breaking news
ITBP
-
హిమాచల్‌లో భారీ వరదలు
షిమ్లా: ఉత్తరాఖండ్‌తోపాటు పొరుగున ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌నూ వరదలు ముంచెత్తి యాత్రికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా హిమాచల్‌లోని కినౌర్ కైలాస్ యాత్రా మార్గంలో కుండపోత వానల కారణంగా ట్రెక్కింగ్ మార్గాల్లో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వెంటనే విషయం తెల్సుకున్న ఇండో టిబెటన్ బోర్డర్‌పోలీస్(ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు హుటాహుటిన రంగంలోకి దికి 413 మంది యాత్రికులను కాపాడాయి. పర్వతసానువుల గుండా వర్షపు నీటి ప్రవాహం భీకరంగా దూసుకొస్తోంది. దీంతో ట్రెక్కింగ్ మార్గమధ్యంలోని తాత్కాలిక తాంగ్లిప్పి, కాంగరాంగ్ వంతెనలు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోవడంతో యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. ట్రెక్కింగ్ మార్గం యాత్రకు అనువుగా లేకపోవడంతో కినౌర్ కైలాస్‌యాత్రను తాత్కాలికంగా నిలుపుదలచేస్తున్నట్లు కినౌర్ జిల్లా యంత్రాంగం బుధవారం ప్రకటించింది. టెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిన చాలా చోట్ల బురదపేరుకుపోయి జారే ప్రమాదం పెరిగింది. మిల్లింగ్ ఖాటా, గుఫా ప్రాంతాల్లో కొందరు యాత్రికులు సేదతీరుతున్నారు. వాళ్లకు కనీస సదుపాయాలను ఆర్మీ కల్పిస్తోంది. సముద్ర మట్టానికి 19,850 అడుగుల ఎత్తులో ఉండే కినౌర్ కైలాస్ ప్రాంతాన్ని శివునికి శీతాకాల విడిదిగా చెబుతారు. జూలై 15న ప్రారంభమైన ఈ యాత్ర ఈనెల 30వ తేదీన ముగుస్తుంది. కినౌర్ జిల్లాతోపాటు హిమాచల్‌లోని చాలా ప్రాంతాలు బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో నాలుగు జాతీయరహదారులు సహా 617 రోడ్లను మూసేశారు. విద్యాసంస్థలకు ఒకరోజు సెలవు ప్రకటించారు. -
సింధూ నదిలో పడిపోయిన ఐటీబీపీ బస్సు.. వీడియో
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఐటీబీపీ(ఇండో-టిబెటియన్ బోర్డర్ పోలీసులు) ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వర్షాల కారణంగా అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పోలీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లాలో ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది, బస్సు డ్రైవర్ తప్పించుకున్నారు. అతి కష్టం మీద వారంతా బయటకు వచ్చారు. గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా సింధూ నది నీటిలో బస్సు మునిగిపోయింది. #WATCH | J&K: A joint search and rescue operation has been launched by SDRF Ganderbal and SDRF Sub Component Gund at Kullan in River Sindh, where a bus carrying ITBP Jawans fell down from the Kullan bridge into River Sindh, in which some weapons are missing. Three weapons have… pic.twitter.com/aDYefPHziQ— ANI (@ANI) July 30, 2025 అయితే, భారీ వర్షాల కారణంగా వాహనం అదుపుతప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సిబ్బందికి సంబంధించిన గన్స్, వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు మూడు గన్స్‌ను వెతికిపట్టుకున్నట్టు సమాచారం. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. hired by the Indo-Tibetan Border Police (ITBP) 11D/6, met with an accident during the night hours of July 29, 2025, and fell into Nallah Sindh near Zirpora Kullan Bridge in Jammu and Kashmir #BusAccident #accident #itbp #nallahsindh #kullan #JammuKashmir pic.twitter.com/b7fc6OnlrE— NextMinute News (@nextminutenews7) July 30, 2025 J&K: A joint search and rescue operation has been launched by SDRF Ganderbal and SDRF Sub Component Gund at Kullan in River Sindh, where a bus carrying ITBP Jawans fell down from the Kullan bridge into River Sindh, in which some weapons are missing. Three weapons have been… pic.twitter.com/WV5q0mjHym— DD NEWS JAMMU | डीडी न्यूज़ जम्मू (@ddnews_jammu) July 30, 2025 -
Yoga Day 2024: యోగా డేలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ప్రముఖులు
Live Updates..👉 నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.👉కశ్మీర్లో యోగా డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.👉ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైంది. దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయి. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి అని తెలిపారు. #WATCH | Prime Minister Narendra Modi leads Yoga session at Sher-i-Kashmir International Conference Centre (SKICC) in Srinagar on J&K, on International Day of Yoga. pic.twitter.com/N34howYGzy— ANI (@ANI) June 21, 2024👉బషీర్‌బాగ్‌లో యోగా వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. #WATCH | Telangana: Union Minister and state BJP chief G Kishan Reddy, and others participate in a Yoga session at Nizam College Grounds, Basheer Bagh in Hyderabad. #InternationalYogaDay pic.twitter.com/bSI3g11tQz— ANI (@ANI) June 21, 2024 #WATCH | Defence Minister Rajnath Singh, Army chief Gen Manoj Pande and others perform Yoga in Mathura, Uttar Pradesh on the occasion of International Day of Yoga. pic.twitter.com/ke7DgB80ld— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Pangong Tso in Leh, on the 10th International Yoga Day.(Video source - ITBP) pic.twitter.com/6LCV406hla— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Karzok in Leh, on the 10th International Yoga Day. pic.twitter.com/ZaLsW9Fldd— ANI (@ANI) June 21, 2024 #WATCH | ITBP personnel perform Yoga at Muguthang Sub Sector in North Sikkim at an altitude of more than 15,000 feet, on the 10th International Yoga Day.#InternationalYogaDay2024(Source: ITBP) pic.twitter.com/oBY9Xuznb8— ANI (@ANI) June 21, 2024 👉ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై యోగా డే సెలబ్రేషన్స్.. #WATCH | Yoga onboard aircraft carrier INS Vikramaditya #InternationalYogaDay pic.twitter.com/ROBw82yvph— ANI (@ANI) June 21, 2024 👉యోగా డే పాల్గొన్న జైశంకర్..#WATCH | EAM Dr S Jaishankar and other diplomats perform Yoga in Delhi, on the International Day of Yoga. pic.twitter.com/MSbucUs40x— ANI (@ANI) June 21, 2024 👉 యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. #WATCH | Gujarat CM Bhupendra Patel performs Yoga, along with others, in Nadabet, Banaskantha on International Day of Yoga. pic.twitter.com/Ick5HCm6By— ANI (@ANI) June 21, 2024 -
సరిహద్దుల కాపలాలో సైన్యం సత్తా
భారత్‌పై మోపిన యుద్ధాలు, ఘర్షణలు... అవి భౌగోళిక, రాజకీయ పరిణామాలను మార్చిన వైనం గురించి పరామర్శించుకోవడానికి భారత 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం చక్కటి సందర్భం. ఈ ఘర్షణలన్నింటిలో ప్రత్యేకంగా నిలిచేది ఏమిటంటే, భారత సాయుధ బలగాలు నిర్వహించిన అసాధారణ పాత్ర. భారత సరిహద్దులను కాపాడటంలో, పొరుగుదేశాల సవాళ్లకు ఎదురు నిలవడంలో మన సాయుధ బలగాలకు ఎక్కువ ఘనత లభించాల్సి ఉంది. ఒక వాస్తవం తరచుగా విస్మరణకు గురవుతోంది. స్వాతంత్య్రం తర్వాత భారత బలగాలు ఒక్క భూభాగాన్ని కూడా కోల్పోలేదు. చొరబాట్ల నిరోధానికి సైనిక బలగాలను పంపడానికి ముందు శత్రుబలగాలు ఆక్రమించిన భూభాగాలు మాత్రమే మనం కోల్పోయింది! ► నాటి జమ్మూ కశ్మీర్ మహారాజు పాకిస్తాన్లో కశ్మీర్ విలీనం కావడాన్ని ఇష్టపడకపోవడం చూసిన తర్వాత, పాకిస్తాన్ రాజకీయ కులీన వర్గం 1947 అక్టోబర్‌లో కశ్మీర్ దురాక్రమణను ప్రారంభించిందనే ప్రబలమైన ఆవగాహన ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది. దీనికి భిన్నంగా ఒక కొత్త కథనం ఇప్పుడు ఉనికిలోకి వచ్చింది. ఇక్బాల్ మల్హోత్రా రాసిన ‘డార్క్ సీక్రెట్స్: పాలిటిక్స్, ఇంట్రిగ్యూ అండ్ ప్రాక్సీ వార్స్ ఇన్ కశ్మీర్’ (2022) పుస్తకం చక్కటి పరిశోధనాత్మక వివరాలను వెల్లడిస్తోంది. కశ్మీర్‌పై రెండు భాగాల్లో దాడులు ప్రారంభించాలంటూ పాకిస్తాన్ సైన్యాన్ని బ్రిటిష్ పాలనా వ్యవస్థ ప్రోత్సహించిందంటూ ఈ పుస్తకం సంచలన వివరాలు బయటపెడుతోంది. ఆ రెండు భాగాలు ఏమి టంటే, కశ్మీర్ లోయను స్వాధీనపర్చుకోవడానికి ఆపరేషన్ గుల్మార్గ్ మొదలుపెట్టడం; గిల్గిత్–బాల్టిస్తాన్ స్వాధీనం కోసం ఆపరేషన్ దత్తా ఖేల్‌ను ప్రారంభించడం. ► దీంతో 1947 అక్టోబర్ నుంచి 1948 వేసవి కాలం వరకు కశ్మీర్‌ను కాపాడుకుందాం అనే దీర్ఘకాలిక పథక రచనలో భారత వాయుసేన, భారతీయ సైన్యం మునిగిపోయాయి. మన బలగాలు అపారమైన సంకల్పంతో ఈ పథకాన్ని పూర్తి చేశాయి. కానీ బ్రిటిష్ నాయకత్వం అంతటితో వదలిపెట్టలేదు. గిల్గిట్‌పై పాకిస్తాన్ పతాకం ఎగిరేలా వారు పావులు కదిపారు. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించడానికి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూను లార్డ్ మౌంట్ బాటన్ ఒప్పించారు. కశ్మీర్ సమస్యకు ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ)ను ఉత్తమ పరిష్కా రంగా నెహ్రూ ఆమోదించేలా చేశారు. ఇది కాల్పుల విరమణకు దారితీసింది. ఈ ‘కాల్పుల విరమణ రేఖ’ జమ్మూ కశ్మీర్లో భారత్– పాక్ వాస్తవిక సరిహద్దుగా మారింది. ► అయితే, చైనాతో అపరిష్కృతంగా ఉన్న హిమాలయాల సరిహ ద్దులు స్వాతంత్య్రం తర్వాత భారత్ ముందుకు రెండో కీలకమైన ఘర్షణను తెచ్చిపెట్టాయి. 1962లో చైనా, భారత్ మధ్య ఘర్షణ అనేక కారణాల ఫలితం అని చెప్పాలి. టిబెట్ పోరాటానికి సహాయం అందించే లక్ష్యంతో భారత్‌లో అమెరికా అడుగుజాడలు పెరగడం కూడా ఒక కారణం. 1954లో భారత్ ప్రచురించిన మ్యాపులు అక్సాయ్ చిన్ను లద్దాఖ్‌లో భాగంగా చూపాయి. అంటే అది భార త్లో భాగమేనని చెప్పాయి. ► అలాగే మ్యాప్ ఉన్నా లేకపోయినా మెక్ మెహన్ రేఖ మాత్రమే చైనాతో భారత ఈశాన్య సరిహద్దుగా ఉంటుం దని నెహ్రూ దృఢ వైఖరిని ప్రకటిస్తూ వచ్చారు. ఇది చైనా నాయ కత్వాన్ని రగిలించింది. అందుకే నెహ్రూకు గుణపాఠం చెప్పాలని మావో నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చైనాకు రష్యా ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, చైనాను పోత్సహిం చిన విషయం మరుగున పడిపోయింది. 1950లలో కొరియన్ యుద్ధంలో తొలిసారి చైనాకు రష్యా మద్దతుగా నిలిచింది. తర్వాత అమెరికా శిబిరంలో భారత్ ఉన్నట్లు కనిపించింది కాబట్టి, భారత్‌పై చైనా దాడిని కూడా రష్యా బలపర్చింది. 1962 అక్టోబర్ 20 నుంచి నవంబర్ 19 వరకు క్యూబా క్షిపణి సంక్షోభంలో ప్రపంచం కూరుకు పోయిన రోజు ల్లోనే సోవియట్ నాయకుడు నికితా కృశ్చేవ్ భారత్‌పై దాడి చేయవచ్చని పంపిన సిగ్నల్‌ను నాటి చైనా నాయకత్వం అందుకుంది. ► చైనా దాడి రెండు భ్రమలను పటాపంచలు చేసింది. ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా నెహ్రూ పాత్ర, ఆసియాలో భారత్ వైఖరికి సంబం ధించిన భ్రమలు చెల్లాచెదురైపోయాయి. అదే సమయంలో న్యూఢిల్లీలో భారతీయ సైనిక కమాండర్లు విషాదకరంగా పౌర నాయకత్వ ఆజ్ఞలకు లోబడిపోయారు. ప్రత్యేకించి నెహ్రూ, కృష్ణ మీనన్, బీఎన్ మలిక్ చైనా దాడి సంకేతాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అందువల్లే 1962 అక్టోబర్‌లో చైనా వాస్తవంగా దాడి ప్రారంభించినప్పుడు సరైన శిక్షణ, తగిన ఆయుధ సంపత్తి లేని భారతీయ దళాలు అత్యంత ఎత్తయిన హిమాలయాల్లో చైనా దురాక్ర మణతో పోరాడాల్సి వచ్చింది. ఇరు సైన్యాల మధ్య భారీ అసమా నతలు ఉన్నప్పటికీ, లదాఖ్, ‘నెఫా’ (ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్)... రెండు ప్రాంతాల్లోనూ భారతీయ దళాలు గణనీయ పోరాట పటిమను ప్రదర్శించాయి. ► మన బలగాల పోరాట చేవను ఈ వ్యాస రచయిత రాసిన ‘కంటెస్టెడ్ ల్యాండ్స్: ఇండియా, చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్’ (2021) పుస్తకం పొందుపర్చింది. 1962 సైనిక ఘర్షణను జాతీయ ఓటమిగా పిలుస్తున్నారు కానీ, వాస్తవానికి భారతీయ సైన్యంలో, వాయుసేనలో చాలా భాగాన్ని ఈ యుద్ధంలో ఉపయో గించలేదని గమనించాలి. ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే చైనాను మరింత రెచ్చగొట్టినట్లవుతుందనే భయం దీనికి కారణం కావచ్చు. భారత్ బలగాలను అధిక సంఖ్యలో ఉపయోగించి ఉంటే కథ మరొకలా ఉండేది. ► 1962లో భారత్ పరాజయం, అమెరికా కేంద్ర యుద్ధ పథకం కారణంగా పాకిస్తాన్లో కొత్త ఆశలు చిగురించాయి. అప్పటికే అమె రికా ఆయుధాలు పాకిస్తాన్ పొంది ఉంది. చైనా దాడితో భారత్ సైన్యపు నైతిక బలం క్షీణించిందనీ, 1947 మాదిరిగా రెండు భాగాల్లో తలపెట్టినట్లుగా కాకుండా, సుశిక్షితమైన అర్ధ గెరిల్లా దాడిని మొదలె డితే ఈసారి కశ్మీర్‌ను తాను ఆక్రమించవచ్చనీ పాక్ భావించిందంటే ఆశ్చర్యం లేదు. భారత వాయుసేన, భారత సైన్య సంయుక్త ప్రతి స్పందనతో పాక్ కుట్రలు మరోసారి భగ్నమయ్యాయి. మన బలగాల ప్రతి దాడి సమర్థత ఏ స్థాయిలో సాగిందంటే, దురాక్రమణ సైన్యాన్ని తరుముకుంటూ పోయిన భారత్ బలగాలు లాహోర్, సియాల్ కోట్ గేట్ల వద్దకు పోయి నిలిచాయి. దీంతో లాహోర్‌ను కాపాడుకునేందుకు పాక్ జనరల్ అయూబ్ ఖాన్ తన బలగాలతో లొంగిపోయారు. ► మరోవైపున కాల్పుల విరమణ పిలుపు కోసం వేచి చూస్తూ భారత బలగాలు ఈ రెండు నగరాల ప్రవేశ ద్వారాల వద్ద తిష్ట వేశాయి. అయితే 1965 నాటి ఆ యుద్ధంలో తమదే విజయం అని పాక్ ప్రక టించుకుందనుకోండి. ఎందుకంటే విజయం మనదే అని ప్రకటించు కోవడానికి భారత రాజకీయ నాయకత్వం కాస్త సిగ్గుపడింది మరి! అయితే 1971 నాటి ఇండో–పాక్ యుద్ధం పూర్తిగా విభిన్నమైంది. మొదటిసారి భారత త్రివిధ బలగాలు పాల్గొన్నాయి. పైగా అది కశ్మీర్ కోసం జరిగిన యుద్ధం కాదు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. అయితే ఈ యుద్ధానంతరం కుదిరిన ఒప్పందం జమ్మూ కశ్మీర్ భవిష్యత్తుకు సంబంధించినదే. ► సిమ్లా ఒడంబడికలో ముఖ్యమైన ఫలితం ఏమిటంటే, కాల్పుల విరమణ రేఖను నియంత్రణా రేఖ (ఎల్ఓసీ)గా మార్చుకోవడమే. అంటే ఇది రెండు దేశాల మధ్య రాజకీయ, సైనిక సరిహద్దుగా ఉంటుందన్నమాట. కార్గిల్‌లో మరోసారి భంగపాటుకు గురై నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అమెరికాకు పరుగెత్తినప్పుడు, అమెరికా సైతం ‘ఎల్ఓసీ’నే గౌరవించమని పాకిస్తాన్‌ను కోరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1999లో జనరల్ ముషారఫ్ దురాక్రమణ బలగాలు ఎల్ఓసీని దాటి భారత్‌లోకి చొచ్చుకొచ్చిన ప్రధాన ఉద్దేశం, దాని మాన్యతను సవాలు చేయడమే. ► అయితే భారత్ బలమైన సైనిక ప్రతిస్పందన కారణంగా నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ సైతం అదే ఎల్ఓసీని గుర్తించడం వల్ల పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు కలిగింది. భారత సరిహద్దులను కాపాడటంలోని సవాళ్లకు ఎదురు నిలవడంలో మన సాయుధ బలగాలకే ఎక్కువ ఘనత లభించాల్సి ఉంది. అయితే ఒక వాస్తవం తరచుగా విస్మరణకు గురవుతోంది. స్వాతంత్య్రం తర్వాత భారత బలగాలు ఒక్క భూభా గాన్ని కూడా కోల్పోలేదు. మనం కోల్పోయినదల్లా... 1947, 1962 సంవత్సరాల్లో చొరబాట్ల నిరోధానికి భారత బలగాలను పంపడానికి ముందు శత్రుబలగాలు ఆక్రమించిన మన భూభాగాలను మాత్రమే. మరూఫ్ రజా, వ్యాసకర్త మాజీ సైనికాధికారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
తోటి సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు.. ఆపై ఆత్మహత్య
శ్రీనగర్: ఇంటో టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన కానిస్టేబుల్ తన తోటి సైనికులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. జమ్ముకశ్మీర్‌లోని ఉధమ్‌పుర్‌లో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన వెలుగుచూసింది. ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపిన అనంతరం తానూ కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కానిస్టేబుల్. ఉధంపుర్లోని దేవికా ఘాట్ కమ్యూనిటీ సెంటర్లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ 8వ బెటాలియన్ భూపేంద్ర సింగ్‌గా గుర్తించారు. 'జమ్ముకశ్మీర్‌లోని ఉధమ్ఫుర్లో ముగ్గురు జవాన్లపై ఐటీబీపీ 8వ బెటాలియన్ కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఆ తర్వాత తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తూటాలు తగిలిన ముగ్గురు జవాన్లను ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.' అని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది ఐటీబీపీ. కాల్పులు జరిపేందుకు గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. మృతి చెందిన కానిస్టేబుల్ ఐటీబీపీలోని ఎఫ్ కంపెనీకి చెందినట్లు తెలిపింది. ఇదీ చూడండి: విషాదం.. మజాక్‌ల చేసిన పనితో దోస్త్ ప్రాణం పోయింది -
Viral Video: వైరల్‌గా మిస్ యూనివర్స్ 2021 డాన్స్ వీడియో..
లక్నో: మిస్ యూనివర్స్ 2021 విజేతగా నిలిచిన ఇండియన్ మోడల్ హర్నాజ్ కౌర్ సంధు డ్యాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఇండో టిబేటియన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) మహిళా సాధికారత, హెచ్డబ్ల్యూడబ్ల్యూఏ రైజింగ్ డేని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్నాజ్ సంధు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీబీపీ జవాన్ల కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశారు. మహిళలందరితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. పంజాబీ సాంగ్స్‌కి హర్నాజ్ తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. మొత్తం కారక్రమానికే ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదే విధంగా అక్కడున్న వారందరితోనూ సరదాగా ఫోటోలు దిగారు. ఈ వీడియోను ఐటీబీపీ తన ట్విటర్లో పోస్టు చేసింది. ‘మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు.. హిమవీర్ కుటుంబాలు, పిల్లలతో కలిసి గ్రూప్ పెర్ఫార్మెన్స్ చేశారు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చదవండి: అందరిలో ఒకటే ఉత్కంఠ..ఆమె గోల్ వేయాలని ఐతే.. Miss Universe 2021 Harnaaz Kaur Sandhu joining #Himveer families and children in a group performance during a special programme organized on Women Empowerment & HWWA Raising Day at 39th Battalion ITBP Greater Noida today. Sh Ritu Arora, Chairperson, HWWA was the Chief Guest. pic.twitter.com/k4MSGAhNFI — ITBP (@ITBP_official) March 24, 2022 కాగా మిస్ యూనివర్స్ 2021 కీరిటాన్ని భారతీయ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం గెలుపొందిన భారతీయురాలిగా సంధు రికార్డు సృషకటించారు. చివరిసారిగా లారా దత్తా 2000లో మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుపొందింది. ఇజ్రాయిల్‌లోని ఇలాట్ నగరం జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో పరాగ్వే, దక్షిణాఫ్రికా సుందరీమణుల నుంచి హర్నాజ్ తీవ్ర పోటీ ఎదుర్కొని.. చివరకు అందాల కిరీటాన్ని హర్నాజ్ సొంతం చేసుకున్నారు. చదవండి: జీవితంలో రోజుకు ఒకసారైనా ఇలా చేయండి!! -
లడఖ్ మంచుకొండల్లో ట్రెక్కింగ్.. ఫోటోలు వైరల్
లడఖ్: లడఖ్‌లో ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీల ట్రెక్కింగ్‌ను ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు దళాలు నిర్వహించారు. ఈ ట్రెక్కింగ్‌లో 100 మంది బార్డర్ పోలీసులు పాల్గొన్నట్లు తెలిపారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధా కృష్ణ మథూర్ శనివారం ప్రారంభించారు. ఈ పోటీలు జరగటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను నిర్వహించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధా కృష్ణ అభినందించారు. Ladakh: Watch the glimpses of the Ice wall climbing competition in Ladakh organised for the 1st time in the Country by North West Frontier ITBP, Leh. More than 100 climbers are taking part.#Himveers@nwftr_itbp pic.twitter.com/KeOCtkBrfD — ITBP (@ITBP_official) February 27, 2022 ఆయన మాట్లాడుతూ.. ఐటీబీపీ 1962లో ఏర్పాటు చేయబడిందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐటీబీటీ దేశానికి రక్షణగా నిలుస్తోందని అన్నారు. బార్డర్ పోలీసుల ట్రెక్కింగ్‌కు సంబంధించిన వీడియో, ఫోటోలను ఐటీబీపీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Some glimpses of Ice Wall Climbing Competition in Ladakh organised for the 1st time in the Country by HQrs NW Frontier ITBP, Leh.#Himveers#IceWallClimbing pic.twitter.com/Mp2qLHTtFc — ITBP (@ITBP_official) February 27, 2022 -
వెలకట్టలేని సెల్యూట్.. కోట్లు పెట్టినా దొరకని సంతోషం
లక్నో: పుత్రడు పుట్టినప్పటి కంటే.. అతడు వృద్ధిలోకి వచ్చి.. పదిమంది చేత ప్రశంసలు పొందిన నాడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం లభిస్తుంది. అయితే కాలంతో పాటు సమాజం తీరు కూడా మారుతోంది. కొడుకైనా, కూతురైనా ఒకటే.. అనుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లపై వివక్ష చూపకుండా.. ఆమె ఆశయాలకు, ఆలోచనలకు గౌరవం ఇస్తూ.. వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తోడ్పడుతున్నారు. ఇక వారి అభివృద్ధి చూసి మురిసిపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఐటీబీపీ ఉన్నతాధికారి కుమార్తె ఒకరు అదే రంగంలో ప్రవేశించింది. ఐటీబీపీ ఉద్యోగంలో చేరింది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత జరిగే పాసింగ్ ఔట్ పరేడ్కి ముఖ్య అతిథిగా హాజరైన తండ్రికి సెల్యూట్ చేసింది. ఆ క్షణం ఆ తండ్రి పొందిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఎన్ని కోట్లు పెట్టినా అలాంటి అపురూప క్షణాలను తీసుకురాలేం. తండ్రి, కుమార్తెలిద్దరూ ఒకరికొకరు సెల్యూట్ చేసుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తండ్రి, కుమార్తెలకు అభినందనలు తెలుపుతున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. (చదవండి: బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి!) ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆపేక్షా నింబాడియా ఇండో టిబిటెన్ పోలీస్ యూనిఫామ్ ధరించి.. తన పైఅధికారి ఐటీబీపీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఏపీఎస్ నింబాడియాకి సెల్యూట్ చేయగా.. ఆయన తిరిగి సెల్యూట్ చేశారు. ఇలా ఒకరినొకరు సెల్యూట్ చేసుకున్నది తండ్రి, కుమార్తె కావడం గమనార్హం. ఇలా వారిద్దరూ పరేడ్‌లో సెల్యూట్ చేసుకునే సమయంలో.. ఫోటో క్లిక్ మనిపించారు. (చదవండి: డ్రాగన్ దుశ్చర్య.. 55 గుర్రాలపై భారతీయ భూభాగంలోకి.. ) ఈ ఫొటోని ఐటీబీపీ విభాగం తన సోషల్ మీడియా షేర్ చేసింది. దీనికి ‘‘కుమార్తె సెల్యూట్ చేయడంతో.. తండ్రి గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు’’ అని క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఇప్పటివరకు 22వేల మందికిపైగా లైక్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ‘‘తనయోత్సాహం.. ఆ తండ్రి పొందే మధురానుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు.. అపురూప క్షణాలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆపేక్షా నింబాడియా సివిల్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరి కుటుంబం నుంచి మూడోతరం వారు కూడా పోలీస్ విభాగంలో సేవ చేయడం విశేషం. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! View this post on Instagram A post shared by ITBP (@itbp_official) -
డ్రాగన్ దుశ్చర్య.. 55 గుర్రాలపై భారతీయ భూభాగంలోకి..
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో తరచూ వివాదాలు సృష్టిస్తున్న చైనా మరోమారు తన దుర్భుద్ధిని చూపింది. గతనెల దాదాపు వందమందికి పైగా చైనా సైనికులు ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ)ని అతిక్రమించారని ఎకనమిక్‌టైమ్స్ కథనం పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని బారాహటి సెక్టార్‌లోని ఎల్ఏసీ వద్ద ఆగస్టు 30న సరిహద్దు దాటివచ్చిన చైనా సైనికులు మూడుగంటలకు పైగా గడిపి వెనక్కు వెళ్లారని తెలిపింది. 55 గుర్రాలపై వచ్చిన వీళ్లు అక్కడ ఇండియా ఏర్పరుచుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారని, అక్కడున్న ఒక బ్రిడ్జిని ధ్వంసం చేశారని కథనంలో వెల్లడించింది. చదవండి: (చైనాను బూచిగా చూపుతున్నాయి!) టున్జున్లా కనుమ మార్గం గుండా వచ్చిన చైనా సైనికులు భారతీయ భూభాగంలోకి సుమారు 5 కిలోమీటర్ల వరకు చొచ్చుకువచ్చినట్లు తెలిపింది. ఇదే సమయంలో స్థానికులు నుంచి సమాచారం అందుకొని అక్కడకు ఐటీబీపీ బలగాలు వెంటనే వచ్చాయి. వారు రాకముందే చైనా సైనికులు వెనక్కుపోయారు. చైనా దుశ్చర్యకు ప్రతిస్పందనగా భారతీయ బలగాలు ఇక్కడ పెట్రోలింగ్ ఆరంభించాయని సదరు కథనం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలూ బలగాల ఉపసంహరణకు అంగీకరించినా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. వాస్తవాధీన రేఖపై ఇరుదేశాల అవగాహనలో తేడాల వల్లనే తరచూ చైనా బలగాలు సరిహద్దులు దాటుతున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. చదవండి: (భారతీయులపై ఆంక్షలు.. సమర్థించుకున్న చైనా) -
బీఎస్ఎఫ్ డీజీగా పంకజ్ కుమార్
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బీఎస్ఎఫ్ డీజీ విధులతో పాటు ఐటీబీపీ డీజీగా పని చేస్తున్న ఎస్ఎస్ దేశ్వాల్ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం పంకజ్ కుమార్ బాధ్యతలు చేపడతారని కేంద్రం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల వెంట 6,300 కిలోమీటర్లకు పైగా సరిహద్దులను బీఎస్ఎఫ్ జవాన్లే చూసుకుంటున్నారు. బీఎస్ఎఫ్లో సుమారు 2.65 లక్షల మంది సైనికులు ఉన్నారు. పంకజ్ కుమార్ తండ్రి ప్రకాశ్ సింగ్ కూడా ఐపీఎస్ ఆఫీసరే కావడం గమనార్హం. ఆయన కూడా గతంలో బీఎస్ఎఫ్ డీజీగా పని చేశారు. పంకజ్‌తో పాటు తమిళనాడు కేడర్‌కు చెందిన 1988 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ సంజయ్ ఆరోరాను ఐటీబీపీ డీజీగానూ, ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన బాలాజీ శ్రీవాస్తవ్‌ను బ్యూరో ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ)గా నియమించింది. -
అఫ్గానిస్తాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు జవాన్
వైఎస్సార్ కడప: అఫ్గానిస్తాన్ నుంచి కమాండో హజీవలి గురువారం ఢిల్లీకి చేరాడు. ఈ విషయాన్ని కొండాపురంలో ఉన్న ఆయన బంధువులు తెలియజేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం కొండాపురానికి చెందిన హజీవలి 13 ఏళ్ల కిందట ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటీబీపీ)లో కమాండోగా పనిచేస్తున్నారు.రెండేళ్ల కిందట కాందహార్‌లో భారత రాయబార కార్యాలయంలోని భద్రతా విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అఫ్గాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంతో అక్కడ ఉన్న సైనికులను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు.వీరిలో వైఎస్సార్ జిల్లా కొండాపురానికి చెందిన హజీవలి కూడా ఉన్నారు. అఫ్గాన్‌లోని రాయబార కార్యాలయం నుంచి విమానాశ్రయానికి వెళ్లడానికి రాత్రి సమయంలో గంటపాటు ప్రయాణించినట్లు తాలిబన్ల కంటపడకుండా ఐటీబిపీ సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు హజీవలి తెలిపారని బంధువులు వివరించారు. చదవండి:Jasprit Bumrah Wife Sanjana Ganesan: అదిరిపోయే ఫోటోను షేర్ చేసిన బుమ్రా -
ఆఫ్గన్ మిషన్‌లో సిక్కోలు సైనికుడు
మందస: తాలిబన్ల స్వాధీనంతో అట్టుడికిపోతున్న ఆఫ్గనిస్తాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో భారత–టిబెటన్ సరిహద్దు భద్రతా దళం కమాండోలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ దళంలో శ్రీకాకుళం జిల్లా వాసి కూడా ఉన్నారు. మందస మండలం చిన్నలింబుగాం గ్రామానికి చెందిన పులారి రాజశేఖర్ ఆఫ్గన్‌లో భారత రాయబార కార్యాలయంలో ఉన్నవారిని స్వదేశానికి తీసుకొచ్చే మిషన్‌లో చురుగ్గా వ్యవహరించారు. ప్రత్యేక విమానంలో వీరిని దేశానికి తీసుకురాగా.. రాజశేఖర్ వారి రక్షణ విధులు నిర్వర్తించారు. -
సిమ్లా హైవే పై విరిగిపడ్డ కొండచరియలు
-
విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు
సిమ్లా: ప్రకృతి ప్రకోపిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంతో ఈ వ్యాఖ్యలు నిజం అని మరోసారి రుజువు అయ్యింది. కిన్నౌర్ జిల్లోని రెఖాంగ్ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్యాహ్నం 12:45 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఒక లారీ, ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో పదిమంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడడంతో వాహనాలన్నీ బండరాళ్ల కింద చిక్కుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సులో ఏకంగా 40 మంది ప్రయాణికులు చిక్కుకోగా.. ఇప్పటికి కొందరిని రక్షించగా. మరో 20 మందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ) సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా కిన్నౌర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘నిగుల్సారి ప్రాంతం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ ఆర్టీసి బస్సు అక్కడ చిక్కుకుపోయింది. ఇప్పటికే బస్సు డ్రైవర్ని, కొందరిని రక్షించాం. సహాయక చర్యలు కొనసాగతున్నాయి’’ అని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌కు కాల్ చేసి.. పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఐటీబీపీ డీజీతో కూడా మాట్లాడారు. అలానే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా జైరామ్ ఠాకూర్‌తో మాట్లాడారు. -
భారత్‌కు ఈయూ చేయూత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉధృతితో అల్లాడిపోతున్న భారత్‌కు విదేశాలు బాసటగా నిలుస్తున్నాయి. అత్యవసర ప్రాణాధార ఔషధాలను, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలను పంపిస్తున్నాయి. ఇటలీ సోమవారం ఒక నిపుణుల బృందాన్ని, వైద్య పరికరాలను భారత్‌కు పంపింది. ఇక యునైటెడ్ కింగ్డమ్(యూకే) నాలుగో దశ సాయం అందించింది. ఇందులో 60 వెంటిలేటర్లు, ఇతర పరికరాలు ఉన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను కూడా అందించింది. ఈ ప్లాంట్ ద్వారా ఒక ఆసుపత్రికి అవసరమైన ప్రాణ వాయువును ఉత్పత్తి చేయొచ్చు. దీన్ని గ్రేటర్ నోయిడాలోని ఐటీబీపీ ఆసుపత్రిలో నెలకొల్పనున్నారు. ఇటలీ నుంచి వచ్చిన బృందానికి ఇండియాలోని ఆ దేశ రాయబారి విన్సెంజో డి లూకా స్వాగతం పలికారు. ఇక యూరోపియన్ యూనియన్(ఈయూ) అదనంగా అత్యవసర వైద్య సాయాన్ని భారత్‌కు అందిస్తామని ప్రకటించింది. తన సభ్యదేశాలైన డెన్మార్క్, స్పెయిన్, నెదర్లాండ్స్ నుంచి సాయాన్ని భారత్‌కు అందిస్తామంది. కరోనాపై పోరాటంలో భారత్ వెంట నిలుస్తామని డి లూకా చెప్పారు. ఈ వైరస్ ప్రపంచానికే ఒక సవాలు అని అన్నారు. అందరం కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. భారత్‌కు అండగా నిలుస్తున్న యూకేకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. డెన్మార్క్ నుంచి 53 వెంటిలేటర్లు, స్పెయిన్ నుంచి 119 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 145 వెంటిలేటర్లు పంపుతున్నట్లు ఈయూ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక నెదర్లాండ్స్ నుంచి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 30 వేల డెమ్‌డెసివిర్ వయల్స్, 449 వెంటిలేటర్లు పంపిస్తామని పేర్కొంది. జర్మనీ కూడా 15 వేల యాంటీ వైరల్ డ్రగ్స్ వయల్స్ పంపింది. అలాగే 516 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసింది. -
విలయం మిగిల్చిన విషాదం
డెహ్రాడూన్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ జల విలయానికి సంబంధించి ఇప్పటివరకు 26 మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో 171 మంది ఆచూకీ కోసం సహాయ దళాలు కృషి చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన 30 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మరోవైపు, ఈ విలయానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చమోలీ జిల్లా, జోషిమఠ్ దగ్గర్లోని నందాదేవి హిమనీనదం వద్ద అనూహ్యంగా భారీ ఎత్తున మంచు చరియలు విరిగిపడడంతో గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులకు వరద పోటెత్తిందని, దాంతో ఈ జల ప్రళయం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నదీమార్గంలోని పర్వతం పై నుంచి లక్షలాది మెట్రిక్ టన్నుల మంచు ఒక్కసారిగా, వేగంగా కిందకు విరుచుకుపడడంతో ఈ జల ప్రళయం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సోమవారం తెలిపారు. అంతకుముందు, ఆయన ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తలు తనకు చూపించిన చిత్రాల్లో.. వరద ఉధృతి ప్రారంభమైన చోట హిమనీనదం ఏదీ కనిపించలేదని, మంచు అంతా కిందకు జారిపడిపోయిన ఒక పర్వతం మాత్రం ఉందని తెలిపారు. ఆ పర్వత శిఖరంపై నుంచే పెద్ద ఎత్తున మంచు కిందకు జారిపడి ఉంటుందని, దాంతో ధౌలి గంగ, రిషి గంగ నదులకు మెరుపు వరదలు వచ్చాయని భావిస్తున్నామని వివరించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష, పరోక్ష కారణాలను గుర్తించిన తరువాత, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తామని వివరించారు. అభివృద్ధి నిరోధక కధనాలకు అవకాశంగా ఈ దుర్ఘటనను తీసుకోవద్దని సూచించారు. వరద ప్రభావ ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేలా రాష్ట్రంలో మౌలిక వసతులను బలోపేతం చేస్తామని సోమవారం తనను కలిసిన ఉత్తరాఖండ్ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. చదవండి: (తెలిసే వచ్చిన జలవిలయం ఇది) ముమ్మరంగా సహాయ చర్యలు వరదల్లో చిక్కుకుపోయి, ఇంకా ఆచూకీ లభించని సుమారు 170 మందిలో జల విద్యుత్కేంద్రంలో పనిచేస్తున్నవారు, నదీ తీరం వెంట ఇళ్లు కొట్టుకుపోవడంతో గల్లంతైన వారు ఉన్నారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. 480 మెగావాట్ సామర్ధ్యమున్న, ఎన్టీపీసీకి చెందిన తపోవన్–విష్ణుగఢ్ విద్యుత్ కేంద్రం, 13.2 మెగావాట్ల సామర్ధ్యమున్న రిషి గంగ జల విద్యుత్ కేంద్రం తాజా వరదలతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. కచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ.. పదుల సంఖ్యలో కార్మికులు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల్లో చిక్కుకుపోయారు. దాదాపు 13 గ్రామాలకు చుట్టుపక్కల ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టాయి. ఆర్మీ మెడికల్ కార్ప్స్, వైమానిక దళ బృందాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. చదవండి: (స్వయంకృతం) తపోవన్– విష్ణుగఢ్ విద్యుత్ కేంద్రం టన్నెల్లో చిక్కుకుపోయిన సుమారు 35 మందిని రక్షించేందుకు సహాయ బృందాలు కృషి చేస్తున్నాయి. పెద్ద ఎత్తున బుల్డోజర్లు, జేసీబీలు ఇతర యంత్ర సామగ్రిని అక్కడికి తరలించారు. 250 మీటర్ల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉన్న ఈ సొరంగ మార్గం కొద్దిగా వంపు తిరిగి ఉన్న కారణంగా సహాయ చర్యలకు సమయం పడుతోందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. సొరంగంలోపల పెద్ద ఎత్తున బురద పేరుకుపోయిందని, ఇప్పటివరకు సుమారు 100 మీటర్ల మేర బురదను తొలగించగలిగామని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌కుమార్ పాండే వెల్లడించారు. సుమారు 300 మంది ఐటీబీపీ సిబ్బంది ఈ విధుల్లోనే ఉన్నారన్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన అందరినీ రక్షించగలమనే ఆశిస్తున్నామన్నారు. అధికారులు అందజేసిన వివరాల ప్రకారం.. ఈ వరదల్లో విద్యుత్ కేంద్రాల సిబ్బందిలో 202 మంది గల్లంతయ్యారని, వారు ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల వారని పాండే వివరించారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల సూపర్వైజర్లు కూడా గల్లంతు కావడంతో ఉద్యోగులు/కార్మికులకు సంబంధించిన పూర్తి సమాచారం లభించడం లేదన్నారు. మరో చిన్న సొరంగంలో.. తపోవన్– విష్ణుగఢ్ కేంద్రానికి సంబంధించిన మరో చిన్న సొరంగంలో చిక్కుకుపోయిన 12 మందిని, రిషిగంగ కేంద్రం వద్ద వరదల్లో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించగలిగామని తెలిపారు. ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లకు చెందిన స్నిఫర్ డాగ్స్‌ను కూడా సహాయ చర్యల్లో పాలు పంచుకునేందుకు రంగంలోకి దింపారు. ఈ సొరంగానికి ఒకవైపే మార్గం ఉందని విద్యుత్ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. సోమవారం మరిన్ని బలగాలను జోషిమఠ్‌కు పంపించామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. వరద ఉధృతికి మేటవేసిన బురదతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. పలు నిర్మాణాలు కొట్టుకుపోయి, బురదలో కూరుకుపోయాయి. కచ్చితమైన కారణమేంటి? ఈ దుర్ఘటనకు కచ్చితమైన కారణాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇందుకోసం పలు బృందాలు ఇప్పటికే చమోలీ చేరుకున్నాయి. డీఆర్డీవోలోని ‘ద స్నో అండ్ అవలాంచీ స్టడీ ఎస్టాబ్లిష్మెంట్’సభ్యులు రంగంలోకి దిగారు. వాతావరణ మార్పు, లేదా ఆకస్మిక శీతాకాల వర్షాలు ఈ విలయానికి కారణం కావచ్చని నిపుణులంటున్నారు. హిమనీనద సరస్సు ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల కానీ, మంచు చరియలు విరిగి నదీ మార్గాన్ని అడ్డుకుని, ఆ తరువాత ఒక్కసారిగా ఆ మార్గం తెరుచుకోవడంతో కింది ప్రాంతాలకు విరుచుకుపడిన వరద వల్ల కానీ ఈ జల ప్రళయం చోటు చేసుకుని ఉండవచ్చని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. -
ఉత్తరాఖండ్‌లో జల విలయం
డెహ్రాడూన్: హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. గంగా పరివాహక ప్రాంతాలు వరద ముప్పులో బిక్కుబిక్కుమంటున్నాయి. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. ఒక్కసారిగా రాళ్లు, మంచు ముక్కలతో కూడిన నీటి ప్రవాహం కిందకి విరుచుకుపడడంతో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో తపోవన్–రేణిలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. తపోవన్–విష్ణుగఢ్ ప్రాజెక్టు కూడా దెబ్బతిందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. తపోవన్ వద్ద పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్ద 22 మంది మొత్తం 170 మంది కనిపించకుండా పోయినట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే చెప్పారు. కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగి సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. నీళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు సొరంగ మార్గంలోకి ప్రాణాలకు తెగించి వెళ్లిన ఐటీబీపీ సిబ్బంది 16 మందిని కాపాడారు. మరో ఏడు మృతదేహాలను వెలికితీసినట్టుగా ఐటీబీపీ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోనికి వస్తున్నాయని సహాయ బృందాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పొంగిపొరలుతున్న గంగా ఉపనదులు గంగా నదికి ఉపనదులైన ధౌలిగంగ, రిషి గంగ, అలకనందా పోటెత్తడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. పౌరి, తెహ్రి, రుద్రప్రయాగ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.‘‘చెవులు చిల్లులు పడేలా శబ్దం వినబడడంతో బయటకి వచ్చి చూశాం. ఎగువ నుంచి రాళ్లతో కూడిన నీటి ప్రవాహం అంతెత్తున ఎగిసిపడుతూ వస్తోంది. ధౌలిగంగా ఉగ్రరూపం, ఆ వేగం చూస్తే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. హెచ్చరించడానికి కూడా సమయం లేదు. నీటి ప్రవాహం పూర్తిగా ముంచేసింది. మేము కూడా కొట్టుకుపోతామనే భయపడ్డాం. దేవుడి దయ వల్ల బయట పడ్డాం’’అని సంజయ్ సింగ్ రాణా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఉత్తరాఖండ్ కోసం దేశం ప్రార్థిస్తోంది: ప్రధాని ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో మాట్లాడుతున్నానని తెలిపారు. దేశం యావత్తూ ఉత్తరాఖండ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. రూ. 4 లక్షల నష్టపరిహారం రిషిగంగ ప్రాజెక్టు టన్నెల్స్లోని నీటి ప్రవాహంలో చిక్కుకొని మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ సీఎం రావత్ రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గంగా పరివాహక ప్రాంత గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద నీరు దిగువకి వస్తే సహాయ చర్యలపై యూపీ సర్కార్ చర్చించింది. రూ.2 లక్షల చొప్పున కేంద్ర పరిహారం ఉత్తరాఖండ్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్(పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు 50వేల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సహాయక చర్యలు చేపట్టండి: సోనియా ఉత్తరాఖండ్ దుర్ఘటనలో గాయపడిన వారికి తక్షణమే సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్వచ్ఛంద సేవలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. మంచు చరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగిలిన వారంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా సంతాపం తెలిపారు. నిలిచిపోయిన 200 మెగావాట్ల విద్యుత్ మంచు చరియలు విరిగిపడడంతో ముందు జాగ్రత్తగా ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, కోటేశ్వర్ హైడ్రో పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో 200 మెగావాట్ల కరెంటు గ్రిడ్‌కు అందలేదు. నేడు ఘటనా స్థలానికి గ్లేసియాలజిస్టులు మంచు చరియలు విరిగిపడడానికి గల కారణాలను అన్వేషించడానికి సోమవారం రెండు గ్లేసియాలజిస్టుల బృందాలు జోషీమఠ్–తపోవన్‌కు చేరుకోనున్నాయని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ తెలిపారు. రెట్టింపు వేగంతో కరుగుతున్న హిమాలయాలు హిమాలయాల్లో నందాదేవి మంచు చరియలు విరిగిపడి ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకోవడానికి కారణాలెన్ని ఉన్నప్పటికీ భారత్ సహా వివిధ దేశాలు మంచు ముప్పులో ఉన్నట్టుగా రెండేళ్ల క్రితమే ఒక అధ్యయనం హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నట్టుగా ఆ అధ్యయనం వెల్లడించింది. 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏడాదికేడాది హిమాలయాల్లోని మంచు కొండలు నిట్టనిలువుగా ఒక అడుగు వరకు కరిగిపోతున్నట్టుగా 2019 జూన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అ«ధ్యయనాన్ని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. 1975 నుంచి 2000 మధ్య కాలంలో కాస్త కాస్త కరిగే మంచు 2000 సంవత్సరం తర్వాత నిలువుగా ఉండే ఒక అడుగు మందం వరకు కరిగిపోతూ ఉండడంతో భవిష్యత్‌లో భారత్ సహా వివిధ దేశాలు జల ప్రళయాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. దాదాపుగా 40 ఏళ్ల పాటు భారత్, చైనా, నేపాల్, భూటాన్ తదితర దేశాల్లోని ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనకారులు పరిశీలించారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా 2వేల కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న 650 మంచుపర్వతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనం చేసి హిమాలయాల్లో మంచు ఏ స్థాయిలో కరిగిపోతోందో ఒక అంచనాకి వచ్చారు. 1975–2000 సంవత్సరం నాటి కంటే 2000–2016 మధ్య ఉష్ణోగ్రతలు సగటున ఒక్క డిగ్రీ వరకు పెరిగాయి. అయితే మంచు మాత్రం రెట్టింపు వేగంతో కరిగిపోవడం ప్రారంభమైందని అధ్యయన నివేదికను రచించిన జోషా మారర్ వెల్లడించారు. అంతేకాదు 21వ శతాబ్దం ప్రారంభం నాటికి ముందు ఏడాదికి సగటున 0.25 మీటర్ల మంచు కరిగితే అప్పటుంచి 0.5 మీటర్ల మంచు కురుగుతున్నట్టు తేలిందని చెప్పారు. 80 కోట్ల మంది వరకు వ్యవసాయం, హైడ్రోపవర్, తాగు నీరు కోసం హిమాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. భవిష్యత్‌లో తీవ్రం నీటి కొరత ఉంటుందని హెచ్చరించింది. మంచు చరియలు ఎందుకు విరిగిపడతాయ్ ..? హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడానికి ఎన్నో కారణాలుంటాయి. మంచు కొండలు కోతకు గురి కావడం, అడుగు భాగంలో ఉన్న నీటి ఒత్తిడి పెరగడం, హిమనీ నదాల కింద భూమి కంపించడం వంటి వాటి కారణాలతో ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడతాయి. హిమనీ నదాల్లో నీటి ప్రవాహం భారీ స్థాయిలో అటు ఇటూ మళ్లినప్పుడు కూడా మంచు చరియలు విరిగిపడుతూ ఉంటాయి. నందాదేవి గ్లేసియర్‌లో సరస్సు ఉన్నట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోందని, ఆ సరస్సు పొంగి పొరలడంతో మంచు చరియలు విరిగి పడి ఉండవచ్చునని ఇండోర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరూక్ అజామ్ చెప్పారు. భారత్‌లోని హిమాలయాల్లో అత్యంత ఎల్తైన పర్వత ప్రాంతం కాంచనగంగలో ఈ నందాదేవి హిమనీనదం ఉంది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇది ప్రపంచంలోనే 23వ ఎత్తయిన పర్వత ప్రాంతం. వాతావరణంలో కలిగే విపరీత మార్పుల వల్ల కూడా నందాదేవిలో మంచు చరియలు విరిగిపడవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. చమోలీ వద్ద రక్షణ చర్యల్లో నిమగ్నమైన భద్రతా బలగాలు చమోలీ వద్ద కొట్టుకుపోయిన జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతం తపోవన్ వద్ద క్షతగాత్రులను మోసుకొస్తున్న ఐటీబీపీ జవాన్లు -
బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి!
న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులకు సెల్యూట్ చేసి వార్తల్లో నిలిచిన ఐదేళ్ల నవాంగ్ నంగ్యాల్ మరోసారి హైలైట్ అయ్యాడు. బుడ్డోడి ‘కడక్’ సెల్యూట్‌కు ఫిదా అయిన ఐటీబీపీ సిబ్బంది అతనికి యూనిఫాం అందించి గౌరవించారు. మిలటరీ యూనిఫాం ధరించి సైనిక కవాతు చేస్తున్న నంగ్యాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, లేహ్‌లోని చుశూల్కు చెందిన కిండర్ గార్టెన్ విద్యార్థి నంగ్యాల్ తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న ఐటీబీపీ సిబ్బందికి గత అక్టోబర్ 11న సెల్యూట్ చేశాడు. అతని దేశభక్తికి ముగ్ధుడైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ సైనిక వందనంలో చిన్నారికి కొన్ని సూచనలు చేశారు. దాంతోపాటు ఆ దృశ్యాలను వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్ అయింది. క్యూట్ సోల్జర్, భవిష్యత్ సైనికుడు, వీరుడు సిద్ధమవుతున్నాడని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. (చదవండి: సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు) -
అంగుళం భూమినీ ముట్టుకోలేరు
లద్దాఖ్: ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్ నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోలేదని, దేశం బలహీనమైంది కానేకాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనాతో ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం లద్దాఖ్ లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన ఆయన లుకుంగ్‌లో ఆర్మీ, ఐటీబీపీ జవా న్లను ఉద్దేశించి ప్రసంగించారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతు న్నాయని చెప్పిన ఆయన అవి ఎంత మేరకు విజయవంత మవుతాయో మాత్రం కచ్చితంగా చెప్పలేమని వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని ఆయన అన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణేలతో కలిసి ఒక రోజు లేహ్ పర్యటనకు వచ్చిన రక్షణ మంత్రి పాంగాంగ్ సో సరస్సు తీరంలోని ఓ స్థావరంలో సైనికాధి కారులతో పరిస్థితిని సమీక్షించారు. సైనిక విన్యాసాలను తిలకించిన రాజ్‌నాథ్ లద్దాఖ్ ప్రాంతంలోని స్టాక్నా ప్రాంతంలో శుక్రవారం జరిగిన మిలటరీ సైనిక విన్యాసాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తిలకించారు. ఆర్మీ, వాయుసేనలకు సంబంధించిన ఆపాచీ, వీ5 యుద్ధ హెలికాప్టర్లు, రుద్ర, మిగ్–17 విమానాలతో పాటు ట్యాంకులు, పదాతిదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. తమ యుద్ధ సన్నద్ధతను చాటాయి. స్టాక్నా ప్రాంతంలో పారాట్రూపర్లు, జవాన్ల పాటవాన్ని ప్రత్యక్షంగా చూడగలిగానని ట్విట్టర్లో రాజ్నా«ద్ వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఏమైనా చేస్తా భారత్ చైనా పరిస్థితిపై ట్రంప్ భారత్, చైనాల మధ్య శాంతి నెలకొనేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపినట్లు వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరుదేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘భారత్, చైనా ప్రజలంటే తనకిష్టమని ట్రంప్ తెలిపారు. ప్రజలకు శాంతిని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానని చెప్పారు’’అని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కేలీ మెక్ఎనానీ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యను ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ సహాధ్యక్షుడు అల్ మాసన్ స్వాగతించడమే కాకుండా.. గత అధ్యక్షుల మాదిరిగా కాకుండా ట్రంప్ బహిరంగంగా భారత్‌కు మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షులు చైనా ప్రయోజనాలు దెబ్బతింటాయేమో అని భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు భయపడేవారని, భారత్ అంటే తనకిష్టమని చెప్పగలిగిన ధైర్యం ట్రంప్‌కు మాత్రమే ఉందన్నారు. -
మన సరిహద్దులు ఆర్మీ చేతుల్లో భద్రం
న్యూఢిల్లీ/గుర్గావ్: దేశానికి చెందిన భూభాగం యావత్తూ మన భద్రతా బలగాల పూర్తి రక్షణలోనే ఉందని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఎస్.ఎస్.దేశ్వాల్ స్పష్టం చేశారు. ఆదివారం గుర్గావ్లో బీఎస్ఎఫ్ ఆధ్వ ర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా జనరల్ దేశ్వాల్ మాట్లాడు తూ..‘మన దేశ భూభాగమంతా మన చేతుల్లోనే ఉంది. పూర్తిగా మన భద్రతా బలగాల అధీనంలోనే ఉంది. మన సరి హద్దులన్నీ సురక్షితంగా ఉన్నాయి. మన బలగాలు చురుగ్గా, సమర్ధంగా, అం కితభావంతో పనిచేస్తున్నాయి. సరిహ ద్దుల్లో ఎలాంటి శత్రువునైనా ఎదు ర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి’అని తెలిపారు. కాగా, ఫింగర్ –4 వద్ద మోహ రించిన బలగాల్లో మరికొన్నిటినీ, పాంగాం గ్ సో సరస్సులో ఉన్న కొన్ని గస్తీ పడవలను చైనా ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఎల్ఏసీ వెంట బలగాల ఉపసంహరణ పూర్తిగా చేపట్టేందుకు అవసరమైన మార్గదర్శకాలకు తుదిరూపం ఇచ్చేందుకు భారత, చైనా బలగాల మధ్య మరో విడత చర్చలు జరగనున్న నేప థ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
10 వేల పడకల కోవిడ్ సెంటర్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ కేర్ సెంటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీలోని చతార్పూర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కేర్ సెంటర్లో 10 వేల పడకలు ఉన్నాయి. దీనికి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అని నామకరణం చేశారు. ఇక్కడ అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటలేటర్లు, ఐసీయూను అనిల్ బైజాల్ పరిశీలించారు. ఈ కేంద్రాన్ని ‘ఆపరేషన్ కరోనా వారియర్స్’ పేరిట ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) నిర్వహిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనాపరమైన సహకారం అందిస్తోంది. 1,700 అడుగుల పొడవు, 700 అడగుల వెడల్పు ఉన్న ఈ కేర్ సెంటర్లో 200 ఎన్క్లోజర్లు ఉన్నాయి. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో 50 చొప్పున పడకలు ఏర్పాటు చేశారు. మొత్తం సెంటర్లో 20 ఫుట్‌బాల్ ఆట స్థలాలను ఇమడ్చవచ్చు. మరో 200 పడకలను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలం ఇంకా మిగిలి ఉంది. లక్షణాలు కనిపించని, లక్షణాలు కనిపించే.. ఇలా రెండు రకాల కరోనా బాధితులకు ఇక్కడ వేర్వేరుగా సేవలందిస్తారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో డీఆర్డీఓ నిర్మించిన 1,000 పడకల సర్దార్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర మంత్రులు సందర్శించారు. -
చైనాకు ధీటుగా.. ఢిల్లీలో
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీలు కరోనాకు హాట్‌స్పాట్స్‌గా మారాయి. జూలై చివరినాటికి ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 5.5లక్షలకు చేరుకుంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా రోగులకు చికిత్స చేయడం కోసం ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని దక్షిణ ఢిల్లీలో నిర్మించారు. ఈ ఆస్పత్రి వివరాలు.. చత్తర్‌పూర్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం రాధాస్వామి సత్సంగ్ బియాస్ కాంప్లెక్స్‌నే ఈ తాత్కాలిక కరోనా ఆస్పత్రిగా మార్చారు. 15 ఫుట్‌బాల్ మైదానాలతో సమానమైన ఈ ప్రత్యేక ఆస్పత్రికి ‘సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్’ అని పేరు పెట్టారు. దీనిలో 10,000 పడకల సామర్థ్యం ఉంది. చైనాలో 10 రోజుల్లో నిర్మించిన కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రి కన్నా ఇది పదింతలు పెద్దది కావడం విశేషం. (సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానని చెప్పి..) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. దాదాపు 1000 మంది జనరల్ డాక్టర్లతో పాటు ఇతర సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నారు. మొత్తం బెడ్స్ని 10 విభాగాలుగా విభజిస్తారు. వీటిలో 1000 పడకలకు ఆక్సిజన్ పాయింట్లు అమర్చుతారు. రోగుల కోసం 5 వేల ఫ్యాన్లు, 1000 మూత్రశాలలు ఏర్పాటు చేశారు. లక్షణాలు కనిపించని కరోనా పాజిటివ్ రోగులకు.. తక్కువ లక్షణాలు ఉన్న వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. అయితే ఈ ఆస్పత్రిలో తొలుత 2,000 పడకలు అందుబాటులోకి రానుండగా.. జూలై 3 వరకు పూర్తి స్థాయిలో బెడ్స్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఐటీబీపీ దేశంలో తొలిసారి కరోనా పేషంట్ల కోసం జనవరిలో నైరుతి ఢిల్లీలోని చావ్లాలో 1,000 పడకల కేంద్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. (స్మైల్ ప్లీజ్.. కరోనాతో క్లోజ్..!) ఇదేకాక డీఆర్డీఓ మరో 1,000 పడకల ఎయిర్ కండిషన్డ్ ఆస్పత్రిని సిద్ధం చేస్తోంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా ఒక్కొక్క దానిలో 250 పడకలు ఉంటాయి. వాటిలో ఒక విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. -
చర్చలు.. చర్యలు!
న్యూఢిల్లీ: ఒకవైపు చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. మరోవైపు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కి ఇరువైపులా బలగాలు, ఇతర సైనిక సంపత్తి మోహరింపును భారత్, చైనాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. భారత సైన్యంతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కూడా సరిహద్దు కేంద్రాలకు సుశిక్షితులైన అధికారులు, ఇతర సిబ్బందిని తరలిస్తోంది. ఆర్మీకి మద్దతుగా మరిన్ని ఐటీబీపీ బలగాలను సరిహద్దులకు తరలించాలని శనివారం లెఫ్ట్‌నెంట్ జనరల్ పరంజిత్ సింగ్, ఐటీబీపీ చీఫ్, మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్ లేహ్‌ను సందర్శించిన అనంతరం నిర్ణయించారు. ‘జూన్ 15 ఘటనకు ముందే కొన్ని కంపెనీల బలగాలను లద్దాఖ్‌కు పంపించాం. ఇప్పుడు మరిన్ని బలగాలను తరలించాలని నిర్ణయించాం’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సైనిక కేంద్రాల్లో ఆర్మీకి సహకారంగా ఐటీబీపీ నుంచి ప్లటూన్ల స్థానంలో కంపెనీలను మోహరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఘర్షణాత్మక గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి నేటికి కూడా ఉద్రిక్తంగానే ఉంది. రెండు దేశాల మిలటరీ అధికారుల మధ్య జరుగుతున్న చర్చల్లో.. ఏప్రిల్ 30, 2020 నాటికి ఉన్న యథాతథ స్థితి నెలకొనాలని భారత్ డిమాండ్ చేస్తోంది. గల్వాన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్‌లోని 14, 15, 17 పెట్రోలింగ్ పాయింట్స్(పీపీ)లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, పీపీ 14, పీపీ 15 దగ్గరలో చైనా పలు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. అలాగే, పీపీ 17 వద్దకు పెద్ద ఎత్తున సైనికులను తరలించింది. దాంతో, పీపీ 17 వద్ద భారత్ కూడా సైనికుల సంఖ్యను పెంచింది. ప్యాంగ్యాంగ్ సరస్సులోని ‘ఫింగర్ 4’ వరకు చైనా దళాలు చేరుకున్నాయి. అక్కడికి చైనా బోట్లు, ఇతర వాహనాలను కూడా తరలించింది. దాంతో భారత్ కూడా అక్కడ దళాలను మోహరించింది. చర్చలు జరపండి లండన్: భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉంది’ అని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. పరిస్థితిని బ్రిటన్ నిశితంగా గమనిస్తోందన్నారు. వివాద పరిష్కారానికి చర్చలు జరపాలని భారత్, చైనాలకు సూచించారు. -
రిపబ్లిక్ డే పరేడ్‌కు మొదలైన సన్నాహాలు
-
ఐటీబీపీకి పెళ్లిళ్ల వెబ్సైట్
న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ సరిహద్దు దళం (ఐటీబీపీ)లో పనిచేస్తున్న బ్రహ్మచారుల కోసం ఐటీబీపీ ఒక పెళ్లిళ్ల వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఐటీబీపీలో పనిచేసే సిబ్బందికి సరిపడే జీవిత భాగస్వామిని వెతికిపెట్టేందుకే ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు ఐటీబీపీ వర్గాలు తెలిపాయి. ఐటీబీపీలో ప్రస్తుతం 25 వేల మంది అవివాహిత పురుష, వేయి మంది అవివాహిత మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించాయి. వీరు సరిహద్దులోని మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తుండటం వల్ల జీవిత భాగస్వామిని వెతకడం వారి కుటుంబాలకు కష్టంగా మారుతోందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. దళంలో ప్రస్తుతం 333 జంటలు (భార్యాభర్తలు) పనిచేస్తున్నాయి. ఐటీబీపీలో పనిచేసే చాలా మంది సంస్థలోనే పనిచేసే భాగస్వామి కావాలని కోరుకుంటున్నారని, క్లిష్ట పరిస్థితుల్లో వారు పనిచేస్తున్న రీత్యా భాగస్వామితో కలసి పనిచేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందని అనుకుంటున్నారని తెలిపారు. ఈ వెబ్సైట్లో అవివాహిత లేదా భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న, విడాకులు తీసుకున్న సైనికులు నమోదు చేసుకోవచ్చనితెలిపారు. ఇప్పటివరకు ఈ వెబ్సైట్లో 150 మంది నమోదు చేసుకున్నారు. సాయుధ బలగాల్లోని మొత్తం 10 లక్షల మందిలో 2.5 లక్షల మంది అవివాహితులు. -
ఛత్తీస్‌లో దారుణం
చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా కదేనార్ క్యాంపులో దారుణం జరిగింది. కదేనార్ ఐటీబీపీ 45వ బెటాలియన్ క్యాంపులోని మసుదుల్ రహమాన్ అనే జవాన్ బుధవారం ఉదయం తన సర్వీస్ గన్‌తో అయిదుగురు సహచర జవాన్లను కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రహమాన్‌ను అడ్డుకోబోయిన మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. జవాన్ కాల్పులకు దిగడానికి గల కారణాలు తెలియనప్పటికీ.. సెలవు మంజూరు చేయలేదని మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని పేర్కొన్నారు. -
సహచరులపై జవాన్ కాల్పులు.. 6 గురు మృతి
రాయ్‌పూర్ : ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల మధ్య తలెత్తిన వివాదం.. కాల్పులకు దారితీసింది. దీంతో ఆవేశానికి లోనైన ఓ జవాన్ తన సహచరులపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పులో అతనితో పాటు మరో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణపూర్‌లోని కేదార్‌నార్ క్యాంప్‌లోని ఐటీబీపీ 45వ బెటాలియన్‌కు చెందిన కొందరు జవాన్ల మధ్య బుధవారం ఉదయం వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా ఆగ్రహానికి లోనైన ఐటీబీపీ కానిస్టేబుల్ మసుదుల్ రెహమాన్.. తన సర్వీస్ రివాల్వర్‌తో సహచరులపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రెహమాన్‌తో సహా 6గురు జవాన్లు మరణించగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హెలికాఫ్టర్‌లో రాయ్‌పూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని బస్తర్ రెంజ్‌ఐజీ సుందర్రాజ్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై సుందర్రాజ్ మాట్లాడుతూ.. ‘జవాన్ల మధ్య వివాదం తలెత్తడంతో రెహమాన్.. తన తోటి సహచరులపైకి కాల్పులు జరిపాడు. అయితే రెహమాన్ తనను తాను కాల్చుకున్నాడా లేక అతని సహచరులు ఎదురుకాల్పులు జరపడం వల్ల మరణించాడా అనేది తెలియాల్సి ఉంది. ఇందుకోసం ఈ ఘటనలో చనిపోయిన జవాన్ల రివాల్వర్లను పరిశీలించాల్సి ఉంద’ని తెలిపారు. మృతులను ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్స్ దుల్జీత్, ఎమ్ సింగ్, కానిస్టేబుల్స్ సుజిత్ సర్కార్, బిశ్వరూప్, బ్రిజేష్‌లుగా గుర్తించారు. గాయపడ్డవారిలో కానిస్టేబుల్స్ ఎస్బీ ఉల్లాస్, సీతారామ్‌లు ఉన్నారు. -
కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర
-
మంచుకొండల్లో భారత పతాక రెపరెపలు
-
ఐటీబీపీ జవాన్లకు పుట్టిన రోజు కానుక
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దులను కాపాడే జవాన్లు తమ పుట్టినరోజు వేడుకలను పనిచేస్తున్న చోటే జరుపుకునే అవకాశాన్ని ఇండో–టిబెటన్ సరిహద్దు రక్షక దళం(ఐటీబీపీ) కల్పించింది. పుట్టిన రోజు జరుపుకునే జవానుకు సగం రోజు సెలవు ఇవ్వడంతోపాటు యూనిట్ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేయించి, ఉన్నతాధికారులు బొకే అందజేయనున్నారు. సెలవు, ప్రత్యేక విధుల సమయంలో తప్ప యూనిట్లో ఉన్న ప్రతి జవాను కూడా బర్త్‌డే వేడుక జరుపుకోవాలని కోరారు. సిబ్బందిలో ఐకమత్యం, ఆత్మవిశ్వాసం పెంచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఐటీబీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీబీపీ విభాగాలను కోరింది. దీని ప్రకారం ఇకపై స్త్రీ లేదా పురుష జవానుకు బర్త్‌డే నాడు సగం రోజు ఇవ్వనున్నారు. ఆ రోజు ఉన్నతాధికారులు బొకే అందించి శుభాకాంక్షలు తెలుపుతారు. యూనిఫాం బదులు తమకు ఇష్టమైన దుస్తులు ధరించి తోటి సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసే అవకాశం ఇస్తారు. అంతేకాకుండా, తమ సంతానాన్ని దేశ రక్షణ విధులకు పంపినందుకు గాను తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరాలు కూడా పంపనున్నారు. దీంతో పటియాలాలోని 51వ బెటాలియన్ కమాండింగ్ అధికారితోపాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోహిత్ జిల్లాలో ఉన్న ఐటీబీపీ ‘ఎనిమల్ ట్రాన్స్పోర్ట్’విభాగం డీఐజీ సుధాకర్ నటరాజన్ జవాన్ల పుట్టిన రోజు వేడుకలు జరిపారు. -
చైనా సరిహద్దుల్లో 50 శిబిరాలు!
నోయిడా: భారత్–చైనా సరిహద్దుల్లో పహారా కాసే ఐటీబీపీ (ఇండో–టిబెటన్ సరిహద్దు దళం) సిబ్బంది కోసం 50 ఉష్ణ నియంత్రిత శిబిరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో దాదాపు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పనిచేస్తుంటారనీ, వారి కోసం 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఈ శిబిరాలను రూపొందించేందుకు యోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఐటీబీపీ 56వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బంది ప్రయోజనాల కోసం రాజ్‌నాథ్ పలు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో 25 సరిహద్దు రహదారులను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. సరిహద్దుల్లో ఉపగ్రహా, మొబైల్ కనెక్టివిటీని కూడా పెంచుతామన్నారు. ఐటీబీపీలో సేవలందిస్తున్న ఒక అశ్వం, ఒక జాగిలాన్ని రాజ్‌నాథ్ నాలుగు కాళ్ల హీరోలుగా పేర్కొంటూ వాటికి పతకాలు ప్రదానం చేశారు. -
డోక్లాంలో రక్షణ మంత్రి
సాక్షి, గ్యాంగ్‌టక్ : డోక్లాం, సిక్కింలో పర్యటిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ఆదివారం నాథూలా పాస్‌ను పరిశీలించారు. ఈ సమయంలో సరిహద్దు కంచె దగ్గర పహారా కాస్తున్న చైనా సైనికులు ఆమెను ఫొటోను తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇదే విషయాన్ని ఆమె ట్వీట్ ద్వారా తెలిపారు. సిక్కి, అరుణాచల్ ప్రదేశ్‌లోని కీలక ప్రాంతాలను ఆమె ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డు మార్గం ద్వారా నాథూలా పాస్‌కు చేరుకున్నారు. అక్కడే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాథూలా పాస్ చేరుకున్న రక్షణమంత్రికి ఈస్ట్రన్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఆభయ్ కృష్ఱ గార్డ్ ఆనర్ ద్వారా గౌరవించారు. నాథూలా పాస్ నుంచి డోక్లాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును ఆమె ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సిక్కింలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని పరిశీలించారు. Upon arrival Smt @nsitharaman is accorded with a Guard of Honor at Nathu-la pic.twitter.com/UdVGnAyRh1 — Raksha Mantri (@DefenceMinIndia) 7 October 2017 Smt @nsitharaman interacts with the Vice Chief of Army Staff and other senior army official at the BPM Hut at Nathu-la pic.twitter.com/NKruYI7SbZ — Raksha Mantri (@DefenceMinIndia) 7 October 2017 -
చైనా బరితెగింపు.. సంచలన వీడియో
- లడఖ్‌లో భారత జవాన్లపై రాళ్లు, రాడ్లతో దాడి - డ్రాగన్ దుశ్చర్య వీడియో వైరల్.. అధికారుల మౌనం న్యూఢిల్లీ: భారత జవాన్లపై చైనా సైనికులు దాడిచేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. లడఖ్(జమ్ముకశ్మీర్)లోని ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద ఆగస్టు 15న ఈ ఘటన చోటుచేసుకుంది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన చైనా సైన్యం.. అక్కడ గస్తీకాస్తోన్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) బలగాలపై దుశ్చర్యకు దిగింది. రాళ్లు విసురుతూ, ఇనుపరాడ్లతో కొడుతూ బీభత్సం సృష్టించింది. ప్రతిగా భారత బలగాలు సైతం రాళ్లు విసిరాయి. పరస్పరం కాళ్లతో తన్నుకున్న దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. స్వాతంత్ర్యదినోత్సవం నాడే జరిగిన ఈ సంఘటనపై భారత్ నిరసనను వ్యక్తం చేసినప్పటికీ, చైనా మాత్రం దుందుడుకుగా సమాధానమిచ్చింది. ‘అవునా! మా వాళ్లు బోర్డర్ దాటిన సంగతి నాకు తెలియదు’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యుంగ్ వెటకారాన్ని ప్రదర్శించారు. అయితే, తాజాగా వీడియో బహిర్గతం కావడంతో చైనా దుష్టత్వం బయటపడినట్లైంది. ప్యాంగ్యాంగ్ సరస్సు మూడొంతుల భాగం చైనా ఆధీనంలో ఉండగా, ఒక వంతు భారత్ ఆధీనంలో ఉంది. భారత్ సంయమనం: ఆగస్టు 15న ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద చోటుచేసుకున్న ఘటనపై ఆ తర్వాతి రోజు(బుధవారం) కీలక సమావేశం జరిగిందని సైనిక వర్గాలు తెలిపాయి. చుషుల్(లేహ్) సెక్టార్లో ఇరుదేశాల అధికారుల భేటీలో.. భారత్ నిరసన తెలపగా, తప్పందా మీదేనని డ్రాగన్ ఎదురుదాడికి దిగింది. చైనా వాదన తప్పని నిరూపించడానికే ఇప్పటి వీడియో బహిర్గతపర్చినట్లు సమాచారం. ఈ విషయంపై భారత అధికారులు ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నారు. సిక్కింలోని డోక్లాం వద్ద చైనా రోడ్డు నిర్మాణానికి భారత్ అడ్డు తగలడంతో మొదలైన ఉద్రిక్తత.. గడిచిన రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. మొత్తం ఐదు సరిహద్దుల వద్ద ఇరు దేశాలూ భారీగా సైన్యాన్ని మోహరించాయి. (వీడియోలో ఎడమవైపు ఉన్నది చైనా, కుడివైపు భారత జవాన్లు) -
సైనికులపట్ల మరోసారి గౌరవాన్ని చాటుకున్న నటుడు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ మరోసారి సైనికుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. ఇండియా–చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించాడు. అక్కడ విధులు నిర్వర్తించే సైనికులను, అధికారులను కలిశాడు. ఈ విషయమై ఐటీబీపీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘అక్షయ్ స్వయంగా ఇక్కడికి వచ్చి సైనికులను, సైనికాధికారులను కలిశాడు. సైన్యంపట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించి, సైనికులు పడుతున్న కష్టాలను గుర్తించాడ’ని చెప్పారు. సైనికులు ఉపయోగించే ఆయుధాలు, ఇతర పరికరాలను స్వయంగా వీక్షించాడని, వాటి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడని తెలిపారు. ప్రమాదకరమైన ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో తాము విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటామో వివరించామన్నారు. మరోవైపు అక్షయ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. ‘అంతటి ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వర్తిస్తున్న సైనికుల కష్టమేంటో నాకు తెలుసు. చావును కూడా లెక్కచేయకుండా వారు చూపుతున్న పోరాటపటిమ అసాధారణమైంది. ఐటీబీపీ పోలీసులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. వారిని కలవడం వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం లేదు. కేవలం గౌరవభావంతోనే వారి వద్దకు వెళ్లాన’ని ట్విటర్లో పేర్కొన్నాడు. -
ఈసారి ఐటీబీపీతో మోదీ దీపావళి
-
ఈసారి ఐటీబీపీతో మోదీ దీపావళి
న్యూఢిల్లీ: దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం దీపావళికి చైనా సరిహద్దుల్లోని ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ)తో కలిసి మోదీ వేడుకలు చేసుకోనున్నారు. ఇందుకోసం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మనా అనే గ్రామానికి ఆయన వెళ్లనున్నారు. చైనా ైవె పున భారత భూభాగంలోని చిట్టచివరి గ్రామం ఇదే. మోదీతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా మనాకు వెళ్తారు. 2014 దీపావళిని సియాచిన్‌లోనూ, గతేడాది పండుగను పంజాబ్ సరిహద్దుల్లోనూ మోదీ జవాన్లతో కలసి జరుపుకున్నారు. మరోవైప# #Sandesh2Soldiers ద్వారా సైనికులకు శుభాకాంక్షలు పంపాలన్న మోదీ వినతికి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటిదాకా 10 లక్షల సందేశాలు వచ్చాయి. ధన త్రయోదశి సందర్భంగా శుక్రవారం మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. -
పిరికిపందలే ఇలా దాడి చేస్తారు: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ చర్యలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. గ్రేటర్ నోయిడాలో ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్(ఐటీబీపీ) 55వ వ్యవస్థాపక దినోత్సవంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. భారత్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆశ్రయించడాన్ని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. దాయాది దేశం ఎప్పుడూ ఇదే తరహాలో ఉగ్రచర్యలకు పాల్పడుతుందని, పిరికివాళ్లే టెర్రరిజాన్ని ఆయుధంగా చేసుకుని దాడులు చేస్తారని అన్నారు. ధైర్యవంతులు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడరని, పాక్ మాత్రం భారత్ ను ఏదో రకంగా దెబ్బతీయాలని విశ్వప్రయత్నాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ సక్సెస్ సాధిస్తున్న దేశాలలో భారత్ ఒకటని రాజ్ నాథ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న జమ్ముకశ్మీర్ ఉడీలో ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి తర్వాత పాక్ తన దాడులను మరింతగా కొనసాగిస్తుందని చెప్పారు. పాక్ పై భారత ఆర్మీ మొదటగా కాల్పులు జరపదని, ఒకవేళ దాయాది దేశం దాడులకు పాల్పడితే మాత్రం ధీటుగా జవాబిస్తామని రాజ్ నాథ్ తెలిపారు. భారత్ అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి విషయంపై మీడియా ప్రశ్నించగా.. ప్రభుత్వం ఈ తప్పక చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద శుక్రవారం వేకువజామున బీఎస్ఎఫ్ బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 15 మంది పాక్ జవాన్లు హతమైన విషయం తెలిసిందే. -
చైనా సరిహద్దుల్లో మహిళా జవాన్లు
గ్రేటర్ నోయిడా: ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) తొలిసారి చైనాతో ఉన్న సరిహద్దుల్లో 15 చోట్ల మహిళలను మోహరించింది. యుద్ధ నైపుణ్యాలు, ఆయుధాల వాడకంలో సుశిక్షితులైన 100 మంది మహిళా జవాన్లను విధుల్లో చేర్చినట్లు ఐటీబీపీ తెలిపింది. ఎక్కువ మందిని కశ్మీర్‌లోని లఢాక్ సరిహద్దులో ఉన్న బీఓపీకి, మరికొంత మందిని హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణా^è ల్ సరిహద్దుల్లోకి పంపామంది. 8–14 వేల ఎత్తున్న క్లిష్ట వాతావరణంలో వీరు పనిచేయాలి. -
'అమ్మాయిల రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేయొద్దు'
న్యూఢిల్లీ: భారత భద్రతాదళాల కీలక సమాచారాన్ని తస్కరించడానికి పొరుగు దేశాల గుఢాచార సంస్థలతో పాటూ పలు తీవ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ క్రిష్ణ చౌదరి వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో పనిచేస్తున్న అధికారులు, జవాన్లు మొబైల్ యాప్‌ల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పాకిస్తాన్, చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు కొన్ని యాప్‌ల ద్వారా మొబైల్లోని సమాచారాన్ని తస్కరించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అంతే కాకుండా ఎవరైనా తెలియని వారి నుంచి ముఖ్యంగా అమ్మాయిల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దని హెచ్చరించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని వీచాట్(WeChat), స్మెష్(Smesh), లైన్(Line)వంటి యాప్ లను అధికారులు, జవాన్లు వాడకూడదని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. జవాన్లు వాడే స్మార్ట్ ఫోన్ల నుంచే విదేశాలకు చెందిన గూఢచార సంస్థలు ఆన్లైన్ ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించగలిగే అవకాశం ఉందని హెచ్చరించింది. వీరే కాకుండా పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, తీవ్రవాద సంస్థలకు చెందిన హ్యాకర్లు కూడా భారత రహస్య సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరు ముఖ్యంగా జవాన్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందమైన అమ్మాయిల ప్రొఫైల్ పిక్ల తో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాట్ చేయడానికి మరో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. అనంతరం సదరు యాప్ ఇన్స్టాల్ అవ్వగానే వారు మొబైల్లోని కీలక సమాచారాన్ని(కాంటాక్ట్స్, మెసేజ్‌లు, వీడియోలు, జీపీఎస్ లొకేషన్) హ్యాక్ చేయగలుగుతున్నారు. కాగా ఈ యాప్‌ల ద్వారా ఎదురయ్యే దారుణమైన పరిణామాల గురించి తెలియని వారు ఇంకా వీటిని వాడుతున్నారని, ఏమౌతుందిలే అని వ్యవహరిస్తే చాలా ప్రమాదకరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుందని క్రిష్ణ చౌదరి హెచ్చరించారు. -
నక్సల్స్‌పై పోరుకు 100 ‘కమాండాగ్స్’
న్యూఢిల్లీ: మందుపాతర్ల నుంచి బలగాలను కాపాడేందుకు, నక్సల్స్ మెరుపుదాడులను ముందే పసిగట్టి హెచ్చరించేందుకు ప్రభుత్వం 100కుపైగా ప్రత్యేక జాగిలాలకు శిక్షణ ఇస్తోంది. ‘కమాండాగ్స్’గా పిలిచే వీటిని నక్సల్స్ గాలింపు చర్యలకు వెళ్లే సీఆర్పీఎఫ్ వంటి పారామిలిటరీ బలగాల వెంట మోహరించనుంది. మందుపాతరల తాకిడి నుంచి యాంటీమైన్ప్రూఫ్ వాహనాలు రక్షణ కల్పించలేక పోతుండటంతో ఇకపై పదాతి దళాలు ఈ జాగిలాలే ముందుండి నడిపించనున్నాయి. బెల్జియన్ షెపర్డ్ జాతికి చెందిన ‘మాలినోయిస్’ రకం శునకాలను దేశంలో తొలిసారిగా 2011లో ఐటీబీపీలో ప్రవేశపెట్టారు. దీంతో వీటికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కేంద్రం ఐటీబీపీకి అప్పగించింది. శుత్రువుల జాడను పసిగట్టి దాడులు చేసేందుకు చాలా దేశాల సైన్యాలు ఈ శునకాలనే వాడుతున్నాయి. పాకిస్థాన్‌లో తలదాచుకున్న అల్‌కాయిదా చీఫ్ లాడెన్ జాడను పసిగట్టి అమెరికా నేవీ సీల్స్ దళాలు మట్టుబెట్టేలా సాయం చేయడం ద్వారా ‘మాలినోయిస్’లు ప్రపంచ ఖ్యాతి ఆర్జించాయి. వీటికి శిక్షణ అనంతరం నక్సల్స్ ఏరివేత చర్యల్లో పాల్గొనే ఒక్కో బెటాలియన్ వెంట కనీసం ఒక్కో ‘కమాండాగ్’ను మోహరించాలని యోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. నక్సల్స్ ప్రాంతాల్లోని బెటాలియన్ క్యాంపుల్లో ఉండేందుకు వీలుగా ఈ కుక్కలకు, వాటి శిక్షకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు కమాండోలకు సరిసమానంగా పనిచేసే సామర్థ్యమున్నందుకే వీటికి ‘కమాండాగ్స్’ అని పేరుపెట్టారు.