డోక్లాంలో రక్షణ మంత్రి

Nirmala Sitharaman visit the Nathu La

ఏరియల్‌ సర్వే నిర్వహించిన నిర్మలా సీతారామన్‌

ఐటీబీపీ జవాన్లతో చర్చలు

రక్షణ మంత్రి గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చిన సైనికులు

సాక్షి, గ్యాంగ్‌టక్‌ : డోక్లాం, సిక్కింలో పర్యటిస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ ఆదివారం నాథూలా పాస్‌ను పరిశీలించారు. ఈ సమయంలో సరిహద్దు కంచె దగ్గర పహారా కాస్తున్న చైనా సైనికులు ఆమెను ఫొటోను తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇదే విషయాన్ని ఆమె ట్వీట్‌ ద్వారా తెలిపారు. సిక్కి, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కీలక ప్రాంతాలను ఆమె ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రోడ్డు మార్గం ద్వారా నాథూలా పాస్‌కు చేరుకున్నారు. అక్కడే ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాథూలా పాస్‌ చేరుకున్న రక్షణమంత్రికి ఈస్ట్రన్‌ కమాండెంట్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆభయ్‌ కృష్ఱ గార్డ్‌ ఆనర్‌ ద్వారా గౌరవించారు. నాథూలా పాస్‌ నుంచి డోక్లాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దును ఆమె ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం సిక్కింలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని పరిశీలించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top