
లోక్‌సభలో బేణివాల్ సరదా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ హనుమాన్ బేణివాల్ సోమవారం రాత్రి సభలో వ్యాఖ్యలో పార్టీలకు అతీతంగా ఎంపీలంతా కాసేపు హాయిగా నవ్వుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశానికి పాకిస్తాన్ భార్యగా మారిపోయిందని, ఆ భార్యను మన ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘భీకర దాడులతో పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం. ఈ ఆపరేషన్‌కు సిందూర్ పేరుపెట్టారు.
అంటే పాకిస్తాన్ నుదుటిపైనా సిందూరం అద్దినట్లే. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు పవిత్ర సిందూరాన్ని తమ భర్తగా భావిస్తారు. పాకిస్తాన్‌పై భారత్‌పై సిందూరం పెట్టింది కాబట్టి పాకిస్తాన్ ధర్మపత్నిగా మారిపోయినట్లే. ఇక వధువును తోడ్కొనిరావడం ఒక్కటే మిగిలి ఉంది. దయచేసి మీరు(ప్రభుత్వం) వెళ్లి, పాకిస్తాన్‌ను ఇంటికి తీసుకురండి’’అని కోరారు. ప్రసంగం త్వరగా ముగించాలని స్పీకర్ సూచించగా, అర్ధరాత్రి సమయంలో మాట్లాడే అవకాశం ఇచ్చారని, తన ప్రసంగం రేపు పత్రికలో ప్రచురితం కాదని, ఇక సోషల్ మీడియాను మేనేజ్ చేసుకోవాల్సిందే అని హనుమాన్ బేణివాల్ చెప్పగా సభలో మరోసారి నవ్వుల విరిశాయి.