీ సర్టిఫికెట్లను గుర్తించారు.
తనిఖీల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆయుషి నర్సింగ్ హోమ్‌ను సీజ్ చేశారు. నకిలీ డాక్టర్ రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ డాక్టర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ అక్రమ దందా వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. అర్హత లేని వ్యక్తుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు.


