సింధూ నదిలో పడిపోయిన ఐటీబీపీ బస్సు.. వీడియో | ITBP Jawans Bus fell down Kullan bridge Sindh River | Sakshi
Sakshi News home page

సింధూ నదిలో పడిపోయిన ఐటీబీపీ బస్సు.. వీడియో

Jul 30 2025 11:39 AM | Updated on Jul 30 2025 11:56 AM

ITBP Jawans Bus fell down Kullan bridge Sindh River

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఐటీబీపీ(ఇండో-టిబెటియన్‌ బోర్డర్‌ పోలీసులు) ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వర్షాల కారణంగా అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పోలీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని గండేర్‌బల్ జిల్లాలో ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది, బస్సు డ్రైవర్‌ తప్పించుకున్నారు. అతి కష్టం మీద వారంతా బయటకు వచ్చారు. గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా సింధూ నది నీటిలో బస్సు మునిగిపోయింది. 

 

అయితే, భారీ వర్షాల కారణంగా వాహనం అదుపుతప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సిబ్బందికి సంబంధించిన గన్స్‌, వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు మూడు గన్స్‌ను వెతికిపట్టుకున్నట్టు సమాచారం. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement