
నారాయణపేట: తేళ్లను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎక్కడ కుట్టి చంపేస్తుందేమోననే భయంతో ఆమడదూరం పారిపోతాం. కానీ, తేలు కుట్టని రోజంటూ ఒకటుందని మీకు తెలుసా.. అదే తేళ్ల పంచమి. (Tella Panchami)

ఈ రోజు తేలును పట్టుకున్నా.. ఒంటిపై, చెంపపై, చేతిపై వేసుకున్నా.. ఏకంగా నోట్లో నాలుకపై పెట్టుకున్నా ఏమీ చేయని అరుదైన దృశ్యాలను రాష్ట్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా కందుకూరులో చూడవచ్చు.

నాగుల పంచమి పర్వదిన మైన మంగళవారం తేళ్ల పంచమిని పురస్కరించుకొ ని స్థానికంగా కొండమవ్వగుట్టపైకి వందలాది మంది తరలివెళ్లి తేళ్ల విగ్రహాలకు పూజలు చేశారు.

గుట్ట పై రాళ్ల కింద, చెట్ల పొదల్లో ఉన్న తేళ్లను చిన్నా, పెద్ద తేడా లేకుండా పట్టుకొని సందడి చేశారు.



















